Bhindi Tomato Masala Curry – ఇంట్లోనే స్పైసీగా రుచికరమైన బెండకాయ టమాటా కర్రీ
Bhindi Tomato Masala Curry ఇంట్లో పిల్లలు బెండకాయ కూర బెండకాయ వేపుడు తినాలంటే ఎంతో కష్టంగా తింటారు ఎందుకంటే దాంట్లో ఉన్న జిగురు కారణంగా పిల్లలు ఇష్టంగా తినటానికి నిరాహారిస్తారు.
ఈ రెసిపీలో నేను వాడే స్పైసెస్ వల్ల మరియు మసాలాలు వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
ఎటువంటి జిగురు లేదా దోమ లేకుండా ఈ బెండకాయ మసాలా కర్రీ అనేది ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
మన ఇంట్లో చిక్కే సాధమైన టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ధనియాల పొడి మరియు కొన్ని గరం మసాల తోటి చాలా సులభంగా మరియు రుచికరంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
నేను చెప్పిన ఈ ఆర్టికల్ లో మీరు ఫారో అవ్వటం వల్ల మీరు కూడా ఇంట్లో చాలా టేస్టీగా మసాలా బెండకాయ కర్రీని చేసుకోవచ్చు
ముందుగా కావలసిన పదార్థాలు
- బెండకాయ 500 గ్రాములు
- టమాటాలు 5
- ఉల్లిపాయలు రెండు
- పచ్చిమిరపకాయలు రెండు
- అల్లం ఒక ముక్క
- వెల్లుల్లి ఒక పాయ
- కరివేపాకు ఒక రమ్మ
- కొత్తిమీర కొద్దిగా
- జిలకర వన్ టేబుల్ స్పూన్
- ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్
- అర్చన పప్పు వన్ టేబుల్ స్పూన్
- మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్
- ఎండుమిరపకాయలు రెండు
- నూనె ఒక కప్పు
- గరం మసాలా వన్ టేబుల్ స్పూన్
- ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్
- వేయించిన జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్
- పసుపు వన్ టేబుల్ స్పూన్
- ఉప్పు రుచికి తగినంత
- కారం రుచికి తగినంత
- చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత
- నీరు తగినంత
- ఎండు కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకునే విధానం
ముందుగా అల్లాని ఒక పది నిమిషాల పాటు నీటిలో నానపెట్టుకొని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.
వెల్లుల్లి కూడా పైన పొట్టు తీసేసి శుభ్రంగా ఉంచుకోవాలి.
ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను చిన్న ఉల్లిపాయ ముక్కలను దాంతో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్ ఎండుకొబ్బరిని ఒక మిక్సీ జార్లో వేసి కాస్త నీళ్లు పోసి మెత్తటి పేస్టులాగా గ్రైండ్ చేసుకోవాలి.
చింతపండు పులుసు నాన్న పెట్టుకునే విధానం
500 గ్రాముల బెండకాయలకు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు అయితే సరిపోతుంది.
కర్రీ తయారు చేసే ముందే చింతపండు అనేది నానపెట్టుకోవడం మంచిది అప్పుడే చింతపండు అనేది బాగా నానుతుంది.
బెండకాయ ను కడుక్కొని కట్ చేసుకునే విధానం
ముందుగా బెండకాయలను ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి
ఇప్పుడు బెండకాయల్ని ఒక కాటన్ క్లాత్ సహాయంతో శుభ్రంగా ఒక్కొక్కటిగా తుడుచుకోవాలి అప్పుడే బెండకాయల్లో జిగురు తగ్గుతుంది.
ఇప్పుడు బెండకాయలను ఒక కాయను మూడు ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి.
టమాటా ఉల్లిపాయ కట్ చేసుకునే విధానం
టమాటాలను వీలైనంత చిన్నగా కట్ చేసుకోవటం మంచిది . అప్పుడే త్వరగా ఉడుకుతాయి.
