Chicken curry recipe in Telugu- హోటల్ స్టైల్ చికెన్ కర్రీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసే విధానం ఇప్పుడు మనం చెప్పుకుందాం
Chicken Curry Recipe in Telugu మన తెలుగువారికి మరియు హిందీ వాళ్ళకి గాని ఎవరికైనా గాని తెలియని వంటకం అంటే ఏదైనా ఉందంటే అది చికెన్ కర్రీ మాత్రమే. మన ఇంట్లో ఏ పండగ వచ్చినా మరియు ఏ సెలబ్రేషన్ అయినా లేదా ఏ పెళ్లిళ్లైనా ఏ ceremony ఏ పార్టీ అయినా మనకి ముందుగా గుర్తొచ్చేది చికెన్ కర్రీ మాత్రమే.
పిల్లలు పెద్దవాళ్లు ముసిరి వాళ్ళు అని తేడా లేకుండా అందరూ బాగా ఇష్టంగా తింటూ ఆనందించేది చికెన్ కర్రీ మాత్రమే.
సండే వస్తే చాలు అమ్మ చికెన్ తెచ్చావా నాన్న చికెన్ తెచ్చావా ఎప్పుడు తెస్తారు అని పిల్లలు కేళింతలు.
ఇంకా చెప్పాలంటే మనం బయటికి ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా ఎక్కువ వెరైటీస్ ఉండేది చికెన్ లో మాత్రమే ఇలాంటి చికెన్ను ఎలా ఇంట్లోనే సులభంగా వండుకోవాలో నేను ఇప్పుడు సింపుల్ గా చెప్తాను పూర్తిగా చూడండి స్టెప్ బై స్టెప్ క్లారిటీగా ఈ దీంట్లో వివరిస్తున్నాను.
వామ్మో చికెన్ కర్రీ హనీ ఫీలయ్య వాళ్లకు కూడా చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఎంతెంత వాడాలో ఈజీగా మరియు చిన్న చిన్న టిప్స్ తో ఇంట్లోనే హోటల్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను డీటెయిల్ గా ఈ ఆర్టికల్ లో చెప్పబోతున్నాను.
ఇక ఆలస్యం చేయకుండా మనం చికెన్ కర్రీ తయారీ లోకి వెళ్లిపోదామా చూడండి నేను అన్ని డీటెయిల్ గా చెప్తున్నాను చివరి వరకు అబ్సర్వ్ చేయండి.
ముందుగా మనకు ఈ వంటకానికి కావాల్సిన పదార్థాలు:
-
చికెన్ : ఒక కేజీ
-
కారం: మన రుచికి తగినంత
-
ఉప్పు: రుచికి తగినంత
-
గరం మసాలా: 1 tablespoon
-
ధనియాల పొడి :1 tablespoon
-
చికెన్ మసాలా 1 tablespoon
-
పసుపు: 1 tablespoon
-
కొత్తిమీర: ఒక కప్పు
-
పుదీనా: ఒక కప్పు
-
పచ్చిమిర్చి: రెండు
-
టమాటాలు: రెండు
-
ఉల్లిపాయ: ఒకటి పెద్ద సైజు
-
పోపు దినుసులు: 1 tablespoon
-
నూనె: ఒక కప్పు
-
కరివేపాకు: ఒకరమ్మ
-
నీరు: తగినంత
-
నిమ్మకాయ: ఒకటి
-
అల్లం చున్నులపాయలు: మనకు సరిపడంత
-
కొబ్బరి తురుము& 2 టేబుల్ స్పూన్స్
చికెన్ ను ఎంచుకునే విధానం: ( buying fresh chicken):
ఎప్పుడైనా చికెన్ ఎంచుకునేటప్పుడు ఫ్రెష్ గా ఉందా లేదా అని రెండు మూడు సార్లు చెక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు కట్ చేసి ఇచ్చిన మన ఎదురుగా కట్ చేసి ఇచ్చిన చికెన్ వాడుకుంటాం మన హెల్త్ కి ఎంతో మంచిది.
ఫ్రిజ్లో పెట్టింది లేదా వన్డే లేట్ అయింది వండుకోకూడదు అవి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు లేదా ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంటుంది.
అందుకని చికెన్ ని ఎంచుకునేటప్పుడు ఎటువంటి చికెన్ ఎంచుకుంటున్నాము అది ఎలా ఉందో అని చూసుకొని రెండు మూడు సార్లు చెక్ చేసుకుని ఎంచుకోవడం చాలా మంచిది అది మన హెల్త్ కి చాలా శ్రేష్టకరం.
చికెన్ కడిగే విధానం :
ముందుగా చికెన్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మన కర్రీకి ఎంత సైజు కావాలో చూసుకొని నీట్ గా కట్ చేసుకోవాలి .
