Upma recipe in Telugu- సులభంగా మరియు రుచికరంగా ఈజీగా తయారయ్యే breakfast recipe Upma
Upma recipe in Telugu – ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో త్వరగా అయిపోయే అల్పాహారంలో ఉప్మా అనేది మొదట ఉంటుంది.
ప్రతి ఒక్కరు బిజీ షెడ్యూల్లో టిఫిన్ అనేది చాలా ముఖ్యం . మరియు వాటికి చాలా సమయం పడుతుందని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్లకి ఉప్మా అనేది చాలా ఫాస్ట్ గా మరియు టేస్టీగా అయిపోయే ఇన్స్టంట్ బ్రేక్ ఫాస్ట్ లేకుండా ఉంటుంది.
నిమిషాల్లో మన ఇంట్లోనే దొరికే కూరగాయలతో పదే పది నిమిషాల్లో చాలా అద్భుతంగా మరియు కడుపునిండా తినే విధంగా ఈప్మా రెసిపీ అనేది ఉంటుంది
ఉప్మా అనేది సాధారణంగా బొంబాయి రవ్వ తోటి గోధుమ రవ్వ తోటి మరియు సేమియాలతోటి పలు విధాలుగా పలు రకాలుగా ఉప్మా అనేది తయారు చేసుకుంటారు
ఏ విధమైన రవ్వ వాడినా ఉప్మా అనేది నిమిషాల్లో తయారైపోతుంది మనం వండే పద్ధతిని బట్టి మనం వాడే ఇంగ్రిడియంట్స్ పట్టి దాని టేస్ట్ కూడా పెరుగుతుంది
నేను ఇచ్చిన ఈ ఆర్టికల్లో ఉప్మా అనేది స్టిక్కీగా మరియు స్టిక్కీగా లేకుండా మరియు చాలా టేస్టీగా ఉండే ఉప్మా రెసిపీ ని చెప్తున్నాను
ఈ ఆర్టికల్ లో నేను ఉప్మా టేస్టీగా ఎలా రావాలో టేస్టీగా రావాలంటే వాటికి కావాల్సిన పదార్థాలు కావాల్సిన టిప్స్ మరియు తయారీ విధానం దేనితో తింటే బాగుంటుంది ఇలాంటివి చాలా ముఖ్యమైన టిప్స్ కూడా చెప్తాను
ముందుగా కావలసిన పదార్థాలు
1.ఉప్మా రవ్వ ఒక కప్పు
2.టమాటాలు రెండు
3.ఉల్లిపాయ ఒకటి
4.పచ్చిమిరపకాయలు రెండు
5.బీన్స్ 3
6.క్యారెట్ అర ముక్క
7.జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్లు
8.జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్
9.ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్
10.పల్లీలు హాఫ్ టేబుల్ స్పూన్
11.పచ్చనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్
12.అల్లం తురుము వన్ టేబుల్ స్పూన్
13.కరివేపాకు ఒకరమ్మ
14.కొత్తిమీర కొద్దిగా
15.నూనె నాలుగు టేబుల్ స్పూన్లు
16.నెయ్యి 2 టేబుల్ స్పూన్
17.ఉప్పు రుచికి తగినంత
18.పసుపు 1/2 టేబుల్
19.నీరు తగినంత
ముందుగా రవ్వను వేయించుకున్న పద్ధతి
ముందుగా ఒక బండి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి కానివ్వాలి.
ఇప్పుడు అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసి సిమ్ లో పెట్టుకొని తిప్పుతూ ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి.
కనీసం బొంబాయి రవ్వ అనేది పదినిమిషాలు వేగితే కాస్తంత రంగు మారుతుంది అంటే బంగారు రంగులోకి మారుతుంది అప్పటి వరకు చిన్నగా తిప్పుకుంటూ సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి
ఇలా ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వ ను ఒక ప్లేట్ లో పక్కన ఆరబెట్టుకోవాలి అంతే మన ఉప్మా కి బొంబాయి రవ్వ అనేది ఫ్రై అయిపోయినట్లే
కూరగాయల్ని కట్ చేసుకునే విధానం
టమాటా ని క్యారెట్ బీన్స్ ఉల్లిపాయ మరియు పచ్చిమిరపకాయలని మనకు సాధ్యమైనంత చిన్నగా కట్ చేసుకుని పక్కనుంచుకోవాలి.
