వంకాయ చాప కర్రీ రెసిపీ | తక్కువ సమయంలో సులభంగా రుచికరమైన కర్రీ

వంకాయ చాప కర్రీ రెసిపీస్ – చాలా సులభంగా తక్కువ సమయంతో మరి ఎక్కువ రుచితో తయారు చేసుకునే విధంగా

మన తెలుగు ప్రజలందరూ వంకాయలు చాలా విధంగా చాలా రకాలుగా వండుకుంటారు. వంకాయ టమాట వంకాయ చాప వంకాయ పులుసు గుత్తి వంకాయ వేపుడు వంకాయ గ్రేవీ ఇలా చాలా విధాలుగా వంకాయని పలుపరు రాష్ట్రాలకు బట్టి అంటే వారు ఉండే ప్రాంతాన్ని బట్టి వంకాయ అనేది ఏ విధంగానో వండుకుంటారు.

అదే వంకాయని చాపలు వేసి అదే ఎండి చాపలు వేసి వండుకుంటే ఆ రుచే వేరు వంకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఒక ముద్ద కలగా తినగలగా అద్భుతమైన రుచి ఈ వంకాయ చాప. చివరి వరకు చూడటం వల్ల ఎంతో సులభంగా మరియు మొదటిసారి వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటట్లు మన రెసిపీ ఉండబోతుంది.

ముందుగా వీటికి కావలసిన పదార్థాలు 

  •  ఎండు చాపలు ఆరు ముక్కలు 
  •  వంకాయలు పావు కిలో 
  •  టమాటాలు రెండు 
  •  ఉల్లిపాయ ఒకటి 
  •  పచ్చిమిర్చి రెండు 
  •  కరివేపాకు ఒకరమ్మ 
  •  కొత్తిమీర అర కప్పు 
  •  చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత 
  •  కారం రుచికి సరిపడా
  •  ఉప్పు రుచికి సరిపడా 
  •  పసుపు 1/2 టేబుల్ స్పూన్ 
  •  నూనె ఒక కప్పు
  •  నీరు తగినంత

ముందుగా చాపలను శుభ్రం చేసుకునే విధానం 

Dry fish pieces (Endu Chapa) in a bowl
ఎండు చాపలు – రుచికరమైన చాప కర్రీ తయారీకి ఉపయోగించే ఎండుచేపలు.

మనం చాపల కూర వండుకోవాలి అనుకున్న ముందు ఒక అరగంట ముందు చేపల్ని శుభ్రంగా ఒకసారి కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి.

ఇలా నానబెట్టుకున్న చేపల్ని ఒక చిన్న నైఫ్ సహాయంతో దాని పైనున్న జిగురులాంటి చర్మాన్ని నీటుగా క్లీన్ చేసుకుని లేదా రఫ్ గా ఉన్న సర్ఫేస్ లో రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి.

అప్పుడే అందులో ఉన్న నీచువాసన మట్టి మురికి ఏదైనా ఉన్నా శుభ్రంగా పోతుంది ఇలా గట్టిగా రెండు మూడు సార్లు రుద్దిన తర్వాత శుభ్రంగా మంచి నీటితో ఒక మూడు సార్లు కడుక్కోవాలి.

ఇప్పుడు కూరగాయలను కట్ చేసుకునే విధానం 

ముందుగా వంకాయల్ని ఒకసారి కడుక్కొని తర్వాత ఒక గిన్నెలో కాస్తంత ఉప్పు మరియు నీళ్లు పోసి వంకాయలు కట్ చేసి వంకాయ ముక్కలను ఉప్పు నీటిలో వేసుకోవాలి.

ఇప్పుడు రెండు టమాటాలను పొడుగ్గా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

అలాగే ఒక ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకోవాలి . మరియు పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కనుంచుకుందాం.

కరివేపాకు మరియు కొత్తిమీరను శుభ్రంగా నీటితో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.

చింతపండును కూడా ఒకసారి కడిగి ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకోవాలి.

