వెజ్ పులావ్ రెసిపీ – ఇంట్లోనే చాలా సులభంగా మరియు చాలా టేస్టీగా తయారు చేసుకునే విధంగా

Veg Pulao Recipe | ఇంట్లోనే సులభంగా టేస్టీ వెజ్ పులావ్ తయారీ

వెజ్ పులావ్ అంటే ఇష్టం లేని ఊరు మరియు తిననోళ్లు ఎవరు ఉండరు. తింటానికి ఎంత రుచిగా ఉంటుందో మరి చేయటానికి కూడా అంతే సింపుల్గా మరియు చాలా తక్కువ సమయంలో వండుకునే విధంగా ఉంటుంది.

వెజ్ పులావ్ కి కాస్తన్ని వెజిటేబుల్స్ తగిలించడం వల్ల దాని రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈమధ్య ఫంక్షన్స్లో అంటే మ్యారేజ్ లో కానీ ఏదన్నా బర్త్డే ఫంక్షన్ లో కానీ లేకపోతే దేవుడు ప్రసాదంగా కూడా వెజ్ పులావ్ అనేది పెడుతున్నారు.

మన ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ చేసుకోవాలన్న లేదా ఫ్రెండ్స్ తో గెదర్ అవ్వాలన్నా మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మరియు చాలా సింపుల్ గా అయిపోయేది టేస్టీగా ఉండేది వెజ్ పులావ్ మాత్రమే.

ఈ వెజ్ పులావ్ అనేది చికెన్ కర్రీ తో గాని ఏదైనా వెజిటేబుల్ కర్రీ తో కానీ లేదా ఓన్లీ మసాలా గ్రేవీతో అయినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది లేదా చివరికి పెరుగు రైతాతో కూడా అమోహన్ గా ఉంటుంది.

ఈ వెజ్ పులావ్ ను నేను కింద ఇచ్చిన రెసిపీని ఫాలో అవ్వటం వల్ల అసలు వంట రాని వాళ్ళు అంటే ఒక్కసారి కూడా వంట చేయని వాళ్ళు మొదటిసారి వంట చేస్తున్న వాళ్లు కూడా ఎంతో సింపుల్ గా మరియు టేస్టీగా వెజ్ పులావ్ అనేది ఉండగలరు.

కావలసిన పదార్థాలు 

  •  బాస్మతి రైస్ రెండు కప్పులు
  •  క్యారెట్ ఒకటి 
  •  బీన్స్ 6 
  •  మిల్ మేకర్ ఒక కప్పు 
  •  బంగాళదుంప ఒకటి 
  •  పచ్చిమిరపకాయలు నాలుగు 
  •  పచ్చి బఠానీలు హాఫ్ కప్పు 
  •  క్యాప్సికం ఒకటి 
  •  ఉల్లిపాయ ఒకటి
  •  అల్లం చిన్న ముక్క 
  •  వెల్లుల్లి రెండు పాయలు 
  •  కొత్తిమీర ఒక కప్పు
  •  పుదీనా ఒక కప్పు 
  •  కరివేపాకు రెండు రమ్మలు 
  •  ఎండు మిరపకాయలు రెండు 
  •  నూనె నాలుగు టేబుల్ స్పూన్లు 
  •  నెయ్యి మూడు టేబుల్ స్పూన్లు 
  •  ఉప్పు రుచికి తగినంత 
  •  నీళ్లు తగినంత
  •  నిమ్మకాయ అర చెక్క 

మసాలా దినుసులు

  •  బిర్యానీ ఆకు రెండు 
  •  లవంగాలు నాలుగు 
  •  యాలుకలు రెండు 
  •  షాజీరా  వన్ టేబుల్ స్పూన్ 
  •  మరాటి మొగ్గ ఒకటి 
  •  స్టార్ పువ్వు ఒకటి
  •  అనాసపు ఒకటి 
  •  గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ 
  •  ధనియాల పొడి ఆఫ్ టేబుల్ స్పూన్ 
  •  బిర్యానీ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ 

బాస్మతి బియ్యం ఎంచుకునే విధానం 

ముందుగా ఒక రెండు కప్పులు బాస్మతి బియ్యాన్ని రెండు మూడు సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి.

ఈ బాస్మతి బియ్యాన్ని మునిగేంత వరకు నీళ్లు పోసుకుని దాదాపు 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.

కూరగాయలను కట్ చేసుకునే విధానం 

క్యారెట్ బీన్స్ క్యాప్సికము బంగాళదుంప ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి.

ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి

పచ్చిమిరపకాయల్ని రెండు ముక్కలుగా చీల్చి కట్ చేసుకోవాలి 

అల్లాన్ని కూడా శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.

కరివేపాకు కొత్తిమీర మరియు పుదీనా అని శుభ్రంగా కడుక్కొని చిన్నచిన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే విధానం

ముందుగా అల్లాని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత పైన చెక్కులు తీసేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి.

చున్నులపాయల్ని పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని ముందుగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అంతే చాలా సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోతుంది 

మిల్ మేకర్స్ రెడీ చేసుకునే విధానం 

ముందుగా మీల్ మేకర్స్ ను ఒక పది నిమిషాలు పాటు వేడి నీళ్లలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల వాటిలో ఉన్న మట్టి లేదా ఎటువంటి డస్ట్ పార్టికల్స్ అయినా కూడా క్లీన్ గా పోతాయి.

పది నిమిషాలు వేడి నీళ్లలో నానబెట్టిన తర్వాత అవి మెత్తగా పిసురుతూ వాటర్ అంతా స్క్రీజ్ చేస్తూ ఇంకొకసారి మామూలు వాటర్ లో వేసుకొని మెత్తగా వాటర్ అన్ని వంపేసుకొని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

వెజ్ పులా వండే విధానం 

ముందుగా మనం బిర్యానీ తయారు చేసుకునే ఎటువంటి వెడల్పాటి మందపాటి గిన్నెను తీసుకోవాలి.

ఇప్పుడు ముందుగా మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి మరియు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కాగనివ్వాలి.

ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క లవంగాలు యాలుకలు స్టార్ స్టార్ పువ్వు కాస్తంత షాజీరా మరియు రెండు ఎండు మిరపకాయలు వేసి కొంచెం కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి 

ఈ మసాలాల్ని ఫ్రై అయిన తర్వాత మన ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికము పచ్చి బఠానీలు మరియు బంగాళదుంప బీన్స్ ఇవన్నీ వేసుకుని కాసంత సాల్ట్ వేసి వేగనివ్వాలి.

కూరగాయలన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న మిల్మేకర్లు కూడా ఆడ్ చేసి ఒకసారి కలపెట్టుకోవాలి.

ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర రెండు కరివేపాకు రమ్మను మరియు సన్నగా తరిగిన పుదీనా కూడా వేసి ఒకసారి కూరగాయలతో ముగించుకోవాలి.

కూరగాయలన్నీ దాదాపు 50% ఉడికిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మన బియ్యానికి సరిపడాన్ని నీరు పోసుకొని మరిగించుకోవాలి.

నీళ్లలోనే రుచికి సరిపడా ఉప్పు మరియు కాస్తంత ధనియాల పొడి కాస్తంత గరం మసాలా మరియు బిర్యానీ పొడి కూడా వేసి ఒక్కసారి కలిపి పెట్టుకోవాలి.

నీరు బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి గరిటతో ఒక్కసారి కలిపి ఉంచాలి

ఇప్పుడు బియ్యం మొత్తం వేసిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పెట్టుకొని మరి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే మన వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది.

వెజ్ పులావ్ అనేది ఉడికిన తరువాత పైన ఒక అరచెక్క నిమ్మరసం వేయటం వల్ల అన్నమనేది పొడిపొడిగా వస్తుంది.

అంతే అండి ఎంతో సింపుల్ గా మరియు తక్కువ కూరగాయలతో తక్కువ సమయంతో వండే వెజ్ పులావ్ అనేది ఈజీగా మన ఇంట్లోనే తయారైపోతుంది.

నీళ్లు కొలుచుకునే పద్ధతి

మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి నీళ్లు కొలుచుకోవాలి.

ఇప్పుడు మనం బాస్మతి బియ్యం తీసుకున్నట్లయితే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు నీళ్లు సరిపోతుంది.

లేదా మీరు బీపీటీ రైస్ కానీ ఇది మరియు ఎటువంటి రైస్ని కానీ వాడుతున్నట్లయితే ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్లు పోసుకోవడం మంచిది.

పులావు పొడిపొడిగా రావాలంటే ఏం చేయాలి 

ముందుగా మనం నీరు మరిగించేటప్పుడు లేదా పోపు వేసేటప్పుడు కాస్తంత నెయ్యి వేయడం వల్ల అన్నం అనేది పొడిపొడిగా వస్తుంది.