లేదా టమాటా అని ఒక బ్లెండర్ సాయంతో అంటే హ్యాండ్ బ్లెండర్ సహాయంతో కట్ చేసుకున్న సరిపోతుంది.
ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయల్ని చీల్చి రెండు ముక్కలా కట్ చేసుకోవాలి.
కరివేపాకును కొత్తిమీరను శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుని ఉంచుకోవాలి.
బెండకాయలు వేయించుకునే విధానం
మనం ముందుగా అయితే ఈ కూర దేంట్లో తయారు చేయాలనుకుంటున్నాము ఆ బండిలోకి ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసి కాగనివ్వాలి.
ఇందులోకి మనం శుభ్రంగా కడుక్కొని తుడుసుకొని పెట్టుకున్నా బెండకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేస్తూ పైన కాస్తంత ఉప్పు వేసి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి.
ఇదేవిధంగా మొత్తం 500 గ్రాములు బెండకాయల్ని ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. మొత్తం వేగిన బెండకాయలను ఒక టిష్యూ సహాయంతో గానీ ఏ పేపర్ గాని ఎట్లాంటి జాలి గిన్నె కానీ తీసుకొని నూనె అంతా వడగట్టి పక్కకు తీసుకోవాలి. ఎక్కువగా తిప్పకూడదు.
బెండకాయ టమాటా కూర తయారు చేసే విధానం
ముందుగా మనం బెండకాయలు వేయించుకున్న బాండీలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు మరియు 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక రెండు ఎండు మిరపకాయలు వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇందులోకి ఒక రెండు సున్నులు పాయలు రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి ఆడ్ చేసుకోవాలి.
ఇప్పుడు పోపు దినుసులనేది కాస్తరంగం మారిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
ఉల్లిపాయలు అనేది బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి సిం లో పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి వన్ టేబుల్ స్పూన్ పసుపు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 10 – 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి.
టమాటా అనేది మెత్తగా సాఫ్ట్ గా అయిపోయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం మరియు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి మరియు వన్ టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
ఇప్పుడు మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కల్ని వేసి అసలు తిప్పకుండా ఒకసారి తిప్పి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని గుజ్జు మరియు తొక్కలు లేకుండా.
చింతపండు పులుసు పోసిన తర్వాత ఉప్పు కారం కరెక్ట్ గా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీకు కావాలంటే కాస్త నీళ్లు పోసి కూడా ఉడికించుకోవచ్చు.
ఇలా చింతపండు పులుసు నీళ్లు పోసిన తర్వాత సింలో పెట్టుకొని నూనె తేలేంతవరకు ఉడికించుకుంటే మన బెండకాయ టమాట మసాలా గ్రేవీ అనేది రెడీ అయిపోయింది.
చివర్లో పైనుంచి కొంచెం కొత్తిమీర ఉప్పు, కారం కరెక్ట్ గా సరిపోయిందో లేదో చూసుకుంటే మన బెండకాయ కూర అనేది చాలా అద్భుతంగా తయారైపోయినట్లే.
బెండకాయ కూర లో ఉండే పోషక విలువలు
బెండకాయల్లో విటమిన్ సి విటమిన్ కి పోలేట్ డయాబెటరీ ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి బెండకాయలో ఫైబర్ ఉండటం వల్ల బ్యాలెన్స్ డైట్ లో భాగంగా తీసుకోవచ్చు
బెండకాయని తినటం వల్ల బరువు అనేది పెరగరు. మరియు డయాబెటిక్ పేషెంట్స్ కూడా అద్భుతంగా తినొచ్చు మరియు జీర్ణ క్రియ కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్లు కూడా బెండకాయని తీసుకోవచ్చు
బెండకాయ కూర చేసేటప్పుడు తరచుగా చేసేటప్పుడు తప్పులు Common Mistakes
తప్పు 1- బెండకాయ ఎందుకు అడిగిన తర్వాత శుభ్రంగా తుడుచుక పోవటం.