అల్లంని శుభ్రంగా కడిగి గ్రేటర్ సహాయంతో తురుము పట్టుకొని పక్కనుంచుకోవాలి. కరివేపాకు మరియు కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి
ఇప్పుడు ఉప్మా తయారీ విధానం
ముందుగా మనం రవ్వను వేయించుకున్న బాండీలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి.
నెయ్యి అనేది బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వేసుకొని కాస్త రంగు మారేంతవరకు వేయించుకోవాలి.
జీడిపప్పు కాస్త రంగు మారిన తర్వాత పక్కన ఒక ప్లేట్ లోకి తీసుకొని ఉంచుకోవాలి.
అదే ఆయిల్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి. ఇందులోకి పోపు దినుసులు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అంటే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు మరియు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు మరియు 1 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా యాడ్ చేసి కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి
ఇలా పోపుదినుసులు అని మంచి రంగు వచ్చిన తర్వాత ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి కాస్తంత ఫ్రై చేయాలి.
ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మరియు పచ్చిమిరపకాయలు వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి
ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి శుభ్రంగా కడుక్కున్న కరివేపాకు వేసి బాగా చిటపటలాడివ్వాలి.
ఇలా ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక పది నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి.
ఇలా కూరగాయలన్నీ ఉడికిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక కప్పు కి రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించుకోవాలి.
నీరు బాగా మరిగిన తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి అందులోనే కొత్తిమీర తరుగు వేసి బాగా తెర్లనివ్వాలి.
రవ్వను వేసే పద్ధతి
చాలామందికి రవ్వ ఎలా ఇయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వటం వల్ల రవ్వ అనేది ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్ గా మెత్తగా ఉంటుంది.
ఇప్పుడు చూడండి నీళ్లు బాగా మరిగాయి కదా ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న రవ్వను కొంచెం కొంచెంగా ఒక గరిట కంటిన్యూస్గా తిప్పుకుంటూ రవ్వను యాడ్ చేసుకోవాలి
చిల్లుల లాంటిదైతే ఇంకా చాలా సులభంగా గడ్డం లేకుండా వస్తుంది. లేదా మాకు గరిట యూస్ చేయటం రావట్లేదు అనుకుంటే ఎగ్ పీటర్ లో ఉండే విస్కర్ ని కూడా యూస్ చేసుకొని రవ్వని తిప్పుకోవచ్చు ఇది చాలా సింపుల్ టెక్నిక్ అసలు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కోసం ఈ టెక్నిక్ అనేది వాడుకోవచ్చు.
ప్రభ వేసేటప్పుడు కంటిన్యూస్గా కలపటం వల్ల ఎక్కడ ఉండలు కట్టకుండా స్మూత్ గా ఉంటుంది ఇలా మొత్తం రవ్వను వేస్తూ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి.
ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వెంటనే మూత తీయకూడదు ఫైవ్ మినిట్స్ లో ఎలా అయినా ఉప్మా అనేది స్మూత్ గా ఉడికిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి గరిటతో తిప్పుకొని పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే మన టేస్టీ అయిన ఉప్మా బ్రేక్ ఫాస్ట్ రెడీ.
పైనుంచి వేయించిన జీడిపప్పు మరియు కాస్తంత కొత్తిమీర తరుగు వేసుకుంటే ఉప్మా కి మరింత ఫ్లేవర్ మరింత రుచి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది.
