Chicken Dum Biryani Recipe | Easy & Delicious Hyderabadi Style
తెలుగువారికి ఎవరికైనా తెలియని వంటకం అంటే చికెన్ బిర్యానీ మాత్రమే. సండే వచ్చినా లేకపోతే ఏదైనా పండగ వచ్చినా ఇంట్లో ఫస్ట్ గుర్తొచ్చేది చికెన్ బిర్యాని.ఈ పేరు వినగానే అందరికీ నోట్లో నోరూరుతుంది. దమ్ బిర్యాని అంటే చికెన్ ను మసాలాలు బాస్మతి రైస్ ఇవన్నీ టీ సువాసన మరియు రుచి బయటికి పోకుండా గట్టిగా మూత వేసి ఆవిరిలో ఉడికించి సన్న మంటపై ఉండటమే చికెన్ బిర్యాని.ఈ విధంగా వండటం వల్ల అన్ని మసాలాలన్నీ రైస్ కి మరియు చికెన్ కి బాగా పడుతుంది. చికెన్ మరింత జ్యూసీగా మరియు స్పైసీగా లోపట బాగా ఉడుకుతుంది.
ఈ వంటకం చేయటం చాలా కష్టమని అందరు
అనుకుంటారు. కానీ అన్నీ సరైన కొలతలతో మరియు సరైన టిప్స్ పాటిస్తూ చేస్తే ఈ దమ్ బిర్యాని చేయడం చాలా సులభం. ఒక్కసారి నేర్చుకున్నారంటే ప్రతి సండే ప్రతి పండగకి లేదా ప్రతి సెలబ్రేషన్స్ కి కూడా ఇంట్లోనే చికెన్ బిర్యాని వండుకొని తింటారు.ఇప్పుడు ప్రతి ఒక్కరూ బిర్యానీ తినాలంటే ఏదో ఒక రెస్టారెంట్ కానీ లేదా హోటల్ కి గాని వెళ్తారు కానీ మనం ఇంట్లోనే తయారు చేయడం నేర్చుకోవడం వల్ల మన హెల్త్ ని కాపాడుకోగలము మనము కావాల్సినప్పుడల్లా డబ్బులు వృధా చేయకుండా ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా తినొచ్చు.
ఇంకా ఆలస్యం చేయకుండా బిర్యాని తయారు చేయడం ఎలానో పూర్తి పద్ధతిలో చూపిస్తాను. చూసి మీరు కూడా నేర్చుకుని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి.
ముందుగా కావలసిన పదార్థాలు :
- చికెన్: 1 కేజీ( దమ్ బిర్యాని కావలసిన విధంగా పెద్ద ముక్కలు కొట్టించుకోవాలి )
-
బాస్మతి రైస్:1kg( పాత బియ్యం)
-
పెరుగు:1cup
-
అల్లం వెల్లుల్లి పేస్ట్ :3 tablespoons
-
కారం: 3 table spoons
-
పసుపు:1 tablespoon
-
ఉప్పు: రుచికి తగినంత
-
ధనియాల పొడి : 1 tablespoon
-
జీలకర్ర పొడి: 1 tablespoon
-
గరం మసాలా : 1 tablespoon
-
నిమ్మకాయలు:2( జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి )
-
నూనె:1 cup
-
పచ్చిమిర్చి :5( పొడవుగా కట్ చేసుకోవాలి)
-
పుదీనా: half cup ( సన్నటి తరుగు)
-
కొత్తిమీర: half cup( సన్నగా తరుగు)
-
బిర్యానీ స్పైసెస్ mixed( యాలుక, బిర్యానీ ఆకు, షాజీరా, జాపత్రి, అనాసపువ్వు, స్టార్ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, కస్తూరి మేతి, మరాటి మొగ్గ, ఎండు మిరపకాయలు, జాజికాయ )
-
నెయ్యి:4 table spoons
-
Saffron:1 tablespoon
-
ఉల్లిపాయలు:250grams( బాగా ఫ్రై చేసి అంటే మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నవి )
-
కెమెరా వాటర్ ( kewara water):1 tablespoon
-
గోధుమపిండి:1cup( మనం వండేంతరవాత బిర్యానీ ఒక దమ్ము పోకుండా ఉండటానికి గోధుమ పిండి ముద్దగా చేసి గిన్ని అంచులకు అదమాలి అప్పుడే మనం ఉడికించిన దమ్ అనేది ఎటు పోకుండా ఉంటుంది)
-
బిర్యానీ మసాలా :1 tablespoon
-
జీడిపప్పు: మీరు చిగుతగినంత ( జీడిపప్పుని మంచిగా నెయ్యిలో వేయించి వాడితే చాలా టేస్టీగా ఉంటుంది )
చికెన్ మ్యారినేట్ చేసే విధానం:
ముందుగా శుభ్రంగా చికెన్ ని రెండు మూడు సార్లు కడుక్కోవాలి. నీచు వాసన లేకుండా ఎన్నిసార్లు అయినా కడుక్కోవచ్చు.
