Fish Curry Recipe | Andhra Style చేపల పులుసు ఇంట్లోనే

Fish curry recipe- ఆంధ్ర స్టైల్ చాపల పులుసు ఇంట్లోనే సింపుల్ గా తయారీ.

Fish Curry Recipe ఇష్టంగా తినేవారిలో ముందు ఫిష్ కర్రీ ఫస్ట్ ఉంటుంది. ఈ చాపల పులుసు అనేది ఆంధ్ర స్టైల్ లో చాలా సింపుల్ గా మరియు చాలా టేస్టీగా తక్కువ మసాలాలు వేసి చేస్తారు.

ఇందులో వేసే టమాటా చింతపండు పులుసు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మరియు మసాలా దినుసులు వల్ల దీనికి మరింత రుచి ఏర్పడుతుంది.

ఇప్పుడు మన ఇంట్లోనే చాలా సులభంగా మరియు చాలా రుచిగా తక్కువ సమయం తీసుకునే చేపల పులుసును ఎలా చేయాలో చూద్దాం.

కింద నేను ఇస్తున్న ఈ ఆర్టికల్ లో ఎంతెంత మోతాదులో చెప్పు చింతపండు స్పూన్స్ చేయాలో ఎన్ని కూరగాయలు వేసుకోవచ్చు ఏవి మసాల వేయాలో డీటెయిల్ గా చెప్తున్నాను.

ముందుగా కావలసిన పదార్థాలు 

  •  చాపలు 500 గ్రాములు
  •  టమాటాలు రెండు
  •  ఉల్లిపాయ ఒకటి
  •  పచ్చిమిరపకాయలు మూడు
  •  కర్వేపాకు ఒకరమ్మ
  •  వెల్లుల్లిపాయలు రెండు
  •  అల్లం ఒక ముక్క
  •  ఎండు కొబ్బరి తురుము రెండు స్పూన్లు 
  •  జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ 
  •  ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ 
  •  ధనియాలు వన్ టేబుల్ స్పూన్ 
  •  మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ 
  •  లవంగాలు మూడు 
  •  దాల్చిన చెక్క ఒకటి
  •  ఫిష్ కర్రీ మసాలా వన్ టేబుల్ స్పూన్ 
  •  కొత్తిమీర కొద్దిగా
  •  ఉప్పు రుచికి తగినంత 
  •  కారం రుచికి తగినంత
  •  పసుపు 1/2 టేబుల్ స్పూన్
  •  నూనె నాలుగు టేబుల్ స్పూన్లు 
  •  చింతపండు నిమ్మకాయ సైజ్ అంత
  •  నీరు తగినంత

ముందు చేపల్ని శుభ్రంగా కడుక్కునే విధానం

ముందుగా చాప ముక్కల్ని శుభ్రంగా పొలుసు ఒక రఫ్ సర్ఫేస్ లాంటి బండ మీద వేసి గీక్కోవాలి అప్పుడే పైనున్న పొల్స్ అనేది శుభ్రంగా పోతుంది.

పైనున్న నల్లటి చర్మాన్ని ఒక నైట్ సహాయంతో చిన్నగా గీక్కోవాలి.

ఆ తరువాత శుభ్రంగా ఒక రెండు మూడుసార్లు మంచినీళ్లు పోసుకొని కడుక్కున్న తర్వాత కాస్తంత గళ్ళు ఉప్పు వేసి రెండు మూడు సార్లు తిప్పుకుంటూ వాష్ చేసుకోవాలి.

ఇలా కడగటం వల్ల చేపల్లో ఉన్న నీచువాసన అనే పోతుంది మరియు చాపల అనేది కూడా శుభ్రంగా ఉంటాయి 

మీకు అవసరమైతే ఒక చక్క నిమ్మరసం కూడా పిండి శుభ్రంగా కడుక్కోవచ్చు. ఉప్పుతో కడిగిన తర్వాత శుభ్రంగా మంచినీళ్లు పోసుకొని ఒక రెండు మూడుసార్లు కడుక్కోవాలి.

చింతపండు పులుసు తయారు చేసే విధానం

ముందుకు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి.

మనం తీసుకున్న చాపలను బట్టి చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. ఒక అరకిలో చేపలకి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే కరెక్ట్ గా సరిపోతుంది.

అల్లం వెల్లుల్లి తయారు చేసుకునే విధానం

ముందుగా అల్లాని ఒక అరగంట పాటు శుభ్రంగా మంచినీళ్లు వేసి నాన పెట్టుకుంటే పైనున్న మట్టి కూడా శుభ్రంగా పోతుంది.

