ఇంట్లోనే హోటల్ స్టైల్ కుష్క తయారు చేయడం ఎలా – Kushka Recipe
కుష్క అనేది బిర్యాని ఫ్యామిలీకి( Biryani family) చెందినది. ఈ కాలంలో బిర్యాని స్టార్ట్ అయిన చాలా వెరైటీలు చాలా రెసిపీస్ అమల్లోకి వచ్చాయి.అందులోనే ఒకటి కుష్క. కుష్క కూడా సేమ్ బిర్యానీ లాగే ఉంటుంది కానీ అందులో వేసే స్పైసెస్ గరంమసాలు కాస్తంత మారుతాయి.ఇది బాస్మతి రైస్ తోనే కాదు వైట్ రైస్ తో కూడా వండుకోవచ్చు. కానీ బిర్యానీ అనేది మనం బాస్మతి రైస్ తోనే ఉండితేనే రుచిగా ఉంటుంది.కేవలం ఇంట్లో చిక్కే చిన్న చిన్న దినుసులతోనే కుష్క అనేది ఇంట్లో చాలా టేస్టీగా మరియు చాలా త్వరగా తయారు చేయొచ్చు. ఏమి చేయాలని అర్థం కానప్పుడు ఇంట్లో కనీసం 20 నిమిషాలు కూడా పట్టనట్లుగా చాలా త్వరగా ఇంట్లోనే తయారు చేసుకొని కమ్మగా ఉడికించుకోవచ్చు.
ఇంకెందుకు ఈ రెసిపీని చూసి పుష్క ఎలా తయారు చేయాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు – Ingredients
- బాస్మతి రైస్( Basmati rice) : రెండు గ్లాసులు
- పెరుగు: ఒక కప్పు
- కొత్తిమీర తరుగు: అర కప్పు
- పుదీనా తరుగు: అరకప్పు
- ఉల్లిపాయలు: నాలుగు
- పచ్చిమిరపకాయలు: ఒక నాలుగు
- కరివేపాకు: కొద్దిగా
- టమాటాలు: 4
- నిమ్మకాయ: ఒకటి
- బిర్యానీ మసాలాలు
- మసాలాపొడులు
- కారం: రెండు టేబుల్ స్పూన్లు
- ఉప్పు: తగినంత
- పసుపు: 1/2 టేబుల్ స్పూన్
- నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు
- నూనె: నాలుగు టేబుల్ స్పూన్లు
- ఎండు మిరపకాయలు: రెండు
- నీళ్లు: తగినంత
- అల్లం: నాలుగు
- వెల్లుల్లి: రెండు పాయలు
- కొబ్బరి తురుము :రెండు టేబుల్ స్పూన్లు
- జీడిపప్పు: రెండు టేబుల్ స్పూన్లు
బిర్యానీ మసాలా అంటే ఏమిటి – Biryani spices
- బిర్యానీ ఆకు: ఒకటి
- షాజీరా :రెండు టేబుల్ స్పూన్లు
- సోంపు: రెండు టేబుల్ స్పూన్లు
- లవంగాలు: ఆరు
- దాల్చిన చెక్క: రెండు
- అనాస పువ్వు: రెండు
- మరాటి మొక్క: రెండు
- జాపత్రి: 2
- కస్తూరి మేతి: రెండు టేబుల్ స్పూన్లు
- జాజికాయ: కొంచెం
కావలసిన బియ్యం ఎంచుకున్న పద్ధతి మరియు బియ్యాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవటం
మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే పాత బియ్యం వాడితే బియ్యం అనేది పలుకుగా వస్తుంది.
లేదా బీపీటీ రైస్ వాడితే కుష్క అనేది కూడా రుచిగానే ఉంటుంది.
మీరు ఎంచుకున్న బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కాస్త నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.
కావలసిన మసాలాపొడులు – Masala powder
- గరం మసాలా 1 టేబుల్ స్పూన్
- ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్
- బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ విధానం – Ginger garlic paste
ముందుగా అల్లాని 10 నిమిషాల పాటు నా వాటర్ లో నానబెట్టుకోవాలి. శుభ్రంగా అల్లం లోని మట్టి అంత పోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
సున్నులపాయలు పొట్టు పొట్టు ఒలిచి శుభ్రంగా మిక్సీ జార్లో క్యాట్ చేసుకోవాలి.
కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరి ముక్కలను మిక్సీ జార్ లో ఆడ్ చేసుకొని మెత్తగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి.
కూరగాయలు తరిగే విధానం – Chopping vegetables
ముందుగా ఉల్లిపాయలను చాలా వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి.
టమాటాలని ఒక టమాటా అని ఆరు పచ్చగా కట్ చేసుకుని పెట్టుకోవాలి బారుగా కట్ చేసుకోవాలి.
పచ్చిమిరపకాయని రెండిటిగా చీల్చి పక్కన పెట్టుకోవాలి.
కరివేపాకు ని ఆకులు విడదీసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి.
కొత్తిమీర మరియు పుదునా తరువు తరిగి పెట్టుకోవాలి.
కుష్కా తయారీ విధానం – Making process
ముందుగా స్టవ్ పైన ఒక వెడల్పాటి పాత్ర అంటే రైస్ కుక్కర్ గిన్నె లేదా మనం రైస్ వండుకునే కడాయి తీసుకోవాలి.
ముందుగా ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి మరియు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి.
నూనె నెయ్యి బాగా కాగిన తర్వాత అందులోకి జీడిపప్పులు వేయించుకోవాలి. జీడిపప్పు బాగా రంగు మారిన తర్వాత ఒక ప్లేట్ లోకి పక్కన తీసి పెట్టుకోండి.
ఇప్పుడు జీడిపప్పు పక్కన తీసి పెట్టుకున్నాక మనం ముందుగా బిర్యానీ స్పైసెస్ అన్ని ఒకటొకటిగా యాడ్ చేసుకోవాలి ( షాజీరా, సోంపు, యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, స్టార్ పువ్వు, మరాటి మొగ్గ, మరియు రెండు ఎండుమిరపకాయలు )
ఇవన్నీ వేసి ఘాటు వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే కాస్తంత వేగనివ్వాలి.
ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగును వెయ్యాలి. ఉల్లిపాయలనేవి కాస్తంత రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే దాదాపు మన బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటాం కదా అదే పద్ధతిలో ఫ్రై అవ్వాలి.
ఉల్లిపాయ ఉల్లిపాయ రంగు మారిన తర్వాత ఇందులోకి చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మరియు శుభ్రంగా కడుక్కున్న కరివేపాకు వేసి చెడ పట్ల ఇవ్వాలి.
తర్వాత మన ముక్కలుగా కట్ చేసుకున్న పండు పండు టమాటాలను కూడా కలిపి టమాటాలు అనేది మెత్త పడేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి.
టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా వేయించుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఆడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి.
ఇప్పుడు మనం దీంట్లోకి ఒక కప్పు ఫ్రెష్ పెరుగును యాడ్ చేసుకుందాం. పెరుగు వేసిన తర్వాత అడుగంటకుండా ఒక రెండు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి.
పెరుగు పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా. ఇవన్నీ యాడ్ చేసి బాగా సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర మరియు పుదీనా తరుగు వేసి బాగా వేయించుకోవాలి. కొత్తిమీర పుదీనా తరుగు అనేది కాస్తంత ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది.
ఇప్పుడు మనం ఎసురు పోసుకోవాలి. యేసు అనేది రెండు గ్లాసులకి ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఈ విధంగా ఎసరు పోస్తే బియ్యం అనేది పలుకుగా మరియు బాగా ఉడుకుతుంది.
ఎసరు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ లేదా మావులు రైసు వేసి బాగా ఉడికించుకోవాలి.
బియ్యం ఉడికేటప్పుడు ఒక నిమ్మకాయ జ్యూస్ దాంట్లో కలుపుకోవాలి.
బియ్యం వేసిన తర్వాత ఒక్కసారి గరిటతో తిప్పుకొని పది నిమిషాలు హై ఫ్లేమ్ లో మరొక 10 నిమిషాలు మీడియం ఫ్లవర్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి.
మనం ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టిన తర్వాత మూత వేసిన వెంటనే పైన ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి మరియు ముందుగా వేయించుకున్న నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పును కూడా వేసి మూత మరి బిర్రుగా పెట్టి పైన ఏదైనా పొరువాటి వస్తువుని ఉంచాలి.