ఇదేవిధంగా ప్లెయిన్ ఉప్మా తయారు చేసే విధానం
ఏమి లేదండి ఈ ఉప్మాలో మనం వెజిటేబుల్స్ యాడ్ చేశాం అంటే క్యారెట్ బీన్స్ మరియు టమాటాలు అట్లాంటివి ఆడ్ చేసాం కదండీ
ఇప్పుడు ప్లైన్ ఉప్మాలో జస్ట్ ఒక ఆనియన్ ను పచ్చిమిరపకాయను వేయించుకొని కరివేపాకు వేసి వాటర్ వేసి మరిగిన తర్వాత రవ్వ వేసుకోవడమే.
అంతే అండి ప్లైన్ ఉప్మా నిమిషాల్లో రెడీ రెడీ అయిపోతుంది ప్లైన్ గా ఇష్టపడే ప్లెయిన్ ఉప్మా చేసుకోవచ్చు లేదా మాకు వెజిటేబుల్స్ కావాలనుకున్నవాళ్లు వెజిటేబుల్ ఉప్మా చేసుకోవచ్చు ఏ విధంగా చేసినా టేస్ట్ అనేది బాగుంటుంది.
తరచుగా చేసే తప్పులు
- ఉప్మా తయారు చేసే ముందు రవ్వను వేయించకపోవడం.
- కూరగాయన్ని బాగా వేగనకుండా పచ్చిగా ఉంచుకోవటం.
- నూనె అనేది తక్కువగా వేయటం.
- నీరు అనేది సరి సమానంగా పోయకపోవడం
- మరియు నీరు బాగా మరగకుండా రవ్వవేయటం
- రవ్వ వేసేటప్పుడు కంటిన్యూస్గా తిప్పకపోవడం
- రవ్వ వేసిన తరువాత వెంటనే హై లో పెట్టటం
ఉప్మా కు సరైన కొలత నీళ్లు ఎలా తీసుకోవాలి.
మనం తీసుకునే రవ్వను బట్టి నీరు అనేది చూసుకోవచ్చు గోధుమ రవ్వ అయితే ఒక రకంగా సేమియా అయితే ఒక రకంగా బొంబాయి రవ్వ అయితే ఒక రకంగా తీసుకుంటాము.
మీరు పొడిపొడిగా తినటానికి ఇష్టపడితే ఒక కప్పు రవ్వ కి ఒకటిన్నర కప్పు నీరు పోసుకోవాలి. ఈ విధంగా చేయాలంటే నీరు పోసిన వెంటనే రవ్వని కంటిన్యూస్గా తిప్పటం వల్ల ఉండలు లేకుండా ఉంటుంది మరియు కొంచెం గట్టిగా కూడా ఉంటుంది
లేదా మీరు మెత్తగా స్మూత్ గా తినటానికి ఇష్టపడితే ఒక కప్పు రవ్వ కి రెండున్నర కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఈ విధంగా చేసేటప్పుడు మాత్రం రవ్వ వేసిన వెంటనే కంటిన్యూస్గా తిప్పుకొని తరువాత హై ఫ్లేమ్ లో పెట్టకుండా ఒక పది నిమిషాల పాటు సిమ్ లో పెట్టి మూత పెట్టుకొని స్టీమ్ చేయాలి. అప్పుడే రవ్వ అనేది స్మూత్ గా మరియు టేస్టీగా మెత్తగా వస్తుంది.
మీరు ఏ విధంగా తినటానికి ఇష్టపడతారు ఆ విధంగా నీళ్లు కొలత చూసుకొని మనం యాడ్ చేసుకోవడమే. గట్టిగా తినాలనుకున్న వాళ్ళు నీళ్లు కాస్త కొంచెం తక్కువ పోసుకోవాలి మరీ మెత్తగా కావాలనుకున్న నేను కొంచెం ఎక్కువగా పోసుకుంటే సరిపోతుంది.
ఇదే కొలతలతో ఏ ఇంగ్రిడియంట్స్ వాడి మనం సేమియా ఉప్మా గాని రవ్వ ఉప్మా గాని కేసర ఉప్మా గాని ఇట్లా చాలా విధాలుగా ఓట్స్ ఉప్మా కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు కాకపోతే నీళ్లకు క్వాంటిటీ అనేది మనం తీసుకునే రవ్వను బట్టి ఉంటుంది.