శుభ్రంగా కడుక్కున్న అల్లా అన్ని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో కట్ చేసుకోవాలి.

ఇప్పుడు వెల్లుల్లి పొట్టు తీసుకొని శుభ్రంగా ఒక రెండు పాయల్ని అల్లం తో పాటు మిక్సీ జార్ లో వేసుకోవాలి 

ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసి కాస్త నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి.

అంతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది 

ఇప్పుడు మన ఇంట్లోనే చాపల పులుసు కావాల్సిన మసాలా తయారు చేసుకునే విధానం

ముందుగా ఒక డ్రై ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి.

ఇలా ఫ్రై చేసుకున్న మసాలాని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ల రెడీ చేసుకోవాలి. ఈ మసాలా వేయడం వల్ల మన చాపల కూర అనేది చాలా రుచిగా మరియు ఫ్లేవర్బుల్ గా ఉంటుంది.

కూరగాయలు కట్ చేసుకునే విధానం 

టమాట ముక్కల్ని ముందుగా శుభ్రంగా కడిగి పొడుగ్గా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఉల్లిపాయలు కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఉంచుకోవాలి.

పచ్చిమిరపకాయలను చీల్చి రెండు ముక్కలా కట్ చేసుకుని ఉంచుకోవాలి 

కరివేపాకును మరియు కొత్తిమీరను శుభ్రంగా నీటితో కడుక్కొని చిన్నగా ముక్కలా కట్ చేసుకుని ఉంచుకోవాలి.

Fish Curry తయారీ విధానం

ఇప్పుడు మీరు ఏ బాండీలో అయితే చాపల కూర ఉండాలి అనుకుంటున్నారో ఆ బండి తీసుకొని అందులో ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి బాగా చిటపటలాడినివ్వాలి.

ఇందులోకి మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి 

ఇప్పుడు ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసి బాగా చిటపటలాడివ్వాలి.

ఇలా ఫ్రై అయిన దాంట్లో టు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం సన్నగా తరుక్కున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి.

మీకు టమాటా ముక్కల్ని వేయటం ఇష్టం లేకపోతే టమాటాలను కూడా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ గా చేసుకొని గ్రేవీ ఆడ్ చేసుకోవచ్చు.

టమాటా టమాటా వేసిన తర్వాత ఐదు నుంచి పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి అంటే టమాటా అనేది కాస్త మెత్త పడేంత వరకు ఉడికించుకోవాలి.

మనం ఇప్పుడు మనం శుభ్రంగా శుభ్రంగా కడుక్కున్న చాప ముక్కలను ఒక్కొక్కటిగా పక్క పక్కన వేసుకోవాలి

చాపలు వేసిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ పసుపు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

ఒక పది నిమిషాల తర్వాత మనం చాపని ఒక గరిట సహాయంతో మరో పక్కకి తిప్పుకోవాలి.

మరో పక్కకు తిప్పుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం వేసి మరియు ముందుగా మనం పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ ఆఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని కలపకుండా మూత పెట్టాలి.

ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నాన పెట్టుకున్న చింతపండు పులుసు వేసి గెరిట లేకుండా మనం బండిని కానీ దేశాన్ని కానీ చేతితో తిప్పితే సరిపోతుంది.

పులుసు వేసిన తర్వాత మనకు రుచికి సరిపడా కారం సరిపోయిందో లేదో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని పులుపు కూడా సరిపోయిందో లేదో చూసుకొని కాస్త నీళ్లు పోసి 10 నుంచి 20 నిమిషాల పాటు సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టుకొని ఉడికించుకోవాలి.

చాప అనేది త్వరగా ఉడికిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు కాకపోతే మనం మసాలాలు కారము అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి పైన కొత్తిమీర చల్లుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిం లో పెట్టి వెంటనే మూత తీయకుండా స్టీమ్ కానివ్వాలి

ఇలా తయారైన చాపల పులుసుని వేడిగా తినకుండా కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది అంతే మన వేడి వేడి చాపల పులుసు అనేది రెడీ అయిపోయింది.

ఏ rice తో Fish Curry బాగుంటుంది?

  •  రాగి సంగటి 
  •  జొన్న సంగటి
  •  చపాతి
  •  పలావ్
  •  వైట్ రైస్
  •  కొబ్బరి అన్నం 
  •  దోస
  •  రోటి

మనం దీంట్లో తిన్నా మనకు ఇష్టంగా తింటే చాలా బాగుంటుంది అంటే మనం ఇష్టపడే ఏ అన్నంలో కన్నా ఏ రోటీలో కన్నా ఎటువంటి టిఫిన్స్ లోకి అయినా చాపల కూర అనేది చాలా బాగుంటుంది.