అప్పుడే మనం వండిన కుష్క లోపల స్పైసెస్ గరం మసాలాలన్నీ రైస్ కి బాగా పడతాయి.
రైస్ బాగా ఉడికింది అని తెలుసుకోవటానికి ఒక గరిట తీసుకొని లోపటికి ఒత్తితే ఏ నీరు లేకపోతే రైస్ అనేది బాగా ఉడికినట్లు ఇంకా పైన కొత్తిమీర వేసుకొని మూత ఒక 10 15 నిమిషాల వరకు తెరవకుండా అట్లానే ఉంచితే మన కుష్క అనేది రెడీ అయిపోతుంది.
వేటితో తింటే బాగుంటుంది – Serve చేసే విధానం
చికెన్ కూర
రైతా
మసాలా గ్రేవీ
మటన్ కర్రీ
షేర్వా
Frequently Asked Questions About Kushka Recipe
Q.బాస్మతి రైస్ అనేది పాత భీమా ఎందుకు తీసుకోవాలి?
A.పాత బియ్యం అయితేనే పొడిపొడిగా వస్తుంది కొత్త బియ్యం అయితే అన్నం చిమిడి పోతుంది.
Q.సోంపు అనేది కుష్కాలు ఎందుకు ఆడ్ చేయాలి?
A.సోంపు వేయటం వల్ల ఖుష్కా కి మంచి ఫ్లేవర్ మరియు రుచి వస్తుంది.
Q.ఉల్లిపాయలు ఎందుకు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి?
A.ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే కుష్క అనేది మంచి టేస్ట్ వస్తుంది.
Q.జీడిపప్పు అనేది కచ్చితంగా వేసుకోవాలా?
A.జీడిపప్పు అనేది మీ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయొచ్చు.
Q.పుదీనా కొత్తిమీర తరుగు అనేది ఎందుకు ఎక్కువగా వేసుకోవాలి?
A.పుదీనా కొత్తిమీర తరుగు అనేది ఎక్కువగా వేసుకుంటేనే పుష్పాకి ఆ స్మెల్ అనేది బాగా కలుస్తుంది.
Q.చివర్న నిమ్మకాయ అనేది ఎందుకు వేయాలి?
A.నిమ్మకాయ వేయటం వల్ల అన్నం అనేది పొడిపొడిగా వస్తుంది.
Q.ఏ బియ్యానికి ఎంత విసురు వేసుకోవాలి?
A.బాస్మతి బియ్యం అయినా మామూలు బియ్యం అయినా యేసు అనేది ఒక అర గ్లాస్ తక్కువే పోసుకోవాలి.
మనం పాటించాల్సిన చిన్న చిన్న టిప్స్
మసాలాలన్నీ కలిపిన తరువాత అడుగంటకుండా చూసుకోవాలి.
ఎదురు ఎక్కువగా పోసుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి.
బియ్యం వేసిన తర్వాత గరిట ఎక్కువసేపు తిప్పకూడదు.
సోంపు మరియు పెరుగు తప్పనిసరిగా వేసుకోవాలి.
పోషక విలువలు
దీంట్లో మనం సోంపు యాడ్ చేయటం వల్ల జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది.
మనం దీంట్లో నెయ్యి వాడటం వల్ల మన ఎముకలు అనేవి బలంగా మరియు దృఢంగా ఉంటాయి.
మనం ఇందులో ఎక్కువ మసాలాలు యాడ్ చేయకపోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ అనేది ఏర్పడదు.
ఎసరు పోసుకొని బియ్యం ఉడికించుకోవడం వల్ల బియ్యంలోని పోషక విలువలు అన్ని మన శరీరానికి పుష్కలంగా దొరుకుతాయి.
ముగింపు
నేను చెప్పే విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు ట్రై చేయడం వల్ల ఇంట్లోనే హోటల్ స్టైల్ పుష్క అనేది రెడీ అయిపోతుంది. వంట రాని వారు కూడా సులభంగా చేసుకో విధంగా ఈ రెసిపీ తయారు చేయబడింది.
ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని ఫాలో అయ్యి మీరు కూడా ఇంట్లో తయారు చేసి అందరికీ వండి పెట్టండి ఆనందంగా తినండి.