Aloo Curry Recipe | Easy Village Style Aloo Curry at Home

ఆలు కర్రీ ( aloo curry ): సులభంగా ఇంట్లోనే తయారు చేసుకునే విలేజ్ స్టైల్ ఆలు కర్రీ

ప్రతి ఒక్కరూ సులభంగా మరియు త్వరగా తయారు చేసుకునే ఏకైక కూర ఆలు కర్రీ. మనం తినే చపాతీల్లోకి రైస్ లోకి మరియు పుల్కాల్లోకి ఇట్లాంటి వాటిల్లో గోడే చాలా విధాలుగా వండుకునేటట్లు ఆలు కర్రీ ఉంటుంది.

మనం వండుకునే పద్ధతిని బట్టి దాని టేస్ట్ మారుతుంది. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా ఆలు కర్రీ వండుతారు. ఆలు అనేవి కర్రీ గానే కాకుండా దానికి రైస్ ఐటమ్స్ కాదు కూడా చేస్తారు ఫ్రై మరియు కుర్మా కూడా వాడుకోవచ్చు.

ఇలా ఎన్నో విధంగా తయారు చేసుకోగలం ఆరు కర్రీని నేను మాత్రం ఇప్పుడు సులభంగా పది నిమిషాల్లో వండుకునే ఆలు కర్రీని చెప్తున్నాను. పూర్తిగా మీరు చదవడం వల్ల వంట రాని వాళ్ళు కూడా సులభంగా వండుకునే విధంగా ఉంటుంది ఈ రెసిపీ.

ఆలు కర్రీ కి కావలసిన పదార్థాలు :

  • ఆలులు 500 గ్రాములు 

  • టమాటాలు రెండు 

  • ఉల్లిపాయ ఒకటి 

  • పచ్చిమిరపకాయలు రెండు 

  • కరివేపాకు ఒక రమ్మ 

  • కొత్తిమీర ఒకరమ్మ 

  • జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ 

  • ఆవాలు ఆఫ్ టేబుల్ స్పూన్ 

  • పచ్చనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ 

  • ఎండు మిరపకాయలు రెండు 

  • నూనె నాలుగు టేబుల్ స్పూన్లు 

  • పసుపు 1/2 టేబుల్ స్పూన్ 

  • కారం వన్ టేబుల్ స్పూన్ 

  • ఉప్పు రుచికి తగినంత 

  • నీళ్లు సరిపడా 

  • అల్లం చిన్న ముక్క 

  • చిన్న ఉల్లిపాయలు ఒక పాయ

  • గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ 

  • ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ 

  • జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ 

 

ముందుగా కర్రీ తయారీ కి మనం కూరగాయలు కట్ చేసుకునే విధానం : ( vegetables cutting process )

ముందుగా 500 గ్రాములు ఉల్లగడ్డలను కుక్కర్లో వేసి హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.

ఉడికించిన ఉల్లగడ్డలను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

టమాటాలను కొంచెం మీడియం సైజులో ముక్కలు చేసుకొని పక్కన. లేదా టమాటాలు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్న సరిపోతుంది.

ఉల్లిపాయలు చిన్నగా తరుగుకొని ఉంచుకోవాలి దాంతో పాటు ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగించుకోవాలి.

కొత్తిమీర మరియు కరివేపాకును శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి కట్ చేసుకుని పక్కన ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

అల్లం తొక్క తీసి శుభ్రంగా కడుక్కొని ఇందులో ఒక పాయచునులపై వేసి మెత్తటి పేస్ట్ గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం.

ఆలు కర్రీ తయారీ విధానం :

ముందుగా వెడల్పాటి బాండి తీసుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు మరియు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు మరియు రెండు ఎండు మిరపకాయలు వేసి కాస్త వేయించుకోవాలి.

ఇప్పుడు పోపు దినుసులు అన్ని కాస్త రంగు మారిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మరియు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం బంగారు వచ్చేంత వరకు వేయించుకోవాలి.

ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఆల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న కరివేపాకుని ఒకరమ్మ వేసి మంచి క్రిస్పీ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరుక్కున్న టమాటాలు లేదా కొంచెం పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకున్న టమాటాలను పేస్ట్ యాడ్ చేసుకుని కాస్తంత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.

అంటే టమాటాలు అయితే మెత్తగా పేస్ట్ గా లేదా సాఫ్ట్ గా అయ్యేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది లేదా పేస్ట్ గాని యాడ్ చేస్తే టమాటాలు ప్యూరీ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి..

ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న అలువులు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నా ఆలూ వేసి బాగా పసుపు ఉప్పు కలిసేటట్లు కలుపుకొని ఒక రెండు నిమిషాలు పాటు వేయించుకోవాలి.

ఇప్పుడు మనం ఇందులోకి కాస్తంత కారం అంటే వన్ టేబుల్ స్పూన్ కారం లేదా మీకు రుచికి సరిపడా కారం వేసుకొని ఇందులోని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి మరియు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి.

