Gutti Vankaya Curry Recipe | Authentic Andhra Style Stuffed Brinjal Curry

గుత్తు వంకాయ కూర- ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూర Gutti Vankaya Curry | Andhra Style Stuffed Brinjal Curry Recipe

మన తెలుగువారి అందరికీ తెలియని కోరంటూ లేదు అందులో మొదట వచ్చేది గుత్తి వంకాయ కూర మాత్రమే. మన రెండు రాష్ట్రాల్లో తెలంగాణ మరియు ఆంధ్ర రెండు ప్రాంతాల్లో చాలా ఇష్టంగా తినేది గుత్తి వంకాయ కూర.కూరగాయల్లో రాజు ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది వంకాయ మాత్రమే. అలానే వంకాయలతో చాలా రుచులు ఉన్నాయి ఈ వంకాయ కూర వంకాయ వేపుడు వంకాయ చాప పులుసు వంకాయ టమాట పులుసు ఇలా చాలా రకాలుగా వండుకుంటారు.అందులో ముఖ్యంగా అందరూ ఇష్టపడి తినేదే గుత్తి వంకాయ కూర. ఈ కూర చేయటానికి చాలా సమయం పట్టదు మరియు చాలా మసాలాలు కూడా అవసరం లేదు.నేను చెప్పే విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే రుచికరమైన గుత్తి వంకాయ కూర మీ ఇంట్లోనే చాలా అద్భుతంగా వండుకొని తినొచ్చు.

కావలసిన పదార్థాలు : ingredients:

  •  చిన్న సైజు వంకాయలు :250 గ్రాములు

  •  ఉల్లిపాయలు రెండు 

  •  టమాటాలు రెండు 

  •  కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు 

  •  ధనియాలు ఒక టేబుల్ స్పూన్ 

  •  జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ 

  •  నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు 

  •  ఎండుమిరపకాయలు మూడు 

  •  పచ్చిమిరపకాయలు రెండు 

  •  లవంగాలు నాలుగు 

  •  మిరియాలు అర టేబుల్ స్పూను 

  •  వెల్లుల్లి ఒక పాయ 

  •  అల్లం ఒక కొమ్మ

  •  ఉప్పు తగినంత

  •  కారం రెండు టేబుల్ స్పూన్లు 

  •  పసుపు 1/2 టేబుల్ స్పూన్ 

  •  నూనె నాలుగు టేబుల్ స్పూన్లు 

  •  పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు 

  •  పోపు దినుసులు వన్ టేబుల్ స్పూన్ 

  •  కరివేపాకు ఒకరమ్మ 

  •  చింతపండు నిమ్మకాయ సైజు అంత 

  •  కొత్తిమీర తరుగు కొద్దిగా 

వంకాయలు ఎంచుకునే పద్ధతి :

ముందుగా సంతకు వెళ్లి ఫ్రెష్ గా ఉన్న వంకాయలను. వంకాయలు చూడటానికి నల్లగా మరియు నిగనగలాడుతూ ఉండాలి.

వంకాయలు ఎంచుకునేటప్పుడు నల్ల వంకాయలు మాత్రమే ఎంచుకోవాలి. గుత్తి వంకాయ కూర కి నల్ల వంకాయలు రుచిగా ఉంటాయి.

వంకాయలు తీసుకునేటప్పుడు పుచ్చులు ఉన్నాయా అని చూసుకోవాలి. చిన్న వంకాయలు అయితే గుత్తొంకాయకి చాలా రుచిని ఇస్తుంది త్వరగా కూడా వేగుతాయి.

మసాలాలు తయారు చేసే విధానం :

ముందుగా ఒక వెడల్పాటి పాన్ గాని లేదా మూగిడి గాని తీసుకోవాలి.

ఇందులో కాస్తన్ని ధనియాలు కాస్తని పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి.