ఇప్పుడు చికెన్ లో కాస్తంత నిమ్మరసం వేసి ఒక రెండు మూడు సార్లు మంచినీటి నీటి పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఎటువంటి నీతివాసం లేకుండా త్రీ ఫోర్ (3 or 4 times) టైమ్స్ కడుక్కోవాలి.
చికెన్ క్లీన్ చేసేటప్పుడు కోడి యొక్క ఈకలు గాని రెక్కలు గాని లేదా ఎటువంటి మట్టి గాని లేకుండా శుభ్రంగా ఉందో లేదో అని ఒక క్లీన్ చేసుకోవాలి.
మొదట కర్రీలోకి కూరగాయలను కట్ చేసుకునే విధానం మరియు మసాలాలు ప్రిపేర్ చేసుకోవాల్సిన ఎలా:
ముందుగా మనం కూరగాయలను కట్ చేసుకుని పెట్టుకుందాం. మొదట ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
టమాటాలను మరీ చిన్నగా కాకుండా కనీసం ఒక టమాటాను ఒక ఆరు ముక్కలు వచ్చేటట్లు కట్ చేసి పెట్టుకోవాలి. లేదా ఉల్లిపాయలు కట్ చేసినట్టు పొడవుగా బారుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా చాలా త్వరగా మగ్గిపోతాయి.
పచ్చిమిరపకాయలను రెండిటిగా చీల్చి పక్కన పెట్టుకోవాలి
తరువాత అల్లం చిన్న ఉల్లిపాయను శుభ్రంగా కడిగి వాటి తొక్క తీసుకొని ఎటువంటి మట్టి లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం చికెన్ కర్రీ తయారీ లోకి వెళ్ళిపోదాం : chicken curry preparation:
ముందుగా స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నెను కానీ లేదా నాన్స్టిక్ కడాయిని కానీ పెట్టుకోవాలి.
ఇప్పుడు బాండీలోకి మనం దాదాపు కప్ ఆయిల్ దాకా యాడ్ చేసుకోవాలి.మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీని(quantity )బట్టి ఆయిల్ చూసుకొని ఆడ్ చేసుకోవాలి.
మాంసం( non veg) వంటకాల కి ఎప్పుడైనా ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా ఆడ్ చేసుకుంటే వాటి కర్రీ రుచి ( taste )అనేది చాలా బాగా ఉంటుంది
నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా పోపు దినుసులు ( జిలకర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, తెల్ల పెసరపప్పు)అనేది ఆడ్ చేయాలి.
పోపుదినుసులు కాస్త రంగు మారేంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఆడ్ చేయాలి.
ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ ఇష్ కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే కాస్తంత ముదురు బిస్కెట్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు మనం చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఆడ్ చేసుకోవాలి.
పచ్చిమిరపకాయ కూడా కాస్తంత వేగిన తర్వాత కాస్తంత కరివేపాకు కూడా యాడ్ చేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంతవరకు సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీకు అనేది ఎక్స్ట్రా టెస్ట్(extra taste) ఆడ్ అవుతుంది.
ఇప్పుడు మనం కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కలను ఆనియన్ ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. టమాటాలు అనేది సాఫ్ట్ గా ఉడకాలి అంతవరకు సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి.
టమాటాలు కాస్తంత సాఫ్ట్ అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేయాలి. చికెన్ చికెన్ ను వేసిన వెంటనే మనం దాంట్లోకి సరిపడంతా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయండి.
పసుపు ఉప్పు బాగా కలిసేటట్లు చికెన్ ని బాగా కలపండి. మంట అనేది సిమ్ లో లేదా హై ఫ్లేమ్ లో ఉంచకుండా మీడియం ఫ్లేమ్ లో ఉంచి కనీసం ఒక 30 నిమిషాల పాటు ఉడికించుకోండి.
చికెన్ అనేది కనీసం ఒక 30 నిమిషాల్లో బాగా ఉడుకుతుంది. చికెన్ ఉడికిందని తెలియడానికి ఒక ముక్కని టేస్ట్ చేయండి లేదా ఇంకొక టిప్ చెప్పాలంటే చికెన్ ఉడికిన వెంటనే ఆయిల్ అనేది పైకి తేలుతుంది.
అప్పుడు చికెన్ అనేది బాగా సాఫ్ట్ గా జ్యూసీగా ఉడికిందని అర్థం.ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారంటే ప్రతి ఒక్కరూ చికెన్ ని చాలా టేస్టీగా మరియు జ్యూసీ జ్యూసీగా ఇంట్లోనే వండుకొని హ్యాపీగా తింటారు.
చికెన్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత దాంట్లోకి మనకు కావాల్సిన స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుందాం. ముందుగా మన రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకుందాం.
కారం ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్స్ లోకి ఎక్కువగానే పడాలి లేకపోతే కర్రీ అనేది నీచు వాసన వస్తుంది ఈ చిన్న టిప్పు కచ్చితంగా ఫాలో అవ్వండి.
