Andhra Style Sambar Recipe | Spicy & Tasty Sambar at Home

ఇంట్లోనే రుచికరమైన సాంబార్ తయారీ విధానం – మన ఆంధ్ర స్టైల్ స్పైసీ సాంబార్

మన ఆంధ్రాలో తెలంగాణలో,తమిళనాడు, కేరళ,మహారాష్ట్ర,ఇటువంటి ప్రాంతాలలో కూడా సాంబార్ అనేది అత్యంత స్పెషల్ అయినా వంటకం. ప్రాంతాన్ని బట్టి వారి వారి రుచులు బట్టి దాని యొక్క చేసే విధానం మారుతుందే కానీ తినే పద్ధతి మరియు రుచి మాత్రం మారదు.అన్నంలోకే కాకుండా టిఫిన్ లోకి అంటే ఇడ్లీ వడ దోస కట్ట పొంగలి ఇట్లాంటివన్నీ టిఫిన్స్ లో కూడా సాంబార్ అనేది చాలా అద్భుతంగా కాంబినేషన్ గా తినొచ్చు. ఈ మధ్యకాలంలో కూడా ఉప్మాతో కావున కలిపి తినగలనంత రుచిగా ఉంటుంది సాంబార్.

ఈ సాంబార్ అనేది కొందరు కాస్తంత బెల్లం వేసి తీయగా చేసుకుంటారు మరికొందరు కాస్తంత కారం ఎక్కువ వేసుకొని స్పైసీగా చేసుకుంటారు ఇంకొకరు కొంచెం తీయగా పుల్లగా మరియు కారం కారంగా ఉండేటట్లు చేసుకుంటారు. ఆ ఆ ప్రాంతాన్ని బట్టి వారి రుచులను బట్టి ఈ టేస్ట్ అనేది మారుతుంది.

కానీ వన్డే తీరు వన్డే ప్రాసెస్ మాత్రం ఒకటే వేసే కూరగాయలు కూడా ఒకటే ఇలాంటి సాంబార్ ని మనం ఇంట్లోనే హోటల్ స్టైల్ లో మన ఆంధ్ర స్టైల్ లో చేసుకుంటే చాలా బాగుంటుంది మరియు మన ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది 

ఇప్పుడు నేను చెప్పిన రెసిపీని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వటం వల్ల మీరు కూడా ఇంట్లో చాలా అద్భుతమైన టేస్టీ అయిన సాంబార్ ను చేసుకోగలరు.

ముందుగా కావలసిన పదార్థాలు

  1.  కందిపప్పు ఒక కప్పు
  2.  చింతపండు నిమ్మకాయ సైజు ఎంత
  3.  మునక్కాయ రెండు 
  4.  టమాటాలు రెండు
  5.  చిన్న ఉల్లిపాయలు నాలుగు 
  6.  బెండకాయలు రెండు
  7.  వంకాయ ఒకటి
  8.  క్యారెట్ ఒకటి 
  9.  ఉల్లగడ్డ ఒకటి 
  10.  దోసకాయ ఒకటి 
  11.  రాడిష్ ఒకటి
  12.  కరివేపాకు ఒకరమ్మ
  13.  కొత్తిమీర కాస్తంత 
  14.  కారం తగినంత
  15.  ఉప్పు తగినంత 
  16.  పసుపు వన్ టేబుల్ స్పూన్ 
  17.  అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ 
  18.  బెల్లం ఒక చిన్న ముక్క
  19.  సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్
  20.  జిలకర వన్ టేబుల్ స్పూన్ 
  21.  ఆవాలు వన్ టేబుల్ స్పూన్ 
  22.  పచ్చనగపప్పు వన్ టేబుల్ స్పూన్
  23.  పచ్చిమిరపకాయలు నాలుగు 
  24.  ఎండుమిరపకాయలు రెండు 
  25.  నీరు తగినంత
  26.  ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్

ముందుగా కందిపప్పు ఉడకబెట్టుకునే విధానం

ముందుగా ప్రెషర్ కుక్కర్ లో ఒక కప్పు కందిపప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు కందిపప్పులో టూ కప్స్ వాటర్ పోసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కాస్తంత నూనె వేసి మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.

బాగా ఉడికిన పప్పుని పప్పుగుత్తిని తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఎక్కడ పప్పు పప్పు గా లేకుండా చూసుకోవాలి.

