Sambar Recipe in Telugu | Andhra Style సాంబార్ ఇంట్లోనే తయారీ

Sambar recipe in Telugu- ఆంధ్ర స్టైల్ సాంబార్ రెసిపీ ఇంట్లోనే తయారీ విధానం.

Sambar Recipe in Telugu: సాంబార్ అనేది దక్షిణ ప్రాంతంలో పుట్టిన ఒక కర్రీ. మనం ఉండే ప్రాంతాన్ని బట్టి మనం తినే టేస్ట్ ను బట్టి సాంబార్ యొక్క రుచి కూడా మారుతుంది.

కొన్ని ప్రాంతాలలో సాంబార్ అనేది తీయగా తింటారు మరి కొన్ని ప్రాంతాల్లో సాంబార్ అనేది కొంచెం స్పైసీగా తింటారు ఇంకొన్ని ప్రాంతాల్లో సాంబార్ అనేది కొంచెం పుల్లగా తింటారు.

ఇలా వారి వారి తినే పద్ధతిని బట్టి నోటి యొక్క రుచిని బట్టి సాంబార్ అనేది టేస్ట్ మారుతుంది. ఎలా మారినా ఎలా ఉన్నా చేసే ప్రొసీజర్ మరియు రెసిపీ మాత్రం ఒకటే.

ఈ సాంబార్ అనేది అన్నంలోకే కాకుండా టిఫిన్స్ లోకి మరియు ఏదైనా రైస్ ఐటమ్ లో కూడా చాలా బాగుంటుంది 

మనం ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఏ ఫెస్టివల్ లో ఫుడ్ పెడుతున్న లేదా మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ముందుగా మన ఇంట్లో వడ్డించేది ఈ సాంబార్ మాత్రమే.

అటువంటి ఈ సాంబార్ ని ఇంట్లోనే హోటల్ స్టైల్ లో రుచికారంగా తయారు చేసుకోవడం ఈ రెసిపీలో చూపించితున్నాను

కందిపప్పు ఎంత ఏసుకోవాలో చింతపండు ఎంత వేసుకోవాలో ఎన్ని కూరగాయలు వేసుకోవాలో ఎంత మోతాదులో వేసుకోవాలో ఈ ఆర్టికల్ చదివితే మీకు తెలుస్తుంది.

మొదటిసారి చేస్తున్న కూడా చాలా అద్భుతంగా మరియు చాలా చిక్కగా మరియు చాలా టేస్టీగా వచ్చే విధంగా చెప్పగలను

ముందుగా కావలసిన పదార్థాలు 

  •  కందిపప్పు ఒక కప్పు 
  •  చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంత 
  •  జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ 
  •  ఆవాలు వన్ టేబుల్ స్పూన్ 
  •  పచ్చనగపప్పు వన్ టేబుల్ స్పూన్ 
  •  తెల్ల మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ 
  •  ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ 
  •  బెల్లం చిన్న ముక్క
  •  అల్లం ఒక చిన్న ముక్క
  •  చున్నులపాయ ఒకటి 
  •  కరివేపాకు ఒకరమ్మ 
  •  కొత్తిమీర కొద్దిగా
  •  నూనె నాలుగు టేబుల్ స్పూన్లు 
  •  పసుపు వన్ టేబుల్ స్పూన్
  •  ఉప్పు రుచికి తగినంత 
  •  ఎండు మిరపకాయలు రెండు 
  •  కారం రుచికి తగినంత
  •  టమాటాలు రెండు 
  •  ఉల్లిపాయ రెండు 
  •  పచ్చిమిరపకాయలు నాలుగు 
  •  క్యారెట్ ఒకటి 
  •  బంగాళదుంప ఒకటి 
  •  సొరకాయ చిన్న ముక్క 
  •  దోసకాయ ఒకటి 
  •  ముల్లంగి ఒకటి 
  •  బెండకాయలు మూడు 
  •  వంకాయ ఒకటి 
  •  మునక్కాయలు మూడు 
  •  ధనియాల పొడి ఆఫ్ టేబుల్ స్పూన్ 
  •  సాంబార్ పొడి ఆఫ్ టేబుల్ స్పూన్ 
  •  కొబ్బరి తురుము వన్ టేబుల్ స్పూన్ 

Andhra Style Sambar ముందుగా కందిపప్పు ఉడికించే విధానం 

ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు వేసి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి.

ఇలా కడిగిన కందిపప్పులోకి ఒక కప్పు కందిపప్పుకి 2 1/2 కప్పులు నీళ్లు పోసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసి మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.

దాదాపు మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే గ్యాస్ తీయకుండా అంటే ఎయిర్ పోకుండా స్టవ్ ఆఫ్ చేసి మూత తీయకుండా అట్లానే ఉంచాలి.

ఒక పది నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి మెత్తగా పప్పుగుత్తితో కలిపి పెట్టుకోవాలి. అంతే పప్పు రెడీ అయిపోయినట్లే.

ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకునే విధానం 

ముందుగా కూరగాయలు అనేవి శుభ్రంగా మంచినీటితో కడుక్కోవాలి 

టమాటాలను పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయల్ని రెండుగా చీల్చి మధ్యలోకి కట్ చేసుకోవాలి 

బంగారం దుంప తొక్క తీసుకొని పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే సొరకాయ మరియు క్యారెట్ మరియు దోసకాయ కూడా పొట్టు తీసుకొని అంటే పీల్ తీసుకొని పొడుగ్గా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు.

మునక్కాయలు మాత్రం కట్ చేసుకున్న తర్వాత వాటి ఉన్న పీసులు కూడా శుభ్రంగా తీసుకోవాలి.

బెండకాయల్ని ఒక బెండకాయ ని మూడు ముక్కలా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. వంకాయని కూడా ఒక కాయని నాలుగు ముక్కలా కట్ చేసుకుని ఉంచుకోవాలి. త

ముల్లంగిని కూడా రౌండ్ గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఉల్లిపాయల్ని ఒక కాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది . కొంచెం పెద్ద సైజులో.

అలాగే అల్లం ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మరియు చున్నులపాయలు కూడా పొట్టు తీసుకొని అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకొని మిక్సీ జార్ లోకి ఆడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

చింతపండు నానబెట్టే విధానం 

మనం కూర వండే ముందుగానే చింతపండు నానబెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును ఒక్కసారి కడిగి దాంట్లో ఒక గ్లాసు లేదా ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి ఒక 10 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.

లేదా మీరు నానబెట్టడం మర్చిపోవద్దు ఆ నిమ్మకాయ సైజు అంత చింతపండులోకి ఒక గ్లాసు వేడి నీళ్లు పోస్తే త్వరగా నాని పోతుంది.

ఇప్పుడు Sambar కు కూరగాయలు ఉడికించే పద్ధతి 

ముందుగా మనం ఏ సాంబార్ అయితే దీంట్లో పెట్టాలనుకున్న అలాంటి గిన్నె తీసుకోవాలి.

అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కాగనివ్వాలి. ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు హాఫ్ టేబుల్ స్పూన్ తెల్ల మినప్పప్పు మరియు రెండు ఎండు మిరపకాయలు వేసి కాస్త రంగు మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి.

మీకు గాని ఇంగువ వేసుకోవడం ఇష్టమైతే ఈ టైంలో ఇంగువ వేసుకోవచ్చు అది కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది లేదా మాకు నచ్చదు అనుకున్నప్పుడు స్కిప్ చేసేయొచ్చు.

ఇప్పుడు పోపు అంత బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కూరగాయల్లో ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొంచెం సాఫ్ట్ గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఎక్కువసేపు కూడా అవసరం చేస్తే సరిపోతుంది.

ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్న కూరగాయలన్నిటిని యాడ్ చేసుకోవాలి టమాటా పచ్చిమిరపకాయ మునక్కాయ వంకాయ బెండకాయ బంగాళదుంప దోసకాయ సొరకాయ మరియు ముల్లంగి ఈ కూరగాయలన్నీ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి.

ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు ముక్కలకి సరిపడా ఉప్పు వేసి ఒక పది నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి.

కూరగాయలనే ఒక 50% ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం మరియు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి మరియు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.

ఇలా కారం కూడా యాడ్ చేసిన తర్వాత మన ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసుని తొక్కలు లేకుండా ఇందులోకి వేయాలి.

చింతపండు పులుసు పోసిన తర్వాత ముక్కలు చింతపండు పులుసు బాగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి.

ఇప్పుడు ముక్కలు చింతపండు పులుసు బాగా కలిసిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కందిపప్పుని కాస్త నీరు పోసి ఆడ్ చేసుకోవాలి.

ఈ సమయంలో మనకి ఎంత నీరు నీరుగా కావాలో ఎంత థిక్ గా కావాలో చూసుకొని నీళ్లు యాడ్ చేసుకోవచ్చు.

ఇప్పుడు మనం సాంబార్లో ఉప్పు, కారం అన్ని కరెక్ట్ గా సరిపోయినా చూసుకొని చివర్లో కాస్తంత సాంబార్ పొడి వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన సాంబార్ అనేది తయారైనట్లే

సాంబార్ అనేది ఒక ఐదు నిమిషాల తో దింపుతున్నం అనుకున్నప్పుడు ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది.

అంతే మన వేడి వేడి సాంబారు అన్నం లోకి టిఫిన్స్ లోకి చాలా అద్భుతంగా తయారైపోయింది.

తరచుగా చేసే తప్పులు 

  1. కందిపప్పు అనేది సరిగా ఉడికించుకోవడం అక్కడక్కడ తొక్కల తొక్కలుగా తగలటం.
  2. చింతపండు పులుసు ఎక్కువ పోయడం వల్ల పులుపు అనేది ఎక్కువగా రావడం.
  3. కూరగాయలు ఎక్కువగా వేయటం వల్ల సాంబార్ గా అనిపించకపోవడం
  4. ఉప్పు కారం కరెక్ట్ గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోకుండా ఉండటం.
  5. చివర్లో కందిపప్పు కన్నా నీరు ఎక్కువగా పోయటం.

సాంబార్ దేనితో తింటే బాగుంటుంది 

  •  ఇడ్లీ
  •  దోస 
  •  చపాతి
  •  వైట్ రైస్
  •  బాగారా రైస్ 
  •  వడ 
  •  ఉప్మా
  •  కట్ట పొంగలి
  •  జొన్న సంగటి
  •  రాగి సంగటి
  •  జొన్న రొట్టె

సాంబార్ యొక్క పోషక విలువలు

సాంబార్ అంటేనే కందిపప్పుతో చేస్తాం కాబట్టి కందిపప్పు మంచి ప్రోటీన్ రిచ్ కంటెంట్. ఇందులో మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయి.

మరియు ఇందులో వాడే కూరగాయల వల్ల పిల్లలకి మరియు పెద్దలకి చాలా మంచిది.

సాంబార్ ని రోజు మన డైట్ లో కూడా తీసుకోవచ్చు డైట్ చేసే వాళ్ళు కూడా పుష్కలంగా తీసుకోవచ్చు.

Frequently Asked Questions – సాంబార్ గురించి సాధారణ ప్రశ్నలు

1.కందిపప్పు ఎన్ని విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి?

కందిపప్పు దాదాపు ఒక మూడు నాలుగు విజిల్స్ కైతే మెత్తగా ఉడుకుతుంది.

2.చింతపండు పులుసు ఎంత పోసుకోవాలి?

మనం తినే పులుపును బట్టి చింతపండు పులుసు యాడ్ చేసుకోవచ్చు.

3.కూరగాయలు అనేది ఎన్ని వేసుకోవచ్చు?

మనం సాంబార్ వండుతున్నాం కాబట్టి కూరగాయలు అనేది కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఎటువంటి కూరగాయలైన ఒక్కొక్కటి తీసుకుంటే సరిపోతుంది.

4.బెల్లం అనేది కంపల్సరీ వేసుకోవాలా?

బెల్లం అనేది తీయగా తినే వాళ్లకి బాగుంటుంది. లేదా మాకు అవసరం లేదన్నప్పుడు స్కిప్ చేయవచ్చు.

5.అనేది కంపల్సరీ వేసుకోవాలా?

అనేది ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే పెయిన్ అవసరం లేదు.

6.సాంబార్ పొడి కచ్చితంగా వేయాలి

అవును సాంబార్ పొడి వేస్తేనే అది సాంబార్ టేస్ట్ వస్తుంది లేకపోతే పప్పుచారు లాగా ఉంటుంది.

ముగింపు

చూడండి అందరూ ఇష్టంగా తినే ప్రతి దగ్గర ప్రతి ఒక్కరూ పెట్టే ఈ సాంబార్ రెసిపీ అనేది ఎంత చక్కగా తయారైపోయిందో.

మన ఎటువంటి ఫంక్షన్స్ కి వెళ్ళిన స్కూల్ కి వెళ్ళినా హాస్టల్స్ కి వెళ్లిన మరియు ఎక్కడైనా టిఫిన్ చేయాలన్నా ముందుగా మనకి కనపడేది సాంబార్ మాత్రమే.

స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు స్పైసీగా తినొచ్చు లేదా కొంచెం తియ్యగా కావాలనుకున్నావను తీయగా తినొచ్చు.

మనం తినే రుచిని బట్టి మనము తినాలనుకున్న టెస్టును బట్టి వండుకుంటే సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది.

అంతే అండి చాలా సింపుల్ గా ఇంట్లోనే హోటల్ స్టైల్ సాంబార్ అనేది ఎంత ఈజీగా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రిడియంట్స్ వాడి టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

నా ఆర్టికల్ ఫాలో అవ్వటం వల్ల మొదటిసారి చేస్తున్న కూడా చాలా సింపుల్గా మరియు ఈజీగా అనిపిస్తుంది.

ఎందుకు ఆలస్యం ఈసారి మీరు నేను చెప్పిన రెసిపీని ఫాలో అయ్యి ఇంట్లోనే మీరు కూడా హోటల్ స్టైల్ సాంబార్ చేసి మీ పిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినండి.

Leave a Comment