Prawns curry recipe విలేజ్ స్టైల్ రొయ్యల టమాటా కూర
Sea foods సీ ఫుడ్స్ ఇష్టంగా తినే వాటిలో అందరికీ ఫ్రాన్స్ కర్రీ కూడా ఒకటి. ఈ ఫ్రాన్స్ ని పెద్దగాను చిన్నగా ను రెండు సైజుల్లో ఉంటాయి. రెండు చాలా రుచిగా ఉంటాయి మరియు చాలా త్వరగా వండుకోవచ్చు.
ఫ్రాన్స్ ని చాలా విధాలుగా వండుకుంటారు టమాటా వేసి కూర చేసుకుంటారు గోంగూరలో వేసుకుంటారు బిర్యానీ చేసుకుంటారు ఫ్రై చేసుకుంటారు పకోడీ చేసుకుంటారు ఇలా చాలా విధంగా చాలా రకాలుగా వండుకుంటారు.
ఫ్రాన్స్ కర్రీని వారి ప్రదేశాన్ని బట్టి వారి స్టైల్ ని బట్టి నడవికను బట్టి వాళ్ల వాళ్ల పద్ధతిలో వండుకుంటారు ఎలా ఉండినా కూడా ఫ్రాన్స్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మరియు ఎన్నో ప్రోటీన్స్ కలవి.
ఇప్పుడు నేను చెప్పే రెసిపీ ఫాలో అవ్వటం వల్ల ప్రాన్స్ కర్రీని చాలా సింపుల్ గా ఇంట్లోనే చాలా ఫాస్ట్ గా మరియు టేస్టీగా వండుకునే విధంగా ఉంటుంది.
ముందుగా కావలసిన పదార్థాలు
1. ఫ్రాన్స్ వన్ కేజీ
2. టమాటాలు పావు కిలో
3. ఉల్లిపాయలు రెండు
4. పచ్చిమిరపకాయలు నాలుగు
5. కరివేపాకు ఒకరమ్మ
6. పసుపు వన్ టేబుల్ స్పూన్
7. కారం రుచికి తగినంత
8. ఉప్పు రుచికి తగినంత
9. నూనె ఒక కప్పు
10. నిమ్మకాయ ఒకటి
11. గరం మసాలా వన్ టేబుల్ స్పూన్
12. ధనియాల పొడి వన్ టేబుల్
13. ఫిష్ మసాలా వన్ టేబుల్ స్పూన్
14. కొత్తిమీర కొద్దిగా
15. అల్లం అరముక్క
16. వెల్లుల్లి రెండు పాయలు
17. ఎండు కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు
18. నీళ్లు సరిపడంత
ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసుకునే విధానం
ముందుగా రొయ్యల్ని నీటిలో బాగా కడగాలి రొయ్యలు పోయి ఉన్న సెల్ మరియు హెడ్ మరి తోకను అవసరాన్ని బట్టి తొలగించాలి.
రొయ్య వెనక బాగాన కనిపించే నల్లటి తీగను ఒక నైఫ్ సహాయంతో శుభ్రంగా తీసుకోవాలి.
తర్వాత రొయ్యల్ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని కాస్తంత ఉప్పు, నిమ్మరసం మరియు పసుపు వేసి ఒక రెండు మూడు సార్లు మంచి నీటితో కడుక్కోవాలి
రొయ్యలు వేయించుకునే విధానం
రొయ్యలను ముందుగా నూనెలో వేయించుకొని ఉండటం వల్ల కూరకి మరింత రుచి ఏర్పడుతుంది.
మొదట గిన్నెలో కాస్తంత నూనె వేసి అంటే రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కాగనివ్వాలి.
ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా కడుక్కున్న రొయ్యలను కాస్తంత పసుపు కాస్తంత కారం మరియు కొంచెం ఉప్పు వేసి ముక్కలకి పట్టేంతవరకు కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు వేయించుకోవాలి.
ఇలా వేయించడం వల్ల రొయ్యల్లోని పచ్చివాసన పోతుంది మరియు కూర వండుకునేటప్పుడు రొయ్యలు అనేది క్రిస్పీగా తయారవుతాయి. రొయ్య అనేది కూడా త్వరగా ఉడుకుతుంది.
ఇలా పసుపు ఉప్పు కారం వేసి నీళ్లు పోసి ఉడికించిన రొయ్యల్ని ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకునే విధానం.