Frequently Asked Questions
1.రవ్వ కచ్చితంగా వేయించుకోవాలా?
రవ్వ వేయించుకోవడం వల్ల కొంచెం రవ్వ అనేది స్టిక్కిగా ఉండదు.
2.కూరగాయలు అనేది తప్పకుండా వేసుకోవాలి?
మీకు ఇష్టమైతే కూరగాయలు వేసుకోవచ్చు లేకపోతే ప్లెయిన్ ఉప్మా కూడా చేసుకోవచ్చు.
3.నీరు అనేది ఎంత తీసుకోవచ్చు?
మెత్తగా తినాలనుకున్న వాళ్ళు నీళ్లు కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు లేదా పొడిపొడిగా కావాలనుకున్న నీళ్లు కొంచెం తక్కువగా తీసుకోవచ్చు.
4.చివర్న జీడిపప్పు మరియు నెయ్యి కచ్చితంగా వేయాలి?
జీడిపప్పు మరియు నెయ్యి వేయడం వల్ల అదనపు టేస్ట్ ఆడ్ అవుతుంది మాకి మీకు నచ్చితే ఆడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు.
5.రవ్వ వేసేటప్పుడు కంటిన్యూస్గా ఎందుకు తిప్పుకోవాలి?
రవ్వ వేసేటప్పుడు కంటిన్యూస్గా తిప్పుకోకపోతే రవ్వ అనేది అక్కడక్కడ ఉండలు ఉండలుగా ఉండిపోతుంది తినేటప్పుడు పిండిపిండిగా ఉంటుంది.
వేటితో తింటే ఉప్మా అనేది రుచిగా ఉంటుంది
- పల్లి చట్నీ
- కొబ్బరి చెట్ని
- అల్లం చట్నీ
- ఉప్పుల పొడి
- కొబ్బరి కారం
- సాంబార్
- మామిడికాయ పచ్చడి
- టమాటా చట్నీ
- కారంపొడి
మనం ఇష్టపడే చట్నీలతో ఉప్మా అనేది చాలా బాగుంటుంది ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది.
కొన్ని ప్రాంతాలలో అయితే ఉప్మాతో పాటు కాస్తంత నెయ్యి మరియు కారంపొడి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా తినకపోతే కాస్తంత ట్రై చేయండి చాలా బాగుంటుంది.
ముగింపు
చూడండి పైన నేను చెప్పిన ఆర్టికల్ లో ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్ గా అయిపోయే ఉప్మా రెసిపీ చూపించాను.
మన బిజీ లైఫ్ లో మరియు బిజీ వర్క్స్ తో చాలా టెన్షన్ గా కన్ఫ్యూజన్ గా ఉంటాము ఏ బ్రేక్ ఫాస్ట్ చేయాలో ఎలా తినాలో ఎటువంటి తినాలో అని ఫీల్ అవుతూ ఉంటాము.
ఇప్పుడు ఇలాంటి బాధ ఏముండదండి బ్రేక్ ఫాస్ట్ లోకి ఉప్మా ట్రై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మరియు మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది.
రోజు ఒకే ఉప్మా తినాలనిపించేటప్పుడు బోర్ కొడుతుంది అనుకుంటున్నారా అలాంటప్పుడు ఒకరోజు రవ్వ ఉప్మా ఒకరో సేమ్యా ఉప్మా ఒకరోజు రాగి ఉప్మా కూడా చేసుకోవచ్చు అంటే రాగి పిండి తోటి ఇలా పలు విధాలుగా రాగి పిండి తోటి కూడా ఉప్మా అనేది ట్రై చేయవచ్చు.
మీరు కూడా ఈ రోజు ఉప్మా ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి మరియు మీ పిల్లలు మరియు మీరు ఆనందంగా హ్యాపీగా ఈరోజు బ్రేక్ ఫాస్ట్ ని చాలా సింపుల్ గా టైం సేవ్ చేసుకొని కడుపునిండా తినొచ్చు.