శుభ్రంగా కడుక్కున్న చికెన్ ను ఒక మంద పార్టీ గిన్నెలో వేసుకోవాలి ( మనం ఏ వానలో అయితే దమ్ బిర్యాని వండాలనుకుంటున్నాము అదే బాండీలోకి చికెన్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి )
అందులో పసుపు కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్,ధనియాల పొడి, జీలకర్ర పొడి,పెరుగు, గరం మసాలా, బిర్యానీ మసాలా, సగం పుదీనా, సగం కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, క్రష్ చేసి పెట్టుకుని వేయించుకున్న ఉల్లిపాయలు మరియు నాలుగు టేబుల్ స్పూన్ల నూనె.
ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్లు నీటుగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని ఒక రెండు మూడు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి.
లేదా పొద్దున్నే ఉండాలనుకున్నప్పుడు రాత్రంతా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది మన మసాలాలన్నీ కూడా చికెన్ కి బాగా పట్టి దమ్ చేసినప్పుడు చికెన్ అనేది స్పైసీ స్పైసీగా జూసీ జూసీగా ఉంటుంది.
బియ్యం నాన్న పెట్టడం విధానం
ముందుగా మనం తీసుకున్న బాస్మతి రైస్ ను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక వన్ అవర్ పాటు నాన పెట్టుకోవాలి.
అప్పుడే రైస్ అనేది పొడిపొడిగా మరియు త్వరగా ఉడుకుతుంది. ఎప్పుడైనా బాస్మతి రైస్ అనేది కనీసం పాత రైస్ అయితే చాలా బాగుంటుంది.
అప్పుడే రైస్ అనేది పొడిపొడిగా వస్తుంది లేదా కొత్త రైస్ అయితే ముద్దముద్దగా అయిపోతుంది ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.
ఎసరు పెట్టే విధానం :
ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులో మనం కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి కేజీ అంటే ఒక రెండు గ్లాసులు కొలతనుకోండి అప్పుడు రెండు గ్లాసులకి కనీసం ఆరు గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఆ కొలత యూస్ చేసి మీరు ఎసరు పెట్టుకోండి.
ఎసరు ఎక్కువైనా పరవాలేదు మనం ఆ వాటర్ ని యూస్ చేయము కాబట్టి ఎక్కువ వాటర్ అయినా ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి ఎసురు తక్కువ కాకుండా చూసుకోవాలి ఇది మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు.
బియ్యం ఉడికిచ్చే విధానం:
బియ్యం కోసం పెట్టిన ఎసరును బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన ఎసర్లు కాస్తంత నూనె కాస్తంత కొత్తిమీర పుదీనా కాస్తంత నెయ్యి బిర్యానీ స్పైసెస్ అంటే యాలుక జాపతి కస్తూరి మేతి షాజీరా లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి మనం రైస్ లో వేయాలి.
నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా వెయ్యాలి. దాదాపు ఒక ఐదు ఆరు నిమిషాల లోపు రైస్ అనేది ఉడుకుతుంది.
మనం బియ్యం అనేది ఒక 70% వరకు ఉడకాలి అంటే. మనం ఒక అన్నం వెతుకు పట్టుకున్నప్పుడు మరీ మెత్తగా కాకుండా మరీ పలుకగా కాకుండా లిమిట్ గా ఉండాలి కాస్తంత పలుకుదనం ఉండాలి అప్పుడే మన బిర్యాని అనేది పొడిపొడిగా వస్తుంది మిగతా 30% అనేది మనం దం పెట్టినప్పుడు ఉడుకుతుంది.
రైస్ అనేది 70% ఉడికిన తర్వాత ఒక చుక్క నీళ్లు కూడా ఉండకుండా మనం జల్లించుకోవాలి అంటే ఒక జల్లుడు గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
లేయరింగ్ చేసే విధానం:
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యారినేట్ చేసిన గిన్నెను పక్కన పెట్టుకోండి. చికెన్ ముక్కలను మొత్తం ఒక ఆ గిన్నె అడుగున నీట్ గా పరచండి.
మనం 70% ఉడికించుకొని పక్కన పెట్టుకున్నా రైస్ ను ఒక లేయర్ గా పరచండి. మనం చికెన్ ఎట్లా అయితే చదరంగా పరిచాము అట్లానే ఒక లేయర్ గా బియ్యాన్ని అంటే మన ఉడికించిన రైస్ ని ఒక లేయర్ గా పరచండి మొత్తం కాకుండా కాస్తంత పక్కన పెట్టండి.
ఇప్పుడు రెండో లేయర్ గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కొత్తిమీర తరుగు పుదీనా కాస్తంత నిమ్మరసం కూడా వేసి రెండో లేయర్ గా వేయండి.
ఇప్పుడు ఈ లేయర్ తర్వాత మళ్ళీ కాస్తంత అన్నాన్ని అంటే బాస్మతి రైస్ ని ఆడ్ చేయండి. ఇప్పుడు రైస్ పైన మసాలా వేయండి అంటే బిర్యానీ మసాలా గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి కాస్తంత నెయ్యి వేసి మూడో లేయర్ గా వేయండి.
