Pani Puri Recipe: How to Make Crispy Pani Puri at Home

Pani Puri Recipe | How to Make Delicious Pani Puri at Home

ఇంట్లోనే రుచికరమైన పానీ పూరి చేయటం ఎలా? మనకు నచ్చే విధంగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి?- పానీ పూరి తయారీ- ( pani puri )పానీ పూరి రెసిపీ :-చిన్న వాళ్లకి పెద్ద వాళ్లకి తేడా లేకుండా తినేదే ఈ పానిపూరి. మన తెలుగుదేశంలో ఈ పానీ పూరి చాటు మరియు పానీ పూరి తెలియని వాళ్ళు ఎవరూ లేరు.ఆ దేశానికి బట్టి దాని పేరు మారుతుంది. స్వీట్ ఫుడ్ ఇష్టంగా తినే దాంట్లో పానీపూరి ఫస్ట్ ఉంటుంది. అందరూ బయట తింటానికి ఎగబడును తింటారు.

కాకపోతే శుభ్రత పరిశుభ్రతని దృష్టిలో ఉంచుకొని ఇంట్లో తయారు చేసుకుని తినటం వల్ల మన ఆరోగ్యం మెరుగ మెరుగుగా ఉంటుంది.

నేను చెప్పే విధంగా పానీపూరి రెసిపీ మీరు ట్రై చేయడం వల్ల ఎంతో హెల్తీ అండ్ టేస్టీ స్నాక్స్ ఇంట్లోనే తయారైపోతుంది స్టెప్ బై స్టెప్ ఈ రెసిపీని పూర్తి వరకు చూడండి.

ముందుగా పూరీలకు కావాల్సిన పదార్థాలు మరియు తయారీ విధానం.

కావాల్సిన పదార్థాలు- ingredients:

పూరీలకు కావలసిన పదార్థాలు:( purilaku ingredients )

  • రవ్వ: ఒక కప్పు

  • మైదాపిండి: రెండు టేబుల్ స్పూన్లు

  • ఉప్పు: వన్ టేబుల్ స్పూన్

  • కుకింగ్ సోడా

  • నీరు: తగినంత

  • నూనె: వేయించుకోవడానికి కావాల్సినంత 

పూరీలను తయారు చేసే విధానం:( Puri preparation):

ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా యాడ్ చేయాలి.

ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా తగినంత నీరు పోసి పిండిని గట్టిగా కలుపుకోవాలి.

పిండిని గట్టిగా కలిపిన తర్వాత ఒక తడి కాటన్ క్లాత్ తీసుకొని దానిమీద ఒక అరగంట పాటు ఉంచాలి.

అరగంట తర్వాత పిండిని మళ్లీ తీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మెత్తగా ఒత్తుకోవాలి.

ఒక ప్లేన్ సర్ఫేస్( plain surface ) మీద కాస్తంత పిండి వేసి ఆ ముద్దను చపాతీల్లాగా రోల్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక చిన్న రౌండ్ సైజ్ గ్లాస్ కానీ ఒక చిన్న గిన్నె కానీ తీసుకొని పూరీలంతా చిన్న సైజులో కట్ చేసుకోవాలి.

ఇప్పుడు కట్ చేసుకున్న పూరి అచ్చులను ఒక్కొక్కటిగా పక్కకి ఒక ప్లేట్ లోకి తీసుకొని దానిపైన అవి ఆరిపోకుండా తడి క్లాత్ ని పెట్టాలి..

ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడినంత నూనె వేసుకుని బాగా వేడిగా కాగనివ్వాలి.

నూనె బాగా కాలిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని పూరీలు బాగా పొంగేటట్లు గరిటతో తిప్పుకోవాలి.

పూరీలు మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి.

పానీ పూరి మసాలా తయారీ విధానం మరియు కావలసిన పదార్థాలు ( pani puri masala):

కావలసిన పదార్థాలు( Mashallah ingredients ):

  • తెల్ల బఠానీలు : ఒక గ్లాసు 

  • ఉల్లగడ్డలు : రెండు

  • ఉప్పు : తగినంత

  • కారం :  వన్ టేబుల్ స్పూన్

  • పసుపు : 1/2 టేబుల్ స్పూన్

  • గరం మసాలా : హాఫ్ టేబుల్ స్పూన్

  • ధనియాల పొడి : 1/2 టేబుల్ స్పూన్ 

  • చాట్ మసాలా : వన్ టేబుల్ స్పూన్

  • జీలకర్ర పొడి : ఆఫ్ టేబుల్ స్పూన్ 

  • ఉల్లిపాయ : ఒకటి

  • టమాటా : ఒకటి

  • పచ్చిమిరపకాయ : ఒకటి 

  • నూనె : రెండు టేబుల్ స్పూన్లు 

ఆలు మసాలా తయారీ విధానం ( masala preparation ):

ముందుగా తెల్లబట్ట నిన్ను ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. లేదా కనీసం ఐదారు గంటల అన్న నానబెట్టుకోవాలి.

