Egg Curry Recipe in Telugu | Spicy & Tangy Egg Curry at Home
మన తెలుగు వారికి ఎవరికీ తెలియనిది లేదు దాంట్లో ఒకటే ఈ గుడ్డు కూర. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారైనా ఈ కూరని తయారు చేసుకొని తింటారు.ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా నాలుగు టమాటాలు మరియు ఉల్లిపాయలతోనే ఈ కూర వండుకోవచ్చు.చాలా సులభంగా మరియు ఎంతో సమయం కూడా తీసుకోకుండా మరియు చాలా రుచిగా ఇంట్లోనే త్వరగా వండుకోగలరు. మొదటిసారి వంట చేసేవారు కూడా ఈ రెసిపీ ఫాలో అవ్వటం వల్ల తొలిసారి కూడా చాలా అద్భుతంగా ఇంట్లోనే గుడ్డు పులుసు అనేది తయారు చేసుకోగలరు.
ఈ గుడ్డు కూరని ప్రతి ఒక్కరూ వండుకుంటారు కాకపోతే ఆ దేశాల్లో బట్టి ఆ రుచులు పట్టి వాటి రెసిపీ అనేది కాస్త మారుతుంది. నేను మాత్రం పక్కా ఆంధ్ర స్టైల్ లో గుడ్డు కూర వండుతున్నాను.
గుడ్డు కూర తయారుకి కావాల్సిన పదార్థాలు – ingredients
- గుడ్లు( Eggs):4
- టమాటాలు 6
- పచ్చిమిరపకాయలు రెండు
- ఉల్లిపాయలు మూడు
- జిలకర 1/2 టేబుల్ స్పూన్
- ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్
- లవంగాలు మూడు
- ఎండు మిరపకాయలు రెండు
- పచ్చనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్
- దాల్చిన చెక్క ఒకటి
- ఎండు కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు
- అల్లం ఒక కొమ్మ
- చున్నులపాయ ఒక రబ్బ
- ధనియాలు వన్ టేబుల్ స్పూన్
- గరం మసాల పొడి వన్ టేబుల్ స్పూన్
- జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్
- కారం రుచికి తగనంత
- పసుపు 1/2 టేబుల్ స్పూన్
- నూనె నాలుగు టేబుల్ స్పూన్లు
- ఉప్పు తగినంత
- కరివేపాకు రెండు రెమ్మలు
- నీరు తగినంత
- కొత్తిమీర తరుగు కొద్దిగా
ముందుగా గుడ్లు ఉడకపెట్టే పద్ధతి – Eggs boiling process
ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గుడ్లు వేసుకొని గుడ్లు మునిగేంత వరకు నీరు పోసుకోవాలి. నీరు పోసుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి.
ఈ కడాయిని స్టవ్(stove) పైన దాదాపు ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే గుడ్లనేది బాగా ఉడుకుతున్నాయి. గుడ్లు 20 నిమిషాలు ఉడికిన తర్వాత వెంటనే నీళ్లలో నుంచి తీయకుండా ఒక ఐదు నిమిషాలు పాటు వేడి నీళ్లలోనే ఉంచటం వల్ల గుడ్లు అనేది లోన ఉడకపోయిన ఉడుకుతుంది.
గుడ్లు ఉడికిన తర్వాత బయటకు తీసుకొని అందులో కాస్తాన్ని చల్లటి నీళ్లు పోసి గుడ్లు తొక్కలు నీటుగా వలుచుకొని పక్కన పెట్టుకోవాలి. తొక్కలు తీసిన తర్వాత ఒకసారి మంచి నీటితో కడుక్కోవాలి లేకపోతే ఎక్కడైనా తొక్కలు ఉంటే నోటికి తగులుతుంది.
ముందుగా గుడ్డలను గుడ్లను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి
మూకుడులో కాస్తంత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లను కత్తితో గాట్లు పెట్టుకొని కాస్తంత కారం ఉప్పు గరం మసాలా మరియు పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ కాస్తంత వేయించుకోవాలి.
కాస్త జాగ్రత్తగా ఉడికించుకోవాలి లేదంటే గుడ్లు అడుగంటుకుంటాయి అంటుకుపోతాయి అప్పుడు గుడ్డ అనేది త్వరగా చిదిరిపోతుంది.
