కాకరకాయ టమాటా కూర రెసిపీ | చేదు లేకుండా రుచిగా కాకరకాయ

Kakarakaya Tomato Curry Recipe | చేదు తగ్గించి రుచిగా కాకరకాయ కూర

Kakarakaya Tomato Curry Recipe కూరగాయల్లో చేదు ఏదంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది కాకరకాయ మాత్రమే. కాకరకాయ అనేది చేదుగా ఉన్న ఇందులో ఉన్న పోషక విలువలు చాలా ఎక్కువ.

కాకరకాయ వేపుడు చేదుగా ఉంటుందనుకుంటే కాకరకాయతో కూర మరింత చేదుగా ఉంటుందని చాలా మంది తినరు. పిల్లలైతే అస్సలు తినరు కాకరకాయతో చిప్స్ చేయిస్తేనే తింటారు ఎప్పుడు చేస్తే అసలు తినరు మరి కూర చేసే అస్సలు ముట్టుకొని కూడా ముట్టుకోరు.

అలాంటి వారి కోసమే ఈ కాకరకాయ టమాటా రెసిపీ ఎటువంటి చేదు అనిపించకుండా కారం కారంగా పుల్ల పుల్లగా స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది మొదటిసారి చేసే వాళ్ళు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు.

చివరి వరకు నా రెసిపీని మీరు గాక ఫాలో అయితే మీరు కూడా ఇంట్లోనే చాలా సులభంగా తక్కువ సమయంతో ఎటువంటి మసాలాలు ఎక్కువగా వేయకుండా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు 

ముందుగా కావలసిన పదార్థాలు 

  •  కాకరకాయలు అరకిలో 
  •  టమాట పావు కిలో 
  •  పచ్చిమిరపకాయలు నాలుగు 
  •  ఉల్లిపాయలు రెండు 
  •  కారం రుచికి తగినంత
  •  అల్లం కొద్దిగా
  •  వెల్లుల్లి రెండు రెబ్బలు
  •  ఎండు కొబ్బరి ఒక చిన్న సైజు ముక్క 
  •  పోపు దినుసులు వన్ టేబుల్ స్పూన్ 
  •  జిలకర వన్ టేబుల్ స్పూన్
  •  ఎండు మిరపకాయలు రెండు 
  •  ఉప్పు రుచికి తగినంత
  •  నీరు తగినంత
  •  నూనె ఒక కప్పు
  •  పసుపు 1/2 టేబుల్ స్పూన్
  •  గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ 
  •  ధనియాల పొడి ఆఫ్ టేబుల్ స్పూన్ 
  •  వేయించిన జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్
  •  కొత్తిమీర కొద్దిగా
  •  చింతపండు నిమ్మకాయ సైజు అంత 

ముందుగా కాకరకాయల్ని కట్ చేసుకునే విధానం 

కాకరకాయను శుభ్రంగా నీటితో కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు. ఒక పీలర్ సహాయంతో పొట్టు తీసుకోవాలి.

ఇప్పుడు కాకరకాయని రెండు ముక్కలుగా చీల్చి లోపట ఇత్తనాలు శుభ్రంగా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు కట్ చేసిన కాకరకాయ ముక్కల్లో కాస్తంత ఉప్పు వేసి చేత్తో మెత్తగా స్మాష్ చేసుకుంటూ కలుపుతూ ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి.

10 నిమిషాల తర్వాత కాకరకాయల్లోని నీరంతా బయటకు వచ్చి కాకరకాయలోని చేదు అంతా పోతుంది.

ఇప్పుడు ఓ గుప్పెడుతో కాకరకాయ ముక్కల్ని తీసుకొని బాగా పిసిరితే వాటిలో ఉన్న నీరు శాతం అనేది పోతుంది చేదు కూడా అంత వదిలేస్తుంది.

ఇప్పుడు బాగా పిండినా కాకరకాయ ముక్కల్ని నీరు లేకుండా ఒక ప్లేట్ లో ఒక ఐదు నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి గాని రూమ్ టెంపరేచర్ గార్లు గాని ఉంచాలి. అంతే మన కూరకి కావాల్సిన కాకరకాయ ముక్కలు రెడీ అయిపోయింది.

కూరగాయలు కట్ చేసుకునే విధానం 

టమాటాలు ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. లేదా ఒక చిన్న బ్లండర్ లాంటిది లేకపోతే హ్యాండ్ బ్లెండర్ లాంటిది యూస్ చేసి మనకు వీలైనంత చిన్నగా టమాటాలు అనేది కట్ చేసుకోవాలి.

