Hotel Style Puri Recipe | Puri and Curry Recipe at Home

Hotel Style Puri and Curry Recipe – ఇంట్లోనే రుచికరమైన పూరి కూర తయారీ విధానం

ఉదయం లేచిన కాడ నుంచి ఫస్ట్ మనం తినే ఆహారమే టిఫిన్ ( Tiffin ). మనం బిజీ లైఫ్ లో మనం చాలా రకాల టిఫిన్స్ మరియు ఫుడ్స్ తింటాం.కాకపోతే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా ఇష్టంగా తినే టిఫిన్స్ లో పూరి మరియు పూరి కూర స్పెషల్. వేడివేడి పొంగిన క్రిస్పీ పూరీలతో వేడివేడి ఉల్లగడ్డ మరియు ఉల్లిపాయ కర్రీ చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.

ముందుగా పూరీలు తయారు చేయటం చూద్దాం

ఇప్పుడు మనం ఎక్కడ టిఫిన్స్ అమ్ముతారు ఎక్కడ బాగుంటుందో అని ఆలోచించడం మానేసి న్యూ రెసిపీ ని ఫాలో అవ్వడం వల్ల మీరు ఇంట్లోనే బాగా పొంగిన పూరీలు మరియు గుమగుమలాడే ఆలు కర్రీని తయారు చేయొచ్చు.

పూరీలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు 

  •  గోధుమపిండి రెండు

  •  రవ్వ వన్ టేబుల్ స్పూన్ 

  •  ఉప్పు తగినంత

  •  పంచదార హాఫ్ టేబుల్ స్పూన్ 

  •  నూనె వేయించిన నీకు సరిపడంతా 

  •  నీరు తగినంత

పూరీ పిండి కలపటం

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమపిండి 1/2 టేబుల్ స్పూన్ పంచదార రుచికి తగినట్టు ఉప్పు మరియు వన్ టేబుల్ స్పూన్ రవ్వ వేసుకోవాలి.

ఇప్పుడు కొద్దిగా నీరు పోసుకుంటూ మన చపాతి పిండిలాగా కలుపుకోవాలి. మరీ చపాతి పిండి అంతా మెత్తగా కాకుండా కాస్తంత గట్టిగానే కలుపుకోవాలి.

ఇలా కలుపుకున్న పిండిని ఒక తడిగుడ్డ వేసి ఒక 10 -15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం గోధుమ ముద్ద అనేది కొంచెం మెత్తగా వస్తుంది పూరీలు అనేది కూడా కాస్త మెత్తగా మరియు బాగా పొంగుతాయి.

పూరి తయారు చేసుకునే విధానం 

ముందుగా మనం కలుపుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న బాల్స్ గా సపరేట్ చేసుకోవాలి. మన చేతికి సరిపడంతా ముద్దను తీసుకోవాలి.

అలా సపరేట్ చేసుకున్న ముద్దను రౌండ్ గా చుట్టుకోవాలి.

ఇప్పుడు చపాతీ కర్ర మీద మరియు బండమీద కాస్తంత పొడి పిండి రాసి మన చపాతి లాగా పూరీ పిండిని ఒత్తుకోవాలి.

మరీ చపాతీల్లాగా మెత్తగా కాకుండా సైడ్స్ కాస్తంత మందంగా ఒత్తుకోవాలి మరీ పల్చగా ఒత్తుకోకూడదు.

ఇలా మిగతా ఉండాలన్నీ పూరీల్లా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి.

పూరీలను నూనెలో వేయించే పద్ధతి 

ఇప్పుడు పూరీలు తయారు చేసిన తర్వాత మనం వేయించుకోవడానికి ముందుగా కడాయిలో మునిగేంత వరకు నూనె పోసుకొని బాగా కాగనివ్వాలి.

మనం పూరీలను ఒక్కొక్కటిగా వెయ్యాలి అన్నిటినీ ఒకేసారి వేయకూడదు. ముందుగా పూరి వేయంగానే గరిట సహాయంతో కాస్తంత నూనె నీ పైన పోయటం వల్ల పూరే అనేది బాగా పొంగుతుంది.

ఇలా బాగా పొంగిన పూరీలను మనం టిష్యూ పేపర్లో గానీ ఏదైనా జల్లిడి గిన్నెలోకి కానీ తీసి పక్కన పెట్టుకుంటే లోపట ఉన్న ఆయిల్ కూడా బయటకు వచ్చేసి చేతికి తగలకుండా ఫ్రెష్ గా ఉంటుంది.

ఇప్పుడు పూరీ కూరకు కావలసిన పదార్థాలు 

  1.  బంగాళదుంపలు రెండు 

  2.  శెనగపిండి మూడు టేబుల్ స్పూన్లు 

  3.  ఉల్లిపాయలు నాలుగు

  4.  పచ్చిమిరపకాయలు నాలుగు 

  5.  కరివేపాకు ఒకరమ్మ

  6.  పసుపు ఆఫ్ టేబుల్ స్పూన్ 

  7.  ఉప్పు రుచికి తగినంత 

  8.  ఆవాలు వన్ టేబుల్ స్పూన్

  9.  జిలకర హాఫ్ టేబుల్ స్పూన్ 

  10.  పచ్చనగపప్పు వన్ టేబుల్ స్పూన్ 

  11.  ఎండు మిరపకాయలు రెండు 

  12.  నీరు తగినంత

  13.  నూనె నాలుగు టేబుల్ స్పూన్లు 

  14.  అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ 

  15.  కొత్తిమీర తరుగు కొద్దిగా 

కూరగాయలు సిద్ధం చేసుకునే విధానం

ముందుగా రెండు బంగాళదుంపలను కుక్కర్లో వేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.

నాలుగు ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలను మధ్యలో చీల్చి ఉంచుకోవాలి . కరివేపాకును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

మూడు టేబుల్ స్పూన్ల శెనగపిండిని ఒక బౌల్లో వేసుకొని కాస్తని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

కొత్తిమీరను శుభ్రంగా నీటితో కడుక్కొని చిన్నచిన్నగా తరిగి పెట్టుకోవాలి.

పూరి కూర తయారీ విధానం

ముందుగా కళాయి తీసుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి.

నూనె బాగా కాగిన తర్వాత అందులో ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు వన్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి.

ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి నాలుగు పచ్చిమిరపకాయలను పొడవుగా చీల్చుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి.

ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ కరివేపాకు రమ్మలు రెండేసి మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఉల్లగడ్డలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో క్యాట్ చేయాలి.

ఉల్లగడ్డలు కూడా వేసిన తర్వాత దీనికి రుచికి సరిపడా ఉప్పు మరియు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి పెట్టాలి.

ఇప్పుడు ఇందులోకి ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు పోసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శెనగపిండిని మిశ్రమాన్ని పూర్తిగా ఉండలు కట్టకుండా కర్రీలో వేసి తిప్పుకోవాలి.

అంతే చివరన కొత్తిమీర తరుగు వేసి గార్నిష్ చేసుకుంటే మన అద్భుతమైన పూరి కూర తయారైపోయింది.

పూరీలు వండుకునేటప్పుడు పాటించాల్సిన చిట్కాలు

పూరీలు పిండి కలిపేటప్పుడు కాస్తంత చక్కర వేయడం వల్ల పూరీలు మంచి రంగులు వస్తాయి.

పూరీలు బాగా పొంగాలంటే పూరీ చివర్లు మరీ మెత్తగా ఒత్తుకోకూడదు కాస్తంత మందంగానే ఉండాలి సైడ్ అనేవి.

పూరి పిండి కలుపుకునేటప్పుడు మరీ మెత్తగా కలుపుకోకుండా కాస్తంత గట్టిగా కలుపుకుంటూ నే పూరీలు అనేవి బాగా పొంగుతాయి లేకపోతే చెక్కల్లాగా వస్తాయి.

పూరీలు వేయించేటప్పుడు నూనె అనేది సమంగా కాగి ఉండాలి కాగిన పూరి వేసిన వెంటనే గరిటతో మనం పైన నూనె వేయటం వల్ల పూరి అనేది పొంగుతుంది.

పూరి కూర తయారు చేసేటప్పుడు పాటించాల్సిన చిట్కాలు

పూరీల్లోకి కట్ చేసిన ఉల్లిపాయలు పొడుగ్గా ఉండాలి మరీ చిన్న సైజులో కట్ చేయకూడదు.

పచ్చిమిరపకాయలైనవి మన కాలానికి సరిపడాట్లు వేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులోకి కారం అనేది వెయ్యము కాబట్టి ముందుగానే మన కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి.

ఉలగడ్డలు ముక్కలు కోసేటప్పుడు మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మనం తినేటప్పుడు అనుకూలంగా ఉండేటట్లు ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి. అప్పుడే నోటికి రుచిగా మధ్యమధ్యగా ఉల్లగడ్డలు తగులుతూ బాగుంటుంది.

తరువాత సెనగపిండి కలిపేటప్పుడు మనం కర్రీ అనేది ఉండలు కట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

శనగపిండి కూడా వేసిన తర్వాత కర్రీ కన్సల్టెన్సీ ని చూసుకొని నీరు అనేది మరీ దగ్గరగా మరి లూజుగా లేకుండా చూసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.

ఉప్పు అనేది కరెక్ట్ గా సరిపోయే విధంగా వేసుకోవాలి. కాస్తంత ఎక్కువైనా మరియు కాస్తంత తక్కువైనా ఈ కర్రీ అనేది టేస్ట్ ఉండదు 

Frequently Asked Questions About Puri and Curry

Q.పూరీ పిండిలో చక్కెర ఎందుకు వేయాలి?

A.చక్కర వేయడం వల్ల పూరీలు అనేది మంచి రంగులో వస్తాయి.

Q.పూరీ పిండిని ఎలా కలుపుకోవాలి?

A.పూరీ పిండిని మరీ మెత్తగా కాకుండా కాస్తంత గట్టిగా కలుపుకోవాలి.

Q.సెనగపిండి ఎప్పుడు వేయాలి?

A.శనగపిండి మన కోరంకొక 10 నిమిషాల్లో దింపుతామనంగా చివరన వెయ్యాలి నీళ్ళు పోసిన వెంటనే.

Q.పచ్చిమిరపకాయలన్నీ ఎన్ని వేసుకోవాలి?

A.మనం తినే కాలాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు.

Q.పూరీలు బాగా పొందాలంటే నూనె బాగా వేడిగా ఉండాలా?

A.పూరీలు బాగా పొందాలంటే నూనె సమపాలంగా కాగి ఉండాలి. మరీ ఎక్కువ కాగినా కూడా పూరి అనేది త్వరగా మాడిపోతుంది.

Leave a Comment