తప్పు 2- అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించకపోవడం.
తప్పు 3- బెండకాయలు కన్నా టమాటాలు ఎక్కువగా వేయటం.
తప్పు 4- ఉప్పు కారం కరెక్ట్ గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవటం.
తప్పు 5- చింతపండు పులుసు ఎక్కువగా వేయటం
Frequently Asked Questions
1.మనం బెండకాయ కూరలో చింతపండు పులుసు కచ్చితంగా వేసుకోవాలా?
మీకు నచ్చినట్టయితే బెండకాయలో పులుసు పోసుకోవచ్చు లేకపోతే నీరు కూడా పోసుకోవచ్చు.
2.బెండకాయి వండేటప్పుడు కచ్చితంగా వేయించుకోవాలా?
బెండకాయలు వేయించుకోవడం వల్ల దాంట్లో ఉన్న జిగురు కాస్త తగ్గుతుంది.
3.బెండకాయల్లో గరిట పెట్టి తిప్పువచ్చా?
బెండకాయలు ఎక్కువ గరిట పెట్టి తిప్పటం వల్ల చిదిరిపోతుంది.
4.బెండకాయలు కొబ్బరి వేసుకోవచ్చా?
బెండకాయల్లో కొబ్బరి తురుము వేయటం వల్ల బెండకాయ కూర అనేది చాలా రుచిగా మరియు గ్రేవీ గా ఉంటుంది.
5.బెండకాయల్ని కడిగిన తర్వాత ఎందుకు తుడుచుకోవాలి?
బెండకాయలను తుడవటం వల్ల దానిలో ఉన్న జిగురు పోతుంది పైగా పైనున్న మట్టి కూడా శుభ్రంగా తొలగిపోతుంది.
బెండకాయ కూర దేనితో తింటే బాగుంటుంది
ఈ బెండకాయ టమాటా కూర అనేది అన్నిట్లో కన్నా వేడివేడి అన్నంలో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇలా వేడివేడి అన్నంలోకినే కాకుండా చపాతీ పుల్కా రోటి మరియు జొన్న సంగతి రాగి సంగటి జొన్న రొట్టె రాగి రొట్టె ఇట్లాంటి వాటిల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
Conclusion
ఈ బెండకాయ కూర టమాటా ఉల్లిపాయి గరం మసాలా ధనియాల పొడి మరియు చింతపండు ఇలా కొన్ని రకాల మసాలాలు వేసుకోవడం వల్ల ఈ కూరకి మరింత వచ్చి కలుస్తుంది.
ఈ విధంగా వండటం వల్ల బెండకాయ లో ఉన్న జిగురు అనేది పూర్తిగా పోయి తినేటప్పుడు కారం కారంగా స్పైసీగా మసాలాతో చాలా అద్భుతంగా ఉంటుంది.
నేను చెప్పిన ఆర్టికల్ ప్రకారం మీరు బెండకాయ కూర ఒక్కసారి ట్రై చేశారనుకో తప్పకుండా మీ పిల్లలు గానీ మీరు గానీ చాలా ఇష్టంగా తింటారు.
బెండకాయ అనేది కూరగా కాకుండా వేపుడుగాను మరియు పకోడీ కాదు నువ్వు చాలా విధాలుగా చేసుకుంటారు ఇన్ని విధాల్లో కన్నా బెండకాయ టమాట కూర అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
మీరు కూడా తప్పకుండా నా ఆర్టికల్ చూసి నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేస్తే మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ఆంధ్ర స్టైల్ టమాట బెండకాయ స్పైసీ గ్రేవీ ని ఇంట్లోనే తయారు చేసుకోగలరు.
తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీ పిల్లలతో ఖచ్చితంగా హ్యాపీగా తినండి. మళ్లీ మరొక ఆర్టికల్ తో కలుద్దాం.