ఇప్పుడు వంకాయ చాప కూర తయారు చేసుకునే విధానం

మనం ఉండేది ఆంధ్ర స్టైల్ కాబట్టి మనం చాప వంకాయ కూర ని కలిపి పెట్టుకుంటాము ఇదే విధంగా చాలా విధాలుగా వండుకోవచ్చు పోపు పెట్టి కూడా వంకాయ చాప వండుకోవచ్చు కాకపోతే ఈ విధంగా ఉండటం వల్ల ఈ కూర అనేది రుచి బాగుంటుంది.

వంకాయ చాప కూర కలియబెట్టుకునే విధానం 

ముందుగా నానబెట్టుకున్న చేపల్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి.

ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా కలుపుకోవాలి. ఇందులోనే టమాటా ముక్కలు ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మరియు కరివేపాకు వేసి కలుపుకోవాలి.

తరువాత మనము రుచికి సరిపడా కారం మరియు తీసుకున్న చాపలులో ఉప్పు తినమని పట్టి అంటే ఉప్పు చాపలు అయితే కాస్తంత ఉప్పు తక్కువ వేసుకోవాలి.

మనం తీసుకునే చేపలను బట్టి ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. మరియు ఒక కప్పు నూనె అంటే ఒక టీ గ్లాస్ నూనె వేసుకోవాలి. ఎప్పుడైనా నీచుకూర ఉండేటప్పుడు నూనె అనేది ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే నీచుకోరనేది వాసన లేకుండా ఉంటుంది మంచి రుచిగా కూడా ఉంటుంది.

ఆ తరువాత నూనె కూడా వేసిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీరు పోసుకొని గరిటతో చిన్నగా కనిపెట్టాలి.

ఇప్పుడు మనం పోయి వెలిగించుకొని ఈ కడాయిని అంటే మనం కనిపెట్టుకున్న కడాయిని స్టవ్ మీద పెట్టి ఒక 20 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి.

దాదాపు ఒక 50% ముక్కలు అనేది ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఎటువంటి పీచులు లేకుండా మరియు తొక్కులు పడకుండా ఉట్టి గుజ్జు మాత్రమే వేసుకోవాలి.

ఇలా చింతపండు పులుపు వేయటం వల్ల కూర అనేది కాస్తంత పులుపుగా మరియు నీచు వాసన లేకుండా ఉంటుంది. మీకు కావాలంటే మనం కూర కనిపెట్టేటప్పుడు కూడా చింతపండు పులుసు అనేది వేసుకోవచ్చు.

ఆ తరువాత ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకొని నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి.

ముఖ్యంగా గమనించాల్సిందే ఏందంటే అసలు గరిట అనేది పెట్టకూడదు.

చివరన కాస్తంత కొత్తిమీర తరుగు వేసుకొని మన ఉప్పు చూసుకుంటే వేడి వేడి వంకాయ చాపల పులుసు రెడీ.

తరచుగా చేసే తప్పులు

వంకాయలను కోసిన వెంటనే ఉప్పు నీటిలో వేసుకోవాలి లేదన్నట్లే వంకాయలు చేదుకుతాయి మరియు నల్లగా మారిపోతాయి.

చింతపండు పులుసు అనేది ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే ఎక్కువగా పుల్లగా ఉండటం వల్ల వంకాయ రుచి అనేది తెలియదు.

చాపల అనేది కనీసం అరగంట పాటు నానబెట్టుకోవాలి అప్పుడే దాంట్లో ఉన్న నీచు వాసన ఇసుక అనేది పూర్తిగా పోతుంది.

చాపలు బాగా నానబెట్టిన తర్వాత ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే కూర అనేది వాసన వస్తుంది

చివర్న కొత్తిమీర కచ్చితంగా వేయాలి లేకపోతే కూర అనేది నీచువాసన పోదు.

మనం తీసుకున్న చాపలను బట్టి ఉప్పు వేసుకోవాలి ఉప్పు చాపలు అయితే తక్కువగా వేసుకోవాలి. చప్పుడు చాపలు అయితే కొంచెం చూసుకొని వేసుకోవాలి.

కూర రుచిగా రావాలంటే కొన్ని చిట్కాలు

ముందుగా చేపలు శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు కారం సరి సమానంగా పడిందో లేదో చెక్ చేసుకోవాలి అప్పుడే కూర రుచి అనేది బాగా తెలుస్తుంది.