కూరగాయలను తరిగే విధానం – Vegetables cutting process
ముందుగా అల్లాని కాస్తని నీరు పోసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అప్పుడు అందులోని మట్టి అంతా పూర్తిగా పోతుంది. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.
ఇప్పుడు చిన్న ఉల్లిపాయలను తొక్క తీసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం చిన్న ఉల్లిపాయలను కాస్తంత కొబ్బరి తురుము వేసి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సాధ్యమైనంత వరకు చిన్న ముక్కలుగానే కట్ చేసుకుని పెట్టుకోవాలి.
టమాటాలను కూడా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకును శుభ్రంగా ఆకులు మాత్రమే పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు గుడ్డు కూర తయారీ విధానం – Egg curry preparation
ముందుగా ఒక నాన్ స్టిక్ పాన్ గాని కడాయి గానీ తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె కలపాలి.
నూనె బాగా వేగిన తర్వాత ఇందులోకి లవంగాలు కాస్తంత దాలిచాక వేసి కాస్తంత వేయించుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు మరియు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి.
తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కాస్తంత ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా ఆడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఉల్లిపాయలు కాస్తంత రంగు మారిన తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు రెమ్మలు మరియు మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం చిన్న ఉల్లిపాయి కొబ్బెర పేస్ట్ ను వేసి.
పచ్చివాసన పోయేంతవరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోకుండా కూర అనేది రుచి లేకుండా ఉంటుంది.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి.
టమాటా వేసిన వెంటనే కాస్తంత పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి టమాటా గుజ్జు గుజ్జు అయ్యేంతవరకు ఉడికించుకోవాలి.
టమాటాలు కాస్త దగ్గరగా అయ్యేంతవరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మన కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి
అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి మసాలాలన్నీ టమాటాలకి బాగా పట్టేంతవరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు మనం తొక్క తీసి నీటుగా క్లీన్ చేసుకున్న మరియు ఫ్రై చేసుకున్న గుడ్లను చిన్నగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
గుడ్లు వేసుకున్న తర్వాత ఎక్కువగా తిప్పకుండా మనకు గ్రేవీగా కావాలంటే కాస్తాని నీళ్లు లేదా ఎక్కువ గ్రేవీ కావాలంటే మరిన్ని నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి.
చివరన కర్రీ మొత్తం దగ్గరకి అయ్యేంతవరకు ఉడికించుకున్న తర్వాత మన కూరలో ఉప్పు పూర్తిగా సరిపోయిందో లేదో చూసుకొని కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన గుడ్డు కూర అనేది తయారవుతుంది.
వన్డేటప్పుడు చేసే తప్పులు
గుడ్లను 10 – 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి లేకపోతే లోన గుడ్డ అనేది పచ్చదనం ఉంటుంది.
టమాటాలను వీళ్లంతా చిన్నదిగా కట్ చేసుకుని బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి లేకపోతే టమాటాలను గుజ్జు మరియు పచ్చి వాసన అనేది బయటికి రాదు పోదు.
ఉల్లిపాయలనేది మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా అని మాట పెట్టకూడదు.
ఉప్పు కారం మసాలాలు అన్నీ సమతూలంగా పడిందో లేదో ముందుగా చెక్ చేసుకోవాలి లేకపోతే కూర రుచి అనేది ఆయనతో బాగోదు.
మనం వేసే టమాటాలు తగ్గట్లుగానే నీరు పోసుకోవాలి లేకపోతే టమాట కూర అనేది రసం లాగా అయిపోతుంది.
Frequently Asked Questions About Egg Curry
Q.గుడ్లను దాదాపు ఎంతసేపు ఉడికించాలి?
A.దాదాపు 20 నిమిషాల పాటు ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
Q.టమాటాలను ఎన్ని వేసుకోవాలి?
A.మనం తీసుకున్న గుడ్లను బట్టి మనకు కావాల్సిన కూరను బట్టి టమాటాలను తీసుకోవచ్చు.
Q.ఉల్లిపాయలను ఎన్నిగా వేసుకోవాలి?
A.టమాటాలకు కాస్త తక్కువగా ఉల్లిపాయలను వేసుకోవాలి.
దేనితో తింటే రుచిగా ఉంటుంది:
- వేడివేడి అన్నం
- చపాతి
- పూరి
- పుల్కా
- పరోటా
- బాగా రా రైస్
- జీరా రైస్
- జొన్న రొట్టె
- రాగి సంగటి