ఇప్పుడు ఆ మసాలాలు పైన కూడా రైస్ కాస్తంత రైస్ మిగిలిన రైస్ కూడా వేసేసి నాలుగో లేయర్ గా మనం పాలల్లో కలిపి పెట్టుకున్న.
కుంకుమ పువ్వు ని పైన చల్లండి. దాంతోపాటు కెమెరా వాటర్ ని కూడా ఆడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది.
మరియు దీంట్లో వేయించిన అంటే నెయ్యిలో వేయించిన జీడిపప్పుని కాస్తంత కొత్తిమీర అని కాస్తంత పుదీనా అని కూడా యాడ్(add) చేసి ఫైనల్ కోటింగ్. అంటే ఫైనల్ లేయర్ గా ఆడ్ చేయండి.
కాస్తంత నిమ్మరసం పైన సైడ్స్ అంటే గిన్నెకి సైట్స్ నా వెయ్యటం వల్ల రైస్ అనేది పొడిపొడిగా వస్తుంది కాస్తంత నెయ్యి కూడా యాడ్ చేయండి అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
ఇప్పుడు మిగిలిపోయిన అంటే వేయించిన ఉల్లిపాయలు గాని కొత్తిమీర గాని ఏవైనా మిగిలిపోతే లాస్ట్ కోటింగ్ గా వేసుకోవచ్చు.
ఫైనల్ గా గోధుమపిండి ముద్దను గిన్నెకి సైడ్స్ నా అదమాలి.అంటే గిన్నెకు ప్లేట్ పెడతాం కదా అటువైపు రౌండ్ గా అదిమీ మనం పైన ప్చేయాలి. ఎటువంటి గాలి ఆవిరి పోకుండా టైట్ గా ఫిట్ చేయాలి.
అలా ఫిట్ చేసిందని పైన ఏదైనా బరువైన వస్తువు అంటే రోకలి గాని ప్రెషర్ కుక్కర్ కానీ ఎట్లాంటి రాయి కానీ అట్లాంటివి పైన బరువాటివి పెడితే.
మనం చికెన్ దమ్ అనేది ఇరువైపులా పోకుండా. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో మరియు ఒక 20 మినిట్స్ పాటు సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి.
ఎక్కువసేపు హై లో ఉంచకూడదు ఎందుకంటే అడుగు వైపు ఉన్న చికెన్ అనేది మాడిపోతుంది. ఈ టిప్స్ అనేది ఫాలో అయితే చికెన్ దమ్ బిర్యాని చాలా టేస్టీగా మరియు పొడిపొడిగా వస్తుంది.
పాటించవలసిన చిట్కాలు:
దమ్ము తర్వాత మనం పాటించాల్సిన ముఖ్యమైన చిట్కా
మనం ఉడికించుకున్న తర్వాత అంటే మన బిర్యాని అనేది 30 మినిట్స్ ఇందులో ఉంచుతాం కదా ఆ టైం అయిపోయిన తర్వాత మనం వెంటనే మూత తీయకూడదు.
ఎందుకంటే మనం దం పెట్టిందంతా అప్పుడికి ఆవిరయ్యి మనం బండిలో ఉంటుంది మనం వెంటనే ప్లేట్ తీయడం వల్ల దమ్ అనేది బయటికి వచ్చేసింది అలా మూత తీయకుండా ఒక 10 టు 15 మినిట్స్ పాటు అట్లానే సైడ్ పెట్టేస్తే మన దమ్ అనేది చికెన్ కి రైస్ కు బాగా పడుతుంది మనకు ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది.
రైస్ కలిపేటప్పుడు మధ్యలో నుంచి కాకుండా ఒక వెడల్పాటి అంటే పొడవాటి గరిటను తీసుకొని అడుగు నుంచి ఒకపక్కగా కలుపుకోవాలి.
అప్పుడే మన చికెన్ అనేది ముక్కలవ్వకుండా వస్తుంది రైస్ కూడా బాగా కలుస్తుంది మరియు మనం రైస్ అనేది బాస్మతి రైస్ అనేది పొడిపొడిగా ఉంటుంది ఎక్కడ విరగదు.
వడ్డించే విధానం:
గుమగుమలాడే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన కమ్మటి ఉల్లిపాయ రైత అంటే పెరుగు పచ్చడి, మిర్చి కాసాలాడు మరియు నిమ్మకాయ బద్దలతో వడ్డించండి.
పర్ఫెక్ట్ గా ఉడికిన చికెన్ ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగి పోవాల్సిందే.
ఇక ఆలస్యం ఎందుకు? ఈ ఆదివారం మీ ఇంట్లో మీ చేతులతో ఈ పర్ఫెక్ట్ దమ్ బిర్యాని చేసి మీ కుటుంబ సభ్యులకు ఆశ్చర్యపరచండి.