దోరగా వేయించుకున్న వాటిని పక్కన ఇంకొక ఒక గిన్నెలోకి తీసుకోవాలి 

ఇప్పుడు అదే పాన్ లో రెండు ఎండు మిరపకాయలు కాస్తంత ఎండు కొబ్బరి మరియు మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క కాస్తంత కొబ్బరి తురుము కాసంత నువ్వులు ఆడ్ చేసి.

 మంటని సిమ్ లో పెట్టుకొని మాడిపోకుండా వేయించుకోవాలి.

 పూర్తి దినుసులు వేయించుకున్న తర్వాత చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి

గుత్తి వంకాయ కి కావలసిన కూరగాయలు కట్ చేసుకునే విధానం:

వంకాయలను నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పునీళ్ళల్లో వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి.

ఒక ఉల్లిపాయని పొడుగ్గా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

కరివేపాకును శుభ్రంగా కడుక్కొని పక్కనుంచుకోవాలి.

రెండు పచ్చిమిరపకాయలను పొడవుగా చీల్చాలి.

మిగిలిన ఇంకొక ఉల్లిపాయను నాలుగు పక్షాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాను కూడా నాలుగు పక్షాలుగా ముక్కలు కోసి పెట్టుకోవాలి.

అల్లం శుభ్రంగా కడిగి మొక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. చున్నులపాయలు కూడా తొక్కలు తీసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి.

గుత్తి వంకాయ కూర కి కావలసిన గ్రేవీ తయారు చేసుకునే విధానం :

ముందుగా చల్లార్చుకున్న మసాలాలన్నీ మిక్సీ జార్ లో ఆడ్ చేసుకోవాలి.

ఇందులో నాలుగు ముక్కల అల్లము మరియు పొట్టు వలసిన చిన్న ఉల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి.

ఇందులోనే ఒక కాస్తంత నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మరియు చున్నులు టమాటాలు.

ఇందులోనే కాస్తంత ఉప్పు కాస్తంత పసుపు రుచి కారం వేసుకోవాలి.

ఇందులోనే ఒక రెండు మూడు ఎండు మిరపకాయల వరకు వేసుకోవాలి.

ఈ మసాలా దినుసులు అన్నిటిని కాస్తని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు మనం కూర పూర్తి తయారీ చూద్దాం:

ముందుగా వంకాయ ముక్కలు నాలుగుటిగా చీల్చినవి మనం కట్ చేసుకుని పెట్టుకున్న వంకాయల్లోకి మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ని స్టఫింగ్ గా యాడ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను వాటిలో వేసి కాస్తంత ఉప్పు వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు ఎక్కువ సార్లు తిప్పకుండా వంకాయల్ని చెదరకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి.

ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను మరియు పచ్చిమిరపకాయలు వేసి దోరగా. కాస్తంత కరివేపాకు రెమ్మ కూడా వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి.

వంకాయలు బాగా వేగిన తర్వాత ఎక్కువ సార్లు తిప్పకుండా మిగిలిన గ్రేవీ అంతా అంటే మసాలా అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కాస్త అన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి.

ఈ దిశలో మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి.

గ్రేవీ కాస్త దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి.

చివరన కాస్తంత కొత్తిమీర తురుము వేసి గాని చేసుకుంటే మన వేడి వేడి గుత్తి వంకాయ కర్రీ రెడీ.

పూర్తి రుచి రావడానికి మనం పాటించాల్సిన కాస్తన్ని చిట్కాలు :

ఈ కర్రీ అనేది చాలా రుచిగా రావాలంటే మనం ముఖ్యంగా లేత వంకాయలను ఎంచుకోవాలి.

వంకాయలు అనేది చిన్న సైజులో ఉండేలాగా చూసుకోవాలి.

మసాలాలు మాడనివ్వకుండా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి.

ఈ మసాలా గ్రేవీ అనేది మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం గా ఉండేటట్లు చూసుకోవాలి.

నువ్వులు పల్లీలు ఎక్కువ కాకుండా చూసుకోవాలి నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటే పల్లీలు కూడా రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి.