ఇప్పుడు చికెన్ లోకి గరం మసాలా,ధనియాల పొడి,మరియు చికెన్ మసాలా యాడ్ చేసి అట్లకాడ వంటి గరిటతో చిన్నగా తిప్పుకోవాలి.
అట్లకాడ వంటి గరిటలు వాడటం వల్ల చికెన్ ముక్కలు అనేది చిదిరిపోకుండా ముక్క ముక్కగానే విడివిడిగా వస్తాయి. ఎక్కువగా తిప్పడం వల్ల కూడా మొక్క అనేది చిదిరిపోతుంది అప్పుడు మన చికెన్ కర్రీ అనేది తింటానికి ముక్కలు లేకుండా నోటికి రుచిగా ఉండదు.అందుకని మనం ఈ ముఖ్యమైన టిప్ కచ్చితంగా ఫాలో అయితే చికెన్ అనేది ముక్క ముక్కగా వస్తుంది.
స్పైసెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత వెంటనే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అప్పుడే మన స్పైసెస్ కారం ఉప్పు అనేది చికెన్ ముక్కలకి బాగా పట్టి తినేటప్పుడు కారం కారంగా జూసీ జూసీగా స్పైసి స్పైసిగా ఉంటుంది.
ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మనం గ్రేవీకి సరిపడంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని. సరిపడ పోతే కాస్తంత ఉప్పు ఆడ్ చేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి.
చివరగా కాస్తంత కొబ్బరి తురుము యాడ్ చేసి నెమ్మదిగా కలుపుకుంటే మన చికెన్ కర్రీ అనేది తయారైపోయింది.
చికెన్ బాగా గ్రేవీగా దగ్గరకు అయ్యేంతవరకు ఉడికించుకున్న తర్వాత పైన కాస్తంత కొత్తిమీర తరుగు మరియు పుదినా తరుగు ఆడ్ చేసి కాని చేసుకుంటే మన చికెన్ కర్రీ అనేది హోటల్ స్టైల్ పద్ధతిలో రెడీ అయిపోయినట్లే.
ఇటువంటి చిన్న చిన్న టిప్స్ వాడటం వల్ల మన ఇంట్లోనే చాలా టేస్టీగా మరియు జ్యూసీగా చికెన్ కర్రీ అనేది ఎప్పుడూ కావలసినప్పుడు చేసుకొని తినొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా మరియు ఆనందంగా తింటారు.
చికెన్ కర్రీ వండేటప్పుడు మనం తీసుకోవాల్సిన టిప్స్ 🙁 tips for chicken curry ):
చికెన్ రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎటువంటి స్మెల్ లేకుండా నీట్ గా వాష్ చేసుకోవాలి.
చికెన్ లో కారం ఉప్పు సరిపడా రీతిలో సరిపడా రీతిలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏమి సరిపోకపోయినా టేస్ట్ అనేది అంత రుచిగా ఉండదు.
కొబ్బరి తురుము అనేది చివరన ఆడ్ చేసుకోవాలి మొదటే యాడ్ చేయటం వల్ల కర్రీ అనేది అడుగంటుకుంటుంది.
నిమ్మకాయ వేసి చికెన్ కడగటం వల్ల చికెన్ లో ఉన్న నీచు వాసన అనేది పోతుంది.
అట్లకాడ వంటి గెరిటలు వాడటం వల్ల మన చికెన్ను ముక్కముక్కగా వస్తుంది.
చికెన్ కర్రీ తో ఏవేవి మనం కలుపుకొని తినవచ్చు :
-
వేడి అన్నం
-
చపాతి
-
దోస
-
ఇడ్లీ
-
పూరి
-
గార
-
వడ
-
పరోటా
-
ఫుల్కా
-
టమోటా రైస్
-
కుష్క
-
వెజ్ పలావ్
-
బగారా రైస్
-
జొన్న రొట్టె
-
నాన్
ఇటువంటి మరిన్ని సైడ్ దిస్ కోసం చికెన్ అనేది చాలా అద్భుతంగా ఆడ్ అవుతుంది. మన నోటికు కూడా చాలా టేస్టీ అయిన ఫుడ్ తిన్నామన్న అనుభూతి కూడా ఇస్తుంది.
ముగింపు:
అంతే మన ఇంట్లో చాలా రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. నేను చెప్పే మోతాదులో మరియు నేను చెప్పే టిప్స్ వాడటం వల్ల మీ చికెన్ కర్రీ కి చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఇంకెందుకు ఎదురు చూస్తున్నారు నేను చెప్పిన రెసిపీ వాడి ఈ సండే కానీ లేదా ఈరోజే మీ ఇంట్లో చికెన్ కర్రీ వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కడుపునిండా తినండి
Reed More Recipe Homemade Kitchan :-Click Me
Recipe Homemade Kitchan :- Click me