తెల్ల బఠానీలను కుక్కర్లో వేసి ఒక ఆరు వేడి విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దాంతోపాటు ఒక రెండు ఉల్లగడ్డలు కూడా ఉడికించుకోవాలి.

తెల్ల బఠానీ బాగా ఉడికిన తర్వాత అందులో ఉల్లగడ్డలు వేసి బాగా మెదుపుకోవాలి.

ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి.

నూనె బాగా కాగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేసి కాస్తంత వేయించుకోవాలి.

ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి కాస్తంత ఉప్పు పసుపు వేసి టమాటాలు సాఫ్ట్ గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి.

ఇప్పుడు టమాటాలు కాస్తంత మెత్తగా అయిన తర్వాత దానిలోకి వన్ టేబుల్ స్పూన్ కారం, వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా, వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, మరియు 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసి ఒక రెండు నిమిషాలు పాటు వేయించుకోవాలి.

మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న బఠానీలు ఆలుగడ్డ మిశ్రమాన్ని కాస్థాని నీళ్లు పోసి దీనిలోకి యాడ్ చేసుకోవాలి.

మన గ్రేవీకి తగ్గట్లు కావలసిన నీళ్లు పోసుకుని ఒక 10 – 15 నిమిషాల పాటు మా ఉడికించుకుంటే.

మన పూరీల్లోకి మసాలా గ్రేవీ అనేది తయారైపోయింది అంటే పూరి మసాలా అనేది సిద్ధమైపోయింది.

పానీ తయారు చేసే విధానం మరియు కావలసిన పదార్థాలు :

ముందుగా పానీ తయారీకి కావాల్సిన పదార్థాలు ( ingredients):

  • తాజా :  కొత్తిమీర అరకట్ట 

  • తాజా పుదీనా :  అరకట్ట 

  • పచ్చిమిరపకాయలు : రెండు 

  • అల్లం : ముక్కలు రెండు 

  • చింతపండు : నిమ్మకాయ సైజు అంత 

  • కారం : 1/2 టేబుల్ స్పూన్ 

  • ఉప్పు : తగినంత 

  • చాట్ మసాలా : వన్ టేబుల్ స్పూన్ 

  • గరం మసాలా : హాఫ్ టేబుల్ స్పూన్ 

  • ధనియాల పొడి : ఆఫ్ టేబుల్ స్పూన్ 

  • జీలకర్ర పొడి : 1/2 టేబుల్ స్పూన్ 

  • చల్లటి నీరు : తగినంత

  • పింక్ సాల్ట్ : వన్ టేబుల్ స్పూన్

పానీ తయారీ విధానం ( procedure):

ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తాజా కొత్తిమీర పుదీనా రెండు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా కాస్తాన్ని వాటర్ పోసి రుబ్బుకోవాలి.

ఇప్పుడు ఇష్టమా అని ఒక స్టేనర్ సహాయంతో చేయించుకోని దానిలో ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసుని.

కాస్తంత ఉప్పు కాస్తంత పింకు సాల్టు కారం, ఉప్పు, గరం మసాలా, జీరా పౌడర్, చాట్ మసాలా, మరియు ధనియాల పొడి వేసుకొని తగినన్ని చల్లటి నీరు పోసుకుంటే మనం కమ్మటి పాణి తయారయింది.

పానీ పూరి తినే విధానం తినే విధానం:

ముందుగా పానీపూరంలో చిన్నటి రతన్ రంద్రం చేసి ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న ఆలు మసాలాని వేసి మన చల్లటి పానిల్లో ముంచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.

లేదా ఆలూ మిశ్రమంలోకి మన పానీపూరిని క్రష్ చేసుకుని కాస్తన్న పని అంటే పానీ పూరి నీళ్లను పోసుకొని చాట్ లాగా తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

పక్కన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటే మరియు కొత్తిమీర కూడా చల్లుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది.