సాధారణంగా Fish Curry లో తప్పుల

చాపల్ని ఒకటి రెండు సార్లు రాళ్ల ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి లేకపోతే నీచు వాసన అనేది వస్తుంది 

చింతపండు పులుసు ఎక్కువగా కాకూడదు మరియు తక్కువ కాకూడదు అట్లా చూసుకోవాలి ఎక్కువగా అయితే పుల్లగా ఉంటుంది తక్కువ అయితే నీ సువాసన వస్తుంది.

చివర్న కారం ఉప్పు మసాలాలన్నీ కరెక్ట్ గా సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని చూసుకోవాలి.

అసలు చాపల కూర ఉండేటప్పుడు అసలు గరిట అనేది పెట్టకూడదు లేకపోతే చాపలనేది చిదిరిపోతాయి 

మసాలా అనేవి మన ఇంట్లో తయారు చేసుకునే వేసుకోవడం వల్ల మన చాపల కూరకి మరింత రుచి కలుస్తుంది.

నీచుకుర ఉండేటప్పుడు కాస్తంత నూనె ఎక్కువగా పడిందో లేదో చూసుకోవాలి 

చాపల కూర యొక్క పోషక విలువలు

చాపల అనేది మంచి ప్రోటీన్ సోర్స్ protein source

చాపలలో ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ మరియు ఇతర న్యూట్రిషన్ చాలా ఎక్కువగా ఉంటాయి.

డైట్ చేసే వాళ్ళు కూడా చాపా అనేది రోజు తీసుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రోటీన్స్ సోర్స్ కాబట్టి.

చాపల కూర తినటం వల్ల మన కళ్ళ కంటి చూపు అనేది మెరుగుపడుతుంది.

Frequently Asked Questions

1.మన చాపల కూరకి ఎటువంటి చాపలు ఎంచుకోవాలి?

మీరు తినే చాపలు బట్టి మీకు నచ్చే చాపలను బట్టి మీ ప్రాంతాల్లో చిక్కే చేపలను బట్టి చేపలను ఎంచుకోవచ్చు. ఏ చాపలైనా ఫ్రెష్ గా తాజాగా ఉండేటట్లు చూసుకోండి 

2.చింతపండు పులుసు ఎంత పొయ్యాల?

మనం తీసుకున్న చాపలను బట్టి చింతపండు పులుసు అనేది చూసుకోవాలి ఎక్కువగా పుల్లగా ఉండకూడదు తక్కువ పులుపు కూడా ఉండకూడదు.

3.మసాలా అనేది మన ఇంట్లోనే తయారు చేసుకోవాలా?

మీకు టైం ఉంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేకపోతే మనకి గ్రోసరీలో చిక్కే మసాలా పొడి కూడా వాడొచ్చు.

4.చాపలు చెదరకుండా ఎలా వండాలి?

చాపల కూర వండేటప్పుడు అసలు గరిట అనేది పెట్టకూడదు మందపాటి కడాయి గానీ బాండీ కానీ తీసుకోవటం మంచిది 

5.చాపల కూర అనేది చల్లారిన తర్వాత ఎందుకు తినాలి?

చాపల కూర వేడి మీద కన్నా చల్లారిన తర్వాతే మసాలాలన్నీ చేపకు పట్టి బాగుంటుంది.

6.చాపల కూర ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది?

చాపల కూర మొదటి రోజు కన్నా రెండో రోజు చాలా రుచిగా ఉంటుంది.

Conclusion

ఇంట్లోనే సులభంగా ఆంధ్ర స్టైల్ చాపల పులుసు తయారు చేయడం చాలా సింపుల్ మరియు తక్కువ మసాలాతో తక్కువ కూరగాయలతో తక్కువ సమయంతో చాలా రుచిగా ఉండే చేపల కూర తయారైపోయింది.

నేను చెప్పిన ఆర్టికల్ ద్వారా మీరు ఫాలో అయితే కచ్చితంగా రుచికరమైన చేపలు పులుసును మీరు కూడా ఇంట్లో తయారు చేయగలరు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చాపల పులుసు అనేది తయారుచేసి మీ కుటుంబంతో మీ పిల్లలతో ఆనందంగా గడుపుతూ తినండి.

Leave a Comment