కరివేపాకు మరియు కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి 

అల్లాన్ని ఒక అరగంటసేపు నానబెట్టుకోవాలి ఇలా నాన పెట్టుకోవడం వల్ల అల్లం లో ఉన్న మట్టి దుమ్ము అంతా శుభ్రంగా పోతుంది.

ఇప్పుడు వెల్లుల్లి పొట్టు తీసుకొని ఒలుచుకొని పక్కనుంచుకోవాలి. కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే విధానం 

ముందుగా అరగంటసేపు నానబెట్టుకున్న అల్లం ని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకుని తొక్క తీసిన వెల్లుల్లి కూడా యాడ్ చేసి ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను కూడా ఆడ్ చేసి మిక్సీ జార్ లో కట్ చేయాలి.

ఒకసారి వాటర్ పోయకుండా పల్స్ ఇచ్చి తర్వాత కాస్తంత నీళ్లు పోసుకుని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి.

కాకరకాయ ముక్కలు వేయించుకున్న పద్ధతి 

ముందుగా ఒక కప్పు నూనె అని ఒక బాండీలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్కిస్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయలను కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేసుకోవాలి.

కాకరకాయలు ఫ్రై చేసేటప్పుడు కాస్తంత ఉప్పు వేయడం వల్ల కాకరకాయలకి కాస్తంత ఉప్పు పట్టి చేదు అనేవి మరి కొంచెం తగ్గుతుంది.

కాకరవాయిలు వేయించుకోండి అంటే మరి నల్లగా మార్చుకోకూడదు మరి పచ్చిగా ఉంచకూడదు.మీడియంగా కాస్తంత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.

నేను చెప్పిన విధంగా కాకరకాయలు అన్నిటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని పక్కనుంచుకోవాలి. అంతే మన కూరకి కావాల్సిన కాకరకాయలు రెడీ అయిపోయినాయి.

కాకరకాయ టమాట కూర తయారీ విధానం 

కూర మొదలుపెట్టకు ముందే మనం ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఒక చిన్న గిన్నెలో వేసి ఒక ఆరు గ్లాసు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి

మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయలు అన్నిటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ బాండీలో ఉన్న ఆయిల్ తోనే మనం కూర వండుకోవచ్చు.

ఇప్పుడు ఆ బండిలో ఉన్న ఆయిల్ సరిపోకపోతే కాస్తంత ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి.

ఆయిల్ వేడి అయినాక ఇందులోకి పోపు దినుసులు ఆడ్ చేసుకోవాలి అంటే కాస్త అన్ని పచ్చనగపప్పు ఆవాలు మరియు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర..

ఇందులోకి ఒక రెండు ఎండు మిరపకాయలు వేసుకొని కాస్తంత చిటపటలాడేంతవరకు వేయించుకోవాలి. పోప్ అనేది రంగు మారేంతవరకు వేయించుకున్న తర్వాత.

మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.

ఉల్లిపాయలు బాగా కలర్ మారి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి శుభ్రంగా కడుక్కున్న కరివేపాకు వేసి చిటపటలాడించాలి.

ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న లేదా చాపర్ లో చాప్ చేసుకున్న టమాటాలు వేసి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి.

ఈ కర్రీకి కాస్తంత ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి అప్పుడే కాకరకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు వేసిన వెంటనే అర టేబుల్ స్పూన్ పసుపు మరియు కర్రీకి సరిపడా అంత ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పి సింలో పెట్టి ఒక 20 మినిట్స్ పాటు టమాటాలు మెత్తగా గ్రేవీగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి.

టమాటాలు బాగా మెత్తగా గ్రేవీగా తయారయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి ఒక్కసారి కలబెట్టాలి.

ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అంటే రుచికి తరపు సరిపడా కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా మరియు 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి. ఇవన్నీ వేసి బాగా కలిసేంతవరకు ఒకసారి తిప్పి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న నిమ్మకాయ సైజు అంత చింతపండు గుజ్జుని నీళ్లు పోసుకోవాలి మరియు మనకి ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే కాస్త నీళ్ళు పోసుకొని ఉడికించుకోవచ్చు.

ఈ సమయంలో మనం ఒక పది నిమిషాలు పాటు ఉడికించి నూనె పైకి తేలేంతవరకు కూరని వేయించుకోవాలి.

చివర్లో కూరలోని ఉప్పు, కారం అన్ని సరిపోయిందో లేదో కరెక్ట్ గా సరి సమానంగా ఉందో లేదో చెక్ చేసుకొని చివరి నా కాస్తంత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన వేడి వేడి కాకరకాయ టమాట కూర రెడీ అయిపోతుంది.