చింతపండును నానబెట్టుకునే విధానం

ముందుగా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకోవాలి. మనం తీసుకునే ఒక కప్పు కందిపప్పు కి చింతపండు అంతా సరిపోతుంది.

ఇప్పుడు చింతపండులోకి కాస్తాన్ని గోరువెచ్చటి నీళ్లు పోసి ఒక 10 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పదిహేను నిమిషాలు నానిన తర్వాత చింతపండులోని గుజ్జంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

కూరగాయల్లో కట్ చేసే విధానం

ముందుగా సాంబార్ లోకి చిన్న ఉల్లిపాయలు అనేది మార్కెట్లో చిక్కుతాయి అవి చిక్కితే ఉల్లిపాయ మొత్తంగా వెయ్యొచ్చు. లేదా మీ దగ్గర పెద్ద ఉల్లిపాయలే ఉంటే వాటిని ఒక ముక్కని నాలుగు ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి.

రెండు టమాటాలను పొడుగ్గా బారుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా రెండిటిగా చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి.

ఉల్లగడ్డను క్యారెట్ దోసకాయి ముల్లంగి ఇట్లాంటివన్నీ తొక్కు తీసుకునే వాటితో తొక్కు తీసుకొని అన్ని సమానంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి.

కరివేపాకును కొత్తిమీరను శుభ్రంగా రెండు మూడు సార్లు ఇసుకలు అనేది లేకుండా కడుక్కొని పక్కనుంచుకోవాలి.

బెండకాయని వంకాయని మీకు నచ్చిన విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. మునక్కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిలో ఉన్న పీసులు తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి 

అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మెత్తగా రుబ్బుకొని పక్కనుంచుకోవాలి.

ఇప్పుడు సాంబార్ కి పోపు పెట్టుకునే విధానం

ముందుగా ఒక కడాయి ఇలా అని ఒక దబరాగాన్ని తీసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి.

నూనె బాగా కాగిన తర్వాత ఇందులోకి రెండు ఎండు మిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు మరియు 1 టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వేసి కాస్తంత వేయించుకోవాలి.

ఇప్పుడు పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి కాస్తంత ఇంగువ యాడ్ చేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి

ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు రెండిటికాయలు చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.

ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు మనం కట్ చేసుకున్న అన్నీ కూరగాయల్ని అంటే మునక్కాయ వంకాయ బెండకాయ ఉల్లగడ్డ దోసకాయ ముల్లంగి క్యారెట్ ఈ మొక్కల్ని కలుపుకోవాలి.

ఇందులోనే కాస్తంత కరివేపాకు కూడా ఆడ్ చేసి కాస్తంత ఉప్పు మరియు కాస్తంత పసుపు కలిపి మొక్కలకు బాగా పట్టేంతవరకు గరిటతో కలుపుకోవాలి.

ఈ ముక్కలన్నీ ఒక 10 -15 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కూరకి సరిపడంతా కారం కూడా వేసి ముక్కలకి బాగా పట్టేటట్లు సింలో పెట్టుకొని వేయించుకోవాలి.

కారం వేసిన తర్వాత మన ముందుగానే నాన పెట్టుకున్న చింతపండు గుజ్జును ఇందులో వేసి ఒక రెండు మూడు నిమిషాలు పాటు బాగా మరగనివ్వాలి.

చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా మెత్తగా కలుపుకున్న కందిపప్పు మిశ్రమాన్ని నీటితో సహా వేసుకొని కలుపుకోవాలి.

ఇప్పుడు ఇందులోకి మనకు సరిపడం అంతా నీరు పోసుకొని. సాంబార్ పొడిగా కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి.

మరిగేటప్పుడే ఉప్పు కారం అన్ని సమతూలంగా సరిపోయినయో లేదో చెక్ చేసుకొని చివరన కాస్తంత బెల్లం ముక్క వేస్తే మన సాంబార్ రెడీ అయిపోయింది.

ఇక ఈ సాంబార్ ఒక ఐదు పది నిమిషాలు బాగా మరిగిన తర్వాత కాస్తంత కొత్తిమీర వేసి గాని చేసుకుంటే మన వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయినట్లే.

Leave a Comment