ముందుగా అల్లం ఒక అరగంటసేపు మంచినీటిలో నానబెట్టుకోవాలి అప్పుడే అల్లం మీద ఉన్న మట్టి శుభ్రంగా పోతుంది.
ఇలా శుభ్రంగా కడుక్కున్న అల్లాన్ని పైన పొట్టు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లోకి ఆడ్ చేసుకోవాలి.
అందులోనే రెండు వెల్లుల్లి పాయల్ని కూడా పొట్టు తీసేసి వలుచుకొని మిక్సీ జార్ లోకి ఆడ్ చేసుకోవాలి మరియు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుని ఒకసారి పల్స్ ఇచ్చి మెత్తగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
అంతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది.
కూరగాయలు సిద్ధం చేసుకునే విధానం
ముందుగా ఉల్లిపాయను పచ్చిమిరపకాయను మరియు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.
తర్వాత కరివేపాకును మరియు కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచుకోవాలి.
ఇప్పుడు రొయ్యలు టమాటా కూర తయారీ విధానం
మొదట ఒక పాన్ తీసుకొని అందులో ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకోవాలి.
నూనె బాగా కాగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను మరియు పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఉల్లిపాయలు అనేది మంచి కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సిమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి ఇందులో కాస్తంత పసుపు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి.
దాదాపు 20 నిమిషాల పాటు టమాటాలని మగ్గాలి అంటే టమాటా అనేది చాలా మెత్తగా స్మూత్ గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి మన ముందుగా ఫ్రై చేసుకుని ఉడికించుకున్న రొయ్యలను కూడా ఆడ్ చేయాలి.
రొయ్యలు వేసిన తర్వాత మన కూరకి సరిపడంత కారము మరియు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి రొయ్యలకి బాగా పట్టేంతవరకు కలుపుకోవాలి.
ఇలా స్పైసెస్ రొయ్యలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం రొయ్యల్ని ముందుగానే ఉడికించి ఫ్రై చేసుకున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోతాయి.
ఇప్పుడు మనం ఆ రొయ్యలు కర్రీ లోకి మన గ్రేవీకి సరిపడినంత నీరు పోసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్ లో ఉడికించుకొని.
ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత నూనె అనేది పైకి తేలుతుంది అప్పుడు మన కర్రీలో సాల్ట్ కారం అన్ని సరిపయినా చెక్ చేసుకుని చివర్న కొత్తిమీరతో గాని చేసుకుంటే మన రొయ్యల టమాటా కర్రీ సిద్ధం అయిపోయింది.
తరచుగా చేసే తప్పులు
రొయ్యల్ని శుభ్రం చేసేటప్పుడు కాస్తంత ఉప్పు మరియు పసుపు మరియు నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కోవాలి లేకపోతే నీచు వాసన అనేది వస్తుంది
రొయ్యల్ని ఎక్కువసేపు ఉడికించకూడదు ఎందుకంటే అవి రబ్బర్ రబ్బర్ గా మారిపోతాయి.
టమాటా అనేది మరింత సాఫ్ట్ అయ్యేంతవరకు ఉడికించుకోవాలి అప్పుడే కర్రీ అనేది గ్రేవీ గా వస్తుంది.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే అడుగు అంటుతుంది.
కారం ఉప్పు నూనె అన్ని సరి సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి లేకపోతే కూర అనేది నీచు వాసన వస్తుంది.
రొయ్యల కూర టేస్ట్ గా రావాలంటే కొన్ని టిప్స్
రొయ్యలు ఎంచుకునేటప్పుడు అవి ఫ్రెష్ గా ఉన్నాయో లేదో ముందుగా చూసుకోవాలి.
రొయ్యల్ని ముందుగా ఉడికించి వేయించుకోవడం వల్ల మన కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది.
టమాటాలు అనేది బాగా ఎర్రగా మరియు సాఫ్ట్ గా చూసి జూసీగా అయిపోవాలి. అప్పుడే గ్రేవి అనేది టేస్టీగా ఉంటుంది మనం కలుపుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది.
Frequently Asked Questions
1.ఫ్రాన్స్ ని ఎలా కడుక్కోవాలి?
ఫ్రాన్స్ ని తెచ్చిన వెంటనే దాన్ని హెడ్ టేలు మరియు సెల్లు తీసేసి శుభ్రంగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి.
2.రొయ్యలలోకి టమాట మాత్రమే వాడొచ్చా?