వంకాయలను కట్ చేసిన తర్వాత ఉప్పు నీటిలో తప్పనిసరిగా వేసుకోవాలి లేకపోతే కూర అనేది చేదు వస్తుంది.

కాస్తంత చింతపండు పులుసు వేయడం వల్ల కూర అనేది మరింత రుచిగా మరియు పుల్లపుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది.

చివర్న కొత్తిమీర వేయటం వల్ల కూర అనేది కమ్మనైన వాసన మరియు రుచిత ఉంటుంది 

నీరు అనేది ఎక్కువగా పోయకూడదు మనము సరిపడా గ్రేవీను బట్టి నీళ్లు పోసుకోవాలి.

Frequently Asked Questions

ఏ విధమైన వంకాయను తీసుకోవాలి?

మనకు నచ్చే మనము తినే ఎటువంటి వంకాయలు అన్న వాడుకోవచ్చు కాకపోతే వంకాయలు అనేది పుచ్చులు లేకుండా ఫ్రెష్ గా ఉండేటట్లు చూసుకోవాలి.

వంకాయలు కడిగిన తర్వాత ఉప్పు నీటిలో ఎందుకు వేసుకోవాలి?

వంకాయలు ఉప్పు నీటిలో వేసుకోకపోతే వంకాయ కూర అనేది చేదుగా వస్తుంది.

నీరు ఎక్కువగా పోసుకోవచ్చా?

ముఖ్యంగా వంకాయ కూరకు ఎక్కువ నీరు అవసరం లేదు మన కర్రీకి ఎంత గ్రేవీ అవసరం అన్ని నీరు పోసుకుంటే సరిపోతుంది.

గరిటతో ఎందుకు తిప్పకూడదు?

తరచుగా గరిటతో తిప్పటం వల్ల చాప అనేది చిదిరిపోయి ముళ్ళు కూరలో వస్తుంది.

చాపలు ఎందుకు నాన్న పెట్టాలి?

చాపలనేది నాన్న పెట్టకపోతే అందులో ఉన్న ఇసుక మరియు పైనున్న పులుసు అనేది శుభ్రంగా పోదు.

వంకాయ చాప కూర వేటితో తింటే రుచిగా ఉంటుంది 

  •  వైట్ రైస్
  •  చపాతి 
  •  రాయి సంగటి
  •  జొన్న రొట్టె 
  •  జొన్న సంగటి 
  •  సజ్జసంగటి 
  •  రోటి 
  • పూరి 
  •  దోస 
  •  నాన్ 
  •  పుల్కా 

పోషక విలువలు 

వంకాయలో ఫైబర్ మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి కానీ ఇది ప్రోటీన్ ఎక్కువగా ఉన్న కూరగాయల కాదు. కావున వంకాయతో పాటు మనం ఇటువంటి ఎటువంటి చాపలు లేదా టమాటాలు కందిపప్పు, పెసరపప్పు ఇట్లాంటివి జోడించుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అనేవి పుష్కలంగా అందుతాయి.

ముగింపు

తక్కువ సమయంలో మరియు తక్కువ కూరగాయలు వాడు ఎంతో రుచికరమైన వంకాయ కూర సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోగలము.

మొదటిసారి వంట చేసేవారు కూడా ఈ రెసిపీని ఫాలో అయితే కచ్చితంగా చాలా రుచిగా మరియు అద్భుతంగా చేయగలరు.

ఎటువంటి మసాలాలు మరియు ఫుడ్ కలర్స్ వాడకుండా ఎంతో రుచికరమైన మరియు హైజినిక్గా ఇంట్లోనే ఈ వంకాయ చాప కూర వండుకొని కడుపునిండా తినొచ్చు.

మీరు తినే రుచిని బట్టి కారము మరియు ఉప్పు వేసుకొని చాలా రుచిగా పిల్లలు కూడా ఎంతో ఆనందంగా మరియు ఇష్టంగా తినే ఈ వంకాయ చాప కూర మీరు కూడా ట్రై చేయండి కడుపునిండా వేడివేడి అన్నంతో తింటూ ఆనందించండి.

Leave a Comment