తరువాత మన గ్రేవీకి సరిపడాన్ని నీరు పోసుకొని ఒక 10 15 నిమిషాల పాటు దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి.

చివరన ఉప్పు సరిపడిందో లేదో చూసుకొని మన రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన ఆలూ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే.

తరచూ చేసే తప్పులు:

ఉల్లగడ్డలు అనేవి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు ఎందుకంటే మెత్తగా అయిపోతాయి.

టమాటా అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి లేకపోతే కూర అనేది పచ్చి వాసన వచ్చేస్తుంది.

అల్లం అనేది శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని చెక్కు తీసుకొని ముక్కలా కట్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. లేదంటే అందులో ఉన్న ఇసుక కర్రీలోకి వెళ్ళిపోతుంది.

కరివేపాకు కొత్తిమీర కడుక్కునేటప్పుడు కాస్తంత ఉప్పు వేసి కడగటం వల్ల అందులో ఉన్న మట్టి ఏదైనా ఉంటే తొలగిపోతుంది.

మనం కర్రీ లో కారం వేసిన తర్వాత ఎక్కువగా నీరు పోయకూడదు మనకు కావాల్సిన గ్రేవీ కన్సల్టెన్సీ బట్టి కర్రీ వేసుకోవాలి..

Frequently Asked Questions About Aloo Curry

1.ఉల్లగడ్డలు ఎన్ని విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి?

ఉలగడ్డలు కుక్కర్లో అయితే రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.

లేదా దీక్షలు అయితే 15 నిమిషాల పాటు నీరు పోసి ఉడికించుకోవాలి 

2.టమాటాలు ఎన్ని వేసుకోవచ్చు?

అరకిలో కూరకి కనీసం రెండు మూడు టమాటాలు అన్న వేసుకోవచ్చు ఎక్కువ కూడా వేయకూడదు కూర అనేది తీపి వస్తుంది.

3.మనం కర్రీలో ఎన్ని నీళ్లు పోసుకోవాలి?

మీకు కావాల్సిన గ్రేవీను బట్టి నీరు పోసుకోవచ్చు.

4.అల్లం వెల్లులి పేస్ట్ తప్పనిసరిగా వేయాలా?

అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యకపోయినా మనం వేసే గరం మసాలా ధనియాల పొడి వల్ల కర్రీ అనేది మంచి సువాసన వస్తుంది.

5.ఆలు కర్రీ మంచి రుచిగా రావాలంటే తప్పకుండా పాటించాల్సిన టిప్ ఏమిటి?

ఆలు కర్రీ అనేది చాలా రుచిగా రావాలంటే మనం ఎక్కువ సార్లు గరిట పెట్టి తిప్పకూడదు ఎందుకంటే ఉడికించిన ఆలుగడ్డలు కాబట్టి చిదిరిపోతాయి.

ముఖ్యంగా కూర అనేది మీడియం ఫ్లేమ్ లో ఉండి ఉడికించుకుంటే చాలా రుచిగా ఉంటుంది మనం వేసే మసాలాలన్నీ సరితూలంగా పడ్డాయో లేదో చెక్ చేసుకుంటే చాలు.

ఆలు కర్రీలో లభించే పోషకాలు :

ఆలు కర్రీలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి మరియు ఇందులో ఫైబర్ కంటెంట్ మరియు పొటాషియం విటమిన్ సి మరియు విటమిన్ B6 కూడా లభిస్తాయి.

ఇందువల్ల మన బాడీలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది మరియు ఫైబర్ వల్ల మన జీర్ణ క్రియ అనేది మెరుగుపడుతుంది.

ఆలు కర్రీ దేనితో తింటే బాగుంటుంది :

  •  వైట్ రైస్

  •  బాగారా రైస్ 

  •  చపాతి 

  •  రోటి 

  •  నాన్ 

  •  ఫుల్కా 

  •  దోస 

  •  వెజిటేబుల్ రైస్ 

  •  పూరి

ముగింపు:

తక్కువ కూరగాయలతో మరియు తక్కువ మసాలాతో చాలా సులభంగా మరియు చాలా త్వరగా తయారు చేసుకునే ఒకే ఒక వంటకం ఆలు కర్రీ.

మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మరియు ఇతర రాష్ట్రాల్లో కానీ తెలియని ఏదైనా ఉందంటే అది ఆలు కర్రీ మాత్రమే.

చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల వరకు ఇష్టంగా తినేదే ఆలు కర్రీ. కర్రీ గానే కాదు ఫ్రీగా కూడా మరియు కుర్మా కూడా తయారు చేసుకోగలము ఈ ఆలు ని.

నేను చెప్పిన రెసిపీని ఫాలో అవ్వటం వల్ల ఇంట్లోనే చాలా సులభంగా మరియు మంచి కూరగాయలు వాడి హెల్తీగా తయారు చేసుకోవాలని ఆలూ కర్రీని ఇంట్లోనే.

Leave a Comment