మీరు టమాటా ప్లేసులు ఎటువంటి వెజిటేబుల్స్ నైనా తీసుకోవచ్చు అంటే గోంగూర బెండకాయి దోసకాయి బంగాళదుంప ఇట్లాంటివి ఏవైనా ఆడ్ చేసుకోవచ్చు.
3.రొయ్యల్ని ముందుగా ఎందుకు ఉడికించాలి?
రొయ్యల్ని ముందుగా ఉడికించడం వల్ల రొయ్యల్లో ఉన్న నీ సువాసన అనేది పోతుంది మరియు బాగా ఫ్రై అవ్వటం వల్ల తింటానికి క్రిస్పీగా ఉంటాయి
4.కొబ్బరి వేయటం వల్ల కూర అనేది మాడు వాసన రాదా?
ఎండుకొబ్బరి మసాలాలో వేయటం వల్ల మన కర్రీ అనేది కొంచెం గ్రేవీ గా వస్తుంది.
5.టమాటా ఉడికిన తర్వాత రొయ్యల్ని ఎంతసేపు ఉడికించుకోవాలి?
టమాటా బాగా వేగిపోతుంది కాబట్టి మనం ముందుగానే రొయ్యల్ని కూడా వేయించుకున్నాం కాబట్టి రొయ్యలు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది.
రొయ్యల కూర దేనితో తినొచ్చు
- టమోటా రైస్
- వైట్ రైస్
- కొబ్బరి రైస్
- రాగి సంగటి
- జొన్న సంగటి
- జొన్న రొట్టె
- వెజ్ పులావ్
- పరోటా
- పుల్కా
- పలావ్
- చపాతి
ఇలా ఏ విధమైన రైస్ లోకి అయినా ఏ విధమైన రోటీస్ లోకైనా ఈ ఫ్రాన్స్ కర్రీ అనేది చాలా టేస్టీగా మరియు చాలా మంచి కాంబినేషన్ గా ఉంటుంది.
ఫ్రాన్స్ కర్రీ యొక్క పోషకాలు
ఫ్రాన్స్ అనేది అంటే రొయ్యలు అనేవి మంచి ప్రోటీన్స్ ఓర్సు వీటిలో ఉండే ప్రోటీన్స్ వల్ల మన బాడీకి పుష్కలంగా మంచి క్యాలరీస్ మినరల్స్ అందుతాయి
డైట్ చేసే వాళ్ళు కూడా రోజు తినే విధంగా ఉంటుంది ఎందుకంటే ఇందులో లో క్యాలరీ ఫుడ్(calorie food) ఉండటం వల్ల చీ ఫుడ్స్ అనేది డైలీ తీసుకోవచ్చు మరియు ఇది హెల్తీ డైట్ (healthy diet) కింద వస్తుంది.
Conclusion
ఇంట్లో సులభంగా మరియు తక్కువ సమయం వాడుకొని చాలా హెల్తీగా మరియు టేస్టీగా ఉండకుండా ఈ ఫ్రాన్స్ కర్రీ కూడా సి ఫుడ్స్ లో ఒక రెసిపీ.
రొయ్యల cleaning, cooking time, tomato masala, village-style taste ఇలా టమాటా ఉల్లిపాయ మరియు మసాలా దినుసులు వేసుకొని అద్భుతంగా మరియు టేస్టీగా విలేజ్ స్టైల్ లో ఉండుకుంటే ఈ రొయ్యల టమాటా కూర అనేది చాలా రుచిగా ఉంటుంది.
వేడివేడి అన్నంలోకి మరియు చపాతీల్లోకి రోటీలోకి అద్భుతంగా ఉంటుంది మరియు ఆనందంగా కడుపునిండా తినొచ్చు
పిల్లలనుంచి పెద్దవారు వరకు ఇష్టపడిన వాళ్లు ఎవరు ఉండరు. నేను ఇచ్చిన ఈ రెసిపీని ఫాలో అవటం వల్ల అసలు ఫస్ట్ టైం ఉండే వాళ్ళు కూడా చాలా ఈజీగా మరియు చాలా టేస్టీగా ఉండగలరు.
ఇంకెందుకు ఆలస్యం నేను చెప్పిన రెసిపీని ఫాలో అయ్యి మీరు కూడా ఈ సండే మీ ఇంట్లో ఈ రొయ్యల టమాటో కూర అని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినండి.