మునక్కాయ చికెన్ కర్రీ( Drumsticks Chicken Curry )

Simple and delicious chicken drumsticks curry

మునక్కాయ చికెన్ కర్రీ( drumsticks chicken curry ):

 

Drumsticks Chicken Curry
Drumsticks Chicken Curry

ఇంట్లోనే టేస్టీ అయిన మునక్కాయ చికెన్ కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం:

మనకు తెలిసినంతవరకు చికెన్ అంటే చికెన్ తో చేసే రెసిపీస్ అంటే చికెన్ కర్రీ,చికెన్ ఫ్రై, చికెన్ పకోడా, చికెన్ బిర్యాని, ఇట్లాంటివే తెలుస్తుంది.
కానీ చికెన్ మునక్కాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయటం వల్ల మనకి ఆ రుచి అనేది అద్భుతంగా ఉంటుంది.
ప్రతిసారి చికెన్ వండేటప్పుడు కచ్చితంగా మునక్కాయ వేసి ట్రై చేస్తారు తప్పకుండా పూర్తి రెసిపీని చూడవలసిన.
నేను చెప్పింది రెసిపీ ఫాలో అయితే ఇంట్లోనే చాలా టేస్టీ అయిన మునక్కాయ చికెన్ కర్రీని చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు.
వంట రాని వాళ్లు కూడా సులభంగా వండే రీతిలో ఈ రెసిపీని పోస్ట్ చేయటం జరిగింది.

ఇప్పుడు కింద ఇచ్చిన రెసిపీని పూర్తిగా ఫాలో అవ్వండి :

ముందుగా కావలసిన పదార్థాలు :

  1.  చికెన్( chicken):1kg
  2.  మునక్కాయలు( drumsticks ):3
  3.  ఉల్లిపాయలు:3
  4.  టమాటాలు :2
  5.  పచ్చిమిర్చి :2
  6.  అల్లం:1/2 ముక్క
  7.  వెల్లుల్లి :3
  8.  ఎండు కొబ్బరి తురుము: two tablespoons
  9.  పసుపు: 1టేబుల్ స్పూన్
  10.  కారం: 2 table spoons
  11.  ధనియాల పొడి: 1 tablespoon
  12.  గరం మసాలా: 1 tablespoon
  13.  చికెన్ మసాలా: 1 tablespoon
  14.  జిలకర పొడి : 1 tablespoon
  15.  ఉప్పు :రుచికి తగనంత
  16.  కొత్తిమీర: చిన్న సైజు కట్ట ఒకటి
  17.  పుదీనా: చిన్న సైజు కట్ట ఒకటి
  18.  కరివేపాకు : రెండు రెమ్మలు
  19.  నూనె: ఒక కప్పు
  20.  నీరు: సరిపడ
  21.  నిమ్మకాయ: ఒకటి
  22.  పోపు దినుసులు: వన్ టేబుల్ స్పూన్

ముందుగా కూరగాయలు మసాలాలు సిద్ధం పెట్టుకునే విధానం:

ముందుగా కూరగాయలను మరియు పుదీనా, కొత్తిమీరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
ముందుగా ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
టమాటాలను పొడవుగా ఒక కాయను ఒక ఆరేడు ముక్కలు వచ్చేంతవరకు కట్ చేసుకుని పెట్టుకోవాలి.
పచ్చిమిర్చిని రెండుగా చీల్చి ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి.
అల్లంని ఒక అరగంట పాటు నానపెట్టుకొని మట్టి పోయేంతవరకు శుభ్రంగా కడుక్కోవాలి.
చున్నులపాయలను తొక్కలు తీసేసుకొని నీట్ గా వలుచుకొని పక్కన పెట్టుకోవాలి.
కొత్తిమీరను సన్నగా తరుగు లాగా కట్ చేసుకుని ఉంచుకోవాలి.
పుదీనాను కూడా సన్నగా తరుగులాగా కట్ చేసి పెట్టుకోవాలి.
కరివేపాకును శుభ్రంగా కడుక్కొని వాటి ఆకులు మాత్రమే తీసి పక్కన పెట్టుకోవ.
మునక్కాయని శుభ్రంగా కడుక్కొని పీసులు లేకుండా అన్ని సమానమైన మొక్కలు వచ్చేటట్లు కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు చికెన్ ని శుభ్రంగా కడుక్కునే విధానం( chicken cleaning) :

ముందుగా చికెన్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు కట్ చేసుకున్న మొక్కల్లోకి ఒకసారి వాటర్ యాడ్ చేసి క్లీన్ ( clean)గా వాష్ ( wash)చేసుకుందాం.
ఒక్కసారి నీటితో కడిగిన తర్వాత మన దగ్గర ఉన్న నిమ్మకాయను రెండు చెక్కలుగా కట్ చేసి ఆ జ్యూస్ ని ఈ చికెన్ లోకి ఆడ్ చేసుకుందాం.
నిమ్మకాయ వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ విధానం :

ముందుగా శుభ్రంగా కడుక్కున్న అల్లం మరియు తొక్క తీసుకున్న చున్నులు పైన ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్.
ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకుని. కాస్థాన్ని నీరు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.

మునక్కాయ చికెన్ కర్రీ తయారీ విధానం:( drumsticks curry preparation ):

Drumsticks Chicken Curry
Drumsticks Chicken Curry
ముందుగా మనం మందపాటివి కడాయి లేదా బండిని కానీ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కప్ ఆయిల్ యాడ్ చేసుకుందాం.
నూనె బాగా మరిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు( జిలకర, మినప్పప్పు, పచ్చనగపప్పు, పెసరపప్పు, ఆవాలు, ఇవన్నీ కలిపిన మిక్స్డ్ ) ఆడ్ చేయాలి.
పోపుదినుసులు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆడ్ చేసే. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మరియు కరివేపాకు రమ్మని వేసి బాగా చిటపటలానివ్వాలి.
తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట అనేది సిమ్ లో మాత్రమే ఉండాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
టమాట ముక్కలు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్న చికెన్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి.
ఫైవ్ మినిట్స్ చికెన్ ఉడికిన తర్వాత మనం కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలను కూడా యాడ్ చేసి. కాస్తంత పసుపు మరియు రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి.
మంటను హై ఫ్లేమ్ లో కాకుండా సిమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ మునక్కాయలను మెత్తగా ఉడికేంత వరకు వేయించుకోవాలి. దాదాపు 20 నిమిషాల(20 minutes) పాటు ఉడికించుకోవాలి
దాదాపు 20 నిమిషాల తర్వాత మన చికెను మరియు మునక్కాయలు అనేది మెత్తగా ఉడికిపోతాయి. చికెన్ ఉడికింది అని తెలియటానికి పైన మనకు నూనె తేలుతూ ఉంటుంది. అప్పుడే చికెన్ అనేది మెత్తగా ఉడికినట్లు.
చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత మనం ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ముందుగా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి,గరం మసాలా మరియు చికెన్ మసాలా.
మన స్పైసెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత వెంటనే నీరు పోయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిం లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కారం మసాలాలన్నీ బాగా చికెన్ ముక్కలకు పట్టేటట్లు ఒక గరిటతో కలుపుకోవాలి.
మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టిన తర్వాత మనం తగినన్ని నీరు పోసుకోవాలి. నీరు పోసుకున్న వెంటనే హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి.
మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మన టేస్టీ అయిన మసాలా మునక్కాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే.
చివరగా కాస్తంత కొత్తిమీర తరుగు మరియు పుదినా వేసి గాని చేసుకుంటే మన చికెన్ మునక్కాయ కర్రీ అనేది తయారైపోతుంది.
చివరన దింపేటప్పుడు ఉప్పు సరిపడిందా లేదా అని చూసుకొని ఒకసారి దింపితే చాలు. కర్రీ బాగా ఉడికిందని తెలియటానికి చివరలు లేదా బండి అంచులో పక్కన నూనె అనేది తేలుతూ ఉంటుంది.
నూనె అనేది పైకి తేలితే మన కర్రీ అనేది పర్ఫెక్ట్ గా కుక్( perfect ga cook ) అయినట్లు.

మునక్కాయ చికెన్ కర్రీ తినగలగా కాంబినేషన్స్ ( combination):

  1.  వైట్ రైస్

  2.  బగారా రైస్ 

  3.  టమాటా రైస్ 

  4.  బిర్యానీ 

  5.  కుష్క 

  6.  కిచిడి 

  7.  గోంగూర రైస్

  8.  వెజ్ పులావ్ 

  9.  నాన్ 

  10.  చపాతి 

  11.  పుల్కా 

  12.  పరోట 

  13.  జొన్న రొట్టె 

  14.  రాగి సంగటి 

వీటిలన్నిటిలోకి మన మునక్కాయ చికెన్ కర్రీ అనేది సూపర్ కాంబినేషన్ గా ఉంటుంది కచ్చితంగా ట్రై చేయండి.

కర్రీ ని టేస్టీగా రావాలంటే మనం పాటించవలసిన చిన్న టిప్స్ లేదా చిట్కాలు:

చికెన్ నిమ్మరసం వేసి కడగటం వల్ల చికెన్ లో ఉన్న నీచువాసన అనేది పోతుంది.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఉల్లిపాయలనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ లో కాస్తంత కొబ్బరి తురుము వేయటం వల్ల కర్రీ అనేది మంచి గ్రేవీ వస్తుంది
టమాటాలు బాగా మగ్గిన తర్వాతే మనం చికెన్ ముక్కలను యాడ్ చేసుకోవాలి.
స్పైసెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకోవాలి అప్పుడే మన కర్రీకి మరింత రుచి ఆడ్ అవుతుంది.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువ మంట పెట్టకూడదు ఎందుకంటే అడుగంటుకుంటుంది.
చివర నా కొత్తిమీర పుదీనాను వేయటం వల్ల మన కర్రీకి మంచి ఫ్లేవర్ ఆడ్ అవుతుంది మనం తినేటప్పుడు మంచి సువాసన కూడా వస్తుంది.
చివరన ఉప్పు సరిపోయిందో లేదో కచ్చితంగా చూసుకోవాలి లేకపోతే టేస్ట్ అనేది మనకు తెలియదు.

FAQ’S

1. చికెన్ ముందుగా మ్యారినేట్ చేయాలా?

A.చికెన్ ను మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం మునక్కాయలు ఉడికించాలి కాబట్టి చికెన్ తో పాటు మునక్కాయలు కూడా యాడ్ చేస్తే చికెన్ కూడా ఉడుకుతుంది.

2. అల్లం వెల్లుల్లి పేస్టు తో కొబ్బరి తురుము కూడా యాడ్ చేయొచ్చా?

A.కొబ్బరి తురుము ఆడ్ చేయడం వల్ల మన కర్రీ అనేది గ్రేవీ గా వస్తుంది..

3. చికెన్ తో పాటు మునక్కాయలు వేసి కర్రీ వండుకోవచ్చా :

A.చికెన్ తో పాటు మన ఇంట్లో ఉన్న ఏ కూరగాయలు అన్న వేసి మనం కర్రీ వండుకోవచ్చు.

4. ఈ కర్రీని ఎంతసేపు నిలువ ఉంచుకోవచ్చు?

A.ఏ కర్రీ అయినా ఒక రోజు పాటు తినొచ్చు.ఎక్కువ నిల్వ ఉండటం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది కాదు.

5. ఈ కూరకి ఎటువంటి మునక్కాయలు ఎంచుకోవాలి?

A.ఎప్పుడైనా ఏ కూర కైనా లేత మునక్కాయలు అయితేనే కూరకి చాలా రుచి ఏర్పడుతుంది.

జనరల్ గా చేసే తప్పులు :

చికెన్ ను ఎక్కువ సార్లు కడగటం. ఈ విధంగా కడగటం వల్ల చికెన్ లో ఉన్న పోషక విలువలు అన్ని తగ్గిపోతాయి.
కారం వేసిన వెంటనే నీరు వేయటం. వెంటనే నీరు పోయడం వల్ల ముక్కలకి కారం అనేది పట్టకుండా చెప్పగా అయిపోతుంది.
నూనె అనేది తక్కువ వేసుకోవడం. నీచు పదార్థాల్లోకి ఎప్పుడైనా నూనెను ఎక్కువగానే వేసుకోవాలి.
ఈ తప్పులను చూసుకుంటూ మీరు జాగ్రత్తగా ఉండకుంటే మీ ఇంట్లోనే చాలా రుచికరమైన మునక్కాయ చికెన్ కర్రీ అనేది తయారవుతుంది.

పోషక విలువలు:

ఈ కర్రీలో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. చికెన్ లో పుష్కలంగా ప్రోటీన్. మరియు మునక్కాయలు ఐరన్ పొటాషియం ఇంకా విటమిన్ సి కూడా మనకి లభిస్తుంది.
ఇటువంటి ప్రోటీన్స్ కలిగిన కూరలు తినటం వల్ల మన శరీరానికి ఎముకల పుష్టి జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.

ముగింపు:

సులభంగా రుచికరమైన చికెన్ మరియు మునక్కాయ కలిపి కర్రీ వండటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే చాలా సులభంగా తయారు.
మొదటిసారి వంట చేసే వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఈ రెసిపీ తయారు చేయబడింది.
ఇంకెందుకు ఆలస్యం ఈ ఆదివారం మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే చాలా రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన చికెన్ మునక్కాయ కర్రీని తయారు చేసి పెట్టండి తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి.

1 thought on “మునక్కాయ చికెన్ కర్రీ( Drumsticks Chicken Curry )”

Leave a Comment