ఒండేత్పుడు తరచుగా చేసే తప్పులు:

పూరీలు తయారు చేసే పిండిని మరీ మెత్తగా కలుపుకోవటం ముందుగా చేసే తప్పు.

అలా చేయడం వల్ల పూరీలు అనేవి పొంగకుండా చక్కల్లాగా అయిపోతాయి.

మసాలా చార్ట్ తయారు చేసేటప్పుడు ముఖ్యంగా తక్కువ నీరు పోసుకోవడం వల్ల ఆ మసాలా అనేది దగ్గరగా అయిపోతుంది.

మసాలా పేస్ట్ లో కూడా సరిపడంత కారం ఉప్పు మసాలాలు పడకపోతే రుచి అంత అద్భుతంగా ఉండదు.

పానీ పూరి కి కావాల్సిన పని చేసేటప్పుడు ఎప్పుడు తాజా కొత్తిమీర పుదీనానే వేసుకోవాలి. 

తాజావి వేసుకోవడం వలనే ఆ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అనేది మన నోటికి తెలుస్తుంది మరియు మంచి సువాసన విరిజం అవుతుంది.

Frequently Asked Questions :

Q.పూరీ పిండి గట్టిగా ఎందుకు కలపాలి?

A.పూరీ పిండి మరి మెత్తగా కలపడం వల్ల పూరీలు అనేవి పొంగవు తినటానికి కూడా మరింత రుచిగా ఉండవు.

Q.పానీ లోకి చల్లటి నీళ్లే ఎందుకు పోయాలి?

A.పానీ లోకి చల్లటి నీళ్లు పోయటం వల్ల మనం తినేటప్పుడు చల్లగా నోటికి ఆహ్లాదంగా ఉంటుంది.

Q.తెల్ల బఠానీలు ముందుగానే ఎందుకు నానబెట్టుకోవాలి?

A.ముందుగానే నానబెట్టడం వల్ల కుక్కర్లో త్వరగా ఉడుకుతుంది.

Q.తెల్ల బఠానీలు ఉడికించడానికి ఎన్ని విజిల్స్ రావాలి?

A.కనీసం ఆరు ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడే బటాని అనేది మెత్తగా ఉడుకుతుంది.

Q.పింక్ సాల్ట్ ఎందుకు ఆడ్ చేయాలి?

A.పింక్ సాల్ట్ అనేది యాడ్ చేయటం వలనే పనిలోకి ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది.

పోషక విలువలు -( benefits for our health):

మొదట పానీపూరీలో వేసే ఉప్పు మరియు మైదా మరియు రవ్వ వల్ల మనకు కావలసిన కార్బోహైడ్రేస్ మరియు ఉప్పు వల్ల అయోడిన్ పెరుగుతుంది.

మన పానీ పూరి మసాలా వల్ల మనం వాడే సెనగలు మరియు ఆలులు వల్ల మనకు కావాల్సిన పీచు పదార్థం లభిస్తుంది.

పీచు పదార్థం ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఎముకలు పుస్టిగా ఉంటాయి మరియు జీర్ణక్రియ మెరుగు పడుతుంది.

పానీ పూరి పానీని పుదీనా కొత్తిమీర మరియు పులుపు వేయటం వల్ల ఇందులో విటమిన్ ఏ మరియు విటమిన్ సి అనేవి పుష్కలంగా లభిస్తాయి.

విటమిన్ సి వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మన ఒంటికి కావలసిన ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా లభిస్తుంది. అంటే రోగ నిరోధక శక్తి పెంచుతుంది.

ముగింపు( conclusion):

నేను పైన ఇచ్చిన రెసిపీని ఫాలో అయ్యి మీరు ఇంట్లో ట్రై చేయటం వల్ల మన ఇంట్లోనే ఆరోగ్యవంతమైన పానీపూరి రెసిపీని తయారు చేసుకోవచ్చు.

పిల్లలు పెద్దవారు ఎంతో ఇష్టపడే పానీ పూరిని ఇంట్లోనే చేసుకుని ఆనందంగా అందరూ కలిసి తినొచ్చు.

చివరగా ఇంట్లోనే పానీ పూరి చేసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు బయట దొరికే స్వీట్ ఫుడ్స్ ని కాస్త దూరంగా ఉండొచ్చు.

ఇంకెందుకు ఆలస్యం ఈ సాయంత్రం మీరు కూడా నేను చెప్పిన రెసిపీని ఫాలో అయ్యి పానీ పూరిని ఇంట్లోనే తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి మీకు తప్పకుండా నచ్చుతుంది.

Leave a Comment