చింతపండు అనేది ఎక్కువ వేయకూడదు కాస్తంత చింతపండు అయితే సరిపోతుంది ఎక్కువ పులుపు ఉన్న కూడా.

కూర పూర్తిగా అయిపోయిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి అప్పుడే మసాలా ఘాటు అనేది కూరకు బాగా పడుతుంది.

వేటితో తింటే బాగుంటుంది :

  • జొన్న రొట్టె 
  • వేడివేడి అన్నం 
  • బగారా రైస్ 
  • చపాతి 
  • పుల్కా 

నిల్వ ఉంచే విధానం :

ఈ కూరని వండుకున్న తర్వాత రోజు ఒక రోజంతా ఫ్రిజ్లో పెట్టుకొని వాడుకోవచ్చు దాదాపు 24 గంటల పాటు ఫ్రెష్ గా ఉంటుంది.

తినేటప్పుడు సన్నటి సెగ పైన వేడి చేసుకుని తింటే సరిపోతుంది.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన లేదంటే ఏ కూర అయినా ఏ రోజుకి ఆరోజే ఫ్రెష్ గా తినటం అలవాటు చేసుకోండి.

FAQ’S:

Q.వంకాయలు చిన్నవి ఎందుకు తీసుకోవాలి?

A.వంకాయలు చిన్నవి తీసుకోవడం వల్ల మనం నూనెలో వేయించేటప్పుడు త్వరగా వేగిపోతుంది.తినేటప్పుడు కూడా లేతగా రుచిగా ఉంటుంది ముదురు వంకాయలు అయితే బాగోదు అక్కడక్కడ విత్తనాలు తగులు ఉంటాయి కాబట్టి.

Q.పల్లీలు నువ్వులు సమపాలంగా ఎందుకు తీసుకోవాలి?

A.పల్లీలు నువ్వులు ఎక్కువ వేయటం వల్ల గ్రేవీ అనేది బాగా గట్టిపడుతుంది.

Q.చింతపండు ఎందుకు వేసుకోవాలి?

A.చింతపండు వేయటం వల్ల ఈ కర్రీకి కాస్తంత పులుపు చేరుతుంది అప్పుడు నోటికి రుచిగా ఉంటుంది.

Q.వంకాయలను ఉప్పు నీటిలో ఎందుకు వేసుకోవాలి?

A.వంకాయ అన్నం ఉప్పు నీటిలో వేయడం వల్ల అవి నల్లగా మారవు మరి చేదు ఎక్కవు.

పోషక విలువలు:

గుత్తి వంకాయ కూరలో ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

ఇందులో తక్కువ క్యాలరీస్ ఉండటం వలన గుత్తి వంకాయ తినే వారు బరువు తగ్గటానికి కూడా ఉపయోగపడుతుంది అంటే డైట్ చేసే వాళ్ళు కూడా తినవచ్చు.

రోగ నిరోధక శక్తి పెంచడానికి దీంట్లో అవసరమైన విటమిన్స్ క్యాలరీస్ మరియు మనకు కావాల్సిన కార్బోహైడ్రేస్ అన్ని లభిస్తాయి.

ముగింపు:

ఇంతే చాలా సులభంగా మన ఇంట్లోనే చాలా ఫాస్ట్ గా తయారు చేసుకోవాలో గుత్తి వంకాయ కూర రెడీ.

ఘాటైన మసాలా సువాసనతో మరియు లేత అయిన వంకాయలతో మన నోటిని నోరూరిస్తుంది.

మన ఇంటి వారు మరియు పిల్లలు చాలా ఆనందంగా మరియు సంతోషంగా తినగలిగిన వంటకం నిమిషాలు రెడీ అయిపోయింది 

మరి ఎందుకు ఆలస్యం మీ ఇంట్లో తయారు చేసి ఎలా ఉందోనా. మరి ఇంకెందుకు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఈ వారం గుత్తి వంకాయ తయారు చేసుకొని తినండి.నమస్కారం. 

Leave a Comment