తరచుగా చేసే తప్పులు 

కాకరకాయల్ని ఎక్కువగా వేయించకూడదు. అంటే మరీ నల్లగా మాడపెట్టకూడదు మనకి సరిపడంతో కరకరలాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది 

చింతపండు పులుసు ఎక్కువగా పోయకూడదు లేకపోతే కూర అనేది పుల్లగా ఉంటుంది.

ఈ కూరలో కొంచెం కారం స్పైసెస్ అనేది కాస్త ఎక్కువగానే పడాలి అప్పుడే కాకరకాయ చేదు అనేది మనకు తెలియకుండా ఉంటుంది.

టమాటాలు బాగా ఉడికేంత వరకు వేయించుకోవాలి లేకపోతే కూర అనేది పచ్చి వాసన వస్తుంది.

Frequently Asked Questions

1.కాకరకాయలు పొట్టు తీసుకొని కట్ చేసుకోవచ్చా?

 మీకు కాకరకాయ ఎలా తినాలనిపిస్తే అలా వండుకోవచ్చు పొట్టు తీసుకొని వండుకోవచ్చు పొట్టు తీయకుండా కూడా ఈ కర్రీ అనేది చేసుకోవచ్చు.

2.కాకరకాయలు ఉప్పు వేసి ఎందుకు నానబెట్టాలి?

 ఇలా నానబెట్టడం వల్ల కాకరకాయలు ఉన్న చేదు అనేది కాస్తంత పోతుంది.

3.చింతపండు పులుసు అనేది ఎందుకు పోయాలి?

 చింతపండు పులుసు పోయటం వల్ల కాకరకాయ అనేది చేదు తగ్గుతుంది మరియు రుచిగా కూడా ఉంటుంది.

4.ఈ కూరలో నూనె ఎక్కువగా ఎందుకు వేసుకోవాలి?

 ఈ కూరలో నూనె ఎక్కువగా పడితే కాకరకాయలు అనేది చేదు అంతా పోతుంది.

5.ఈ కూరలో నీరు అనేది కంపల్సరి పోయాల?

మీకు గ్రేవీగా కావాలంటే నీళ్లు పోసుకోవచ్చు లేకపోతే చిన్నప్పుడు పులుసు పోసి ఆఫ్ చేయొచ్చు.

పోషక విలువలు

కాకరకాయలో ఉండే చేదు వల్ల మన కడుపులో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదన్న ఉంటే తొలగిపోతుంది.

అదే చిన్న పిల్లలకైతే లోపల ఉన్న పసరు కూడా ఈజీగా తొలగిపోతుంది.

దీంట్లో మనం టమాటా మరియు చింతపండు వాడటం వల్ల మనకు కావాల్సిన విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.

సర్వ్ చేసే విధానం 

  •  వైట్ రైస్ 
  •  చపాతి 
  •  పూరి
  •  జొన్న రొట్టె 
  •  పుల్కా 
  •  రాగి సంగటి 
  •  జొన్న సంగటి 
  •  వెజ్ రైస్ 

వీటన్నిటిలోకి ఈ కాకరకాయ టమాట కూర అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి తప్పకుండా చూడండి.

Conclusion

ఈ ఆంధ్ర స్టైల్ ఇంట్లోనే ఈజీగా చేసుకునే కాకరకాయ టమాట కూర చాలా అద్భుతంగా ఉంటుంది మరియు చాలా రుచిగా కూడా ఉంటుంది.

తక్కువ సమయంలో ఎక్కువ రుచి అందించేది ఈ కాకరకాయ టమాటా కూరలో మాత్రమే. ఎప్పుడూ కాకరకాయ కూర తినటం ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కాకరకాయ కూర తిన్న తర్వాత ఎప్పుడు ఈ కోరే తినాలని అనుకుంటారు.

మీరు కూడా పోయి సారి ఈ విధంగా కాకరకాయ కూర ఇంట్లో తయారు చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది నా రెసిపీ ఫాలో అవ్వటం వల్ల అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ కాకరకాయ టమాటా కర్రీ అనేది అసలు చేదు లేకుండా ఇంట్లోనే.

మీ పిల్లలు కూడా ఎంతో ఆనందంగా మరియు ఇష్టంగా మళ్ళీ మళ్ళీ తినేలాగా ఉంటుంది. ఈసారి తప్పకుండా మీ ఇంట్లో వండుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా తినండి.

Leave a Comment