నీరు మరిగిన తర్వాత బియ్యం వేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే తిప్పాలి పదే పదే తిప్పటం వల్ల బియ్యం అనేది విరిగిపోతుంది.

చివరగా పులావ్ అంతా పూర్తిగా ఉడికిన తర్వాత అర చెక్క నిమ్మరసం పిండటం వల్ల లేదా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయడం వల్ల కూడా బియ్యం అనేది పొడిపొడిగా వస్తుంది 

తరచుగా చేసే తప్పులు Common Mistakes

వెజ్ పులావ్ లోకి వెజిటేబుల్స్ అనేది ఎక్కువగా వేసుకోకూడదు అన్ని సరి సమానంగా వేసుకుంటేనే వెజ్ పులావ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది మరియు టేస్టీగా ఉంటుంది.

మనం ఉండేటప్పుడు ఉట్టి నూనెతో కాకుండా కాస్తంత నెయ్యి వేయడం వల్ల కూడా దీనికి మరింత రుచి ఆడ్ అవుతుంది.

మనం ఉండిన వెజ్ పులావ్ అనేది పొడిపొడిగా రావాలి కాబట్టి ఎక్కువ సేపు తిప్పకుండా చూసుకోండి పొడిపొడిగా వస్తేనే దాన్ని రుచి అనేది అద్భుతంగా తెలుస్తుంది.

Frequently Asked Questions

కూరగాయలు ఎందుకు ఎక్కువగా వేసుకోకూడదు?

ఎక్కువ వేయటం వల్ల మనం వెజ్ పులో తిన్నట్లు ఫీలింగ్ అనిపించదు. కూరగాయలు బియ్యం అనేది సరి సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి.

చివర్న నిమ్మకాయ ఎందుకు పిండుకోవాలి?

నిమ్మకాయ చెక్క పిండటం వల్ల అన్నమనేది పొడిపొడిగా వస్తుంది.

మిల్ మేకర్లు వేడి నీళ్లలో ఎందుకు ఉడికించాలి?

మిల్ మేకర్లు వేడి నీళ్లలో వేయటం వల్ల అందులో ఉన్న మట్టి దుమ్ము అంతా పోయి నీచువాసన అనేది పోతుంది.

సగం నెయ్యి సగం నూనె ఎందుకు వేసుకోవాలి?

నూనె మరియు నెయ్యి వేయడం వల్ల వెజ్ పులావ్ అనేది మరింత రుచిగా మరియు ఫ్లేవర్గములుగా ఉంటుంది.

వెజ్ పులావ్ కి బాస్మతి రైస్ మాత్రమే వాడుకోవాలా?

వెజ్ పులా ఉండటానికి బాస్మతి రైస్ కాదు మామూలు రైస్ కూడా చాలా బాగుంటుంది. మనం తీసుకునే బియ్యాన్ని బట్టి నీళ్లు కొలత అనేది చూసుకోవాలి.

కలిపి తినే పదార్థాలు 

  • చికెన్ కర్రీ
  • వెజ్ కర్రీ
  • ఆలూ కుర్మా 
  • మసాలా గ్రేవీ
  • పెరుగు రైతా
  • మటన్ కర్రీ
  • బటాని కర్రీ 
  • మష్రూమ్ కర్రీ
  • పన్నీర్ మసాలా కర్రీ
  • కాజు కర్రీ 

పైన వాటిల్లో ఏ కూర వేసుకున్న ఈ వెజ్ పురం అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీస్ తో పాటు పక్కన ఒక రెండు ఉల్లిపాయలు ముక్కలు పెట్టుకొని కడుపునిండా తినొచ్చు.

Conclusion

చూడండి ఎంతో రుచికరమైన మరియు తక్కువ సమయంతో తక్కువ కూరగాయలతో కడుపునిండా తినే వెతుకులం అనేది తయారైపోయింది. వంట నాని వాళ్ళు కూడా సులభంగా ఈ టెక్నిక్ వాడటం వల్ల చాలా అద్భుతంగా ఉండగలరు.

అంతే ఇంట్లో చాలా రుచిగా మరియు తక్కువ సమయంతో మరియు ఎక్కువ ఆరోగ్యము కలిసినా ఈ వెజ్ పులావ్ ని ఈ వారం మీ ఫ్యామిలీతో వండుకొని ఆనందంగా